Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, August 25, 2011

అబా పన్షికర్ నుంచి సాయి ప్రసాదం

Posted by tyagaraju on 12:58 AM

25.08.2011 గురువారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు

తార్ఖడ్ కుటుంబం వారికి బాబావారు కలిగించిన/చూపించిన అద్భుతమైన లీలలను 28.07.2011 గురువారమునాడు ప్రచురించడం మొదలుపెట్టాను. ఆగష్టు 20 తారీకునాటికి పూర్తి చేయగలననుకున్నాను. కాని ఈ గురువారమునాటికి అనగ 25 తారీకుతో ప్రచురించడం పూర్తి అవుతోంది. శ్రీమతి సుప్రజగారు పంపిన పీ.డీ.ఎఫ్. ఫైలులో వెండి భరిణ గురించిన లీల లేదు. కాని ఆ లీలను నేను సాయి లీల పత్రికనుండి అనువాదము చేసి 13.01.2011 న ప్రచురించడం జరిగింది. కాని వరుస క్రమం తప్పకుండా ఉంటుందనే ఉద్దేశ్యంతో మరలా దానిని ప్రచురిస్తూ, తార్ఖడ్ గారి ఆఖరి అనుభవాన్ని కూడా ప్రచురిస్తూ, ఈ గ్రంథాన్ని ముగించడం జరుగుతోంది.

ప్రతీ రోజు క్రమం తప్పకుండా, మథ్యలో 2 రోజులు, అనుకోని అవాంతరం వచ్చినప్పటికి, ప్రతీరోజూ నా చేత ప్రచురించడానికి బాబా వారు చేసిన సహాయమే తప్ప మరేమీ కాదు. నాకీ అద్భుతమైన అవకాశాన్నిచ్చిన బాబా వారికి నా థన్యవాదాలు తెలుపుకుంటూ, మన సాయి బంథువులందరిమీద ఆయన అనుగ్రహపు జల్లులను నిరంతరం కురిపించమని మనసారా వేడుకుంటున్నాను.

యిక మిగతా రెండు అనుభవాలను చదవండి.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.



అపురూపమైన వెండి భరిణె

ఈరోజు మనం బాబా భక్తులైన తార్ఖడ్ కుటుంబములో శ్రీ వీరేంద్ర జ్యోతీంద్ర తార్ఖడ్ ముంబాయి వారు తన అనుభవాన్ని, సాయిలీల పత్రికలో కొన్నిసంవత్సరాల క్రితం వ్రాయగా, దాని అనువాదాన్ని ఆయన మాటలలోనే మీముందు ఉంచుతున్నాను. ఈ అనుభవం చదువుతుంటే ఒడలు పులకరిస్తుంది.

సాయి భక్తులందరూ కూడా ప్రతీరోజు ఊదీని ధరించి బయటకు వెళ్ళే అలవాటు చేసుకొవాలి.

సిల్వర్ బాక్సు (వెండి భరిణె) బై: వీరేంద్ర జ్యోతీంద్ర తార్ఖడ్ :: ముంబాయ్

నా మీద బాబా కురిపించిన అనుభూతి గురించి చెప్పేముందు నా గురించి కొంత గత చరిత్ర చెబుతాను. శ్రీ సాయి సచ్చరిత్రలో 9అథ్యాయంలో హేమాడ్ పంత్ గారు మా తాతగారైన బాబా సాహెబ్ తార్ఖడ్ గారి గురించి చెప్పడం జరిగింది.

సీతాదేవి రామచంద్ర తార్ఖడ్, రామచంద్ర ఆత్మారాం తార్ఖడ్ , జ్యోతేంద్ర రామచంద్ర ,వీరు ముగ్గురూ కూడా 1909 నుంచి 1918 వరకు బాబాతో ఉన్న అదృష్టవంతులు. అందుచేత తార్ఖడ్ ఫామిలీ కి తరతరాలకి ఆయన ఆశీస్సులు అందచేస్తూనే ఉన్నారు. బాబాగారు మాకులదేవత. ఆయన మమ్ములని ప్రతి విషయంలోను రక్షిస్తూ ఉన్నారు. మేము మా జీవితమంతా ఆయనయొక్క అనుగ్రహాన్ని పోందుతున్నాము. ఇంకా ముందు ముందు పొందుతామన్న నమ్మకం మాకుంది.

నేనిప్పుడు ఒక అద్భుతమైన అనుభూతిని మీ ముందు వుంచుతున్నాను.

ఈ సంఘటన 1973 నవంబర్ దీపావళి రోజులులో జరిగింది. నేను మొట్టమొదటి సారిగా విదేశాలకు వెళ్ళడానికి తయారవుతున్నాను. నేను పని చేసే కంపనీ వారు ట్రయినింగ్ నిమిత్తం ఇంగ్లాండ్ పంపిస్తోంది. నేనక్కడ లండన్ కి 100 కి.మీ. దూరంలో ఉన్న చోటమార్చ్ వరకూ ఉండాలి. అందుచేత అవసరమయినవన్నీ కూడా సద్దుకోవడం చాలా ముఖ్యం.

నేను శుక్రవారం బయలుదేరి శనివారం రాత్రికి చేరుకున్నాను. ఆదివారం విశ్రాంతి తీసుకున్నాను. సోమవారం పొద్దున్నే ఆఫీసుకు వెళ్ళడానికి తయారవుతుండగా నా దగ్గిర ఊదీ లేదని తెలుసుకున్నాను. చిన్నప్పటినుంచీ బయటకు వెళ్ళేటప్పుడు ఊదీ పెట్టుకోవడం మాకు అలవాటు. నాకు కొంత నిరాశ వచ్చింది. అప్పుడు నాకు ట్రావలింగ్ సూట్కేసులో మొట్ట్ఘమొదట ఊదీ పాకెట్ పెట్టి తరువాత బట్టలు సద్దటం నా భార్యకు అలవాటని గుర్తుకొచ్చింది. వెంటనే నేను సూట్కేస్ ఖాళీ చేసి చూడగా ఊదీ పాకట్ కనిపించింది

.కాని అది 5 నెలలు వరకూ వస్తుంది. నేను నా ఉద్యోగ రీత్యా ముంబాయి నుంచి తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండాలి. అందుచేత ముంబాయి వెళ్ళగానే ఒక వెండి డబ్బా ఊదీ వేసుకునేందుకు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నాను. లండన్లో ఈ చిన్న ఊదీ పాకట్ పెద్ద సహాయకారి.

లండన్ లో నాకు ఇచ్చిన ట్రయినింగ్ లో పని పూర్తి చేసుకుని మార్చ్ లో ముంబాయి వచ్చాను. ముంబాయి లో వెండి డబ్బా కొనడానికి నాభార్య, అత్తగారితో కలిసి గిర్గావ్ వచ్చాను. షాప్ లో ఉన్న కుర్రాడు 7,8 బాక్సులు చూపించాదు. కాని బాక్సు లకి అన్నీ మూతలు విడిగా వచ్చే విథంగా ఉన్నాయి. అందుచేత నాకు అల్లా మూత విడిగా రాకుండా, బాక్సుతోనే మూత అతికిఉన్నది కావాలని చెప్పాను. . ఆర్డర్ ఇస్తే తయారు చేయిస్తాను అని చెప్పారు. అంత చిన్న పనికి ఆర్డర్ ఇవ్వడం యెందుకు మరో షాప్ లో చూ ద్దా మని ప్రక్క షాప్ లోకి వెళ్ళాము. షాప్ వానికి నాకు కావలసిన బాక్సు చెప్పాను. షాప్ యజమాని పాత బాక్సు అయినా ఫరవాలేదా అని అడిగాడు. పాత బాక్సు అంటే యెమిటి? అని అడిగాను. కొంతమంది పాత వెండి సామాన్లు అమ్మేస్తూ ఉంటారు. వాటిలో మీఎకు కావలసిన బాక్సు ఉండవచ్చు. నాకు చాలా ఆశ్చర్యమనిపించింది ఇదివినగానే. పవిత్రమయిన బాబా ఊదీ వేసుకోవడానికి పాత వెండి బాక్సు కొనడమా? అదేమన్నా మంచి పనేనా?నా భార్య, అత్తగారు కూడా ఇలాగే ఆలోచించి మరో షాప్ లో క్రొత్త బాక్సు ఉంటుందేమో చూద్దమనుకున్నారు. కాని షాప్ యజమానిని బాథ పెట్టడం యెందుకని పోనీ తీసుకొచ్చాక వద్దని చెప్పవచ్చులే అనుకొని, సరే తీసుకురండి చూస్తామని చెప్పాము.

ఈలోపున షాప్ యజమాని మాకు యెలాంటి బాక్సు కావాలో అదే తెచ్చి ఇచ్చాడు. ఆ బాక్సు చూడగానే నాకు తెలివితప్పిపోయింది. యెందుకంటే అది చాలా నల్లగా ఉంది.నా మొహంలో భావాన్ని చూసి, షాప్ యజమాని అన్నాడు, "అయ్యా, ఒకవేళ మీరు కోరుకునే బాక్సు ఇలాంటిదే అయితే వర్రీ కావద్దు. దీనికి మెరుగు పెట్టి క్రొత్తదానిలా తయారు చేయించి ఇస్తాను" అన్నాడు. షాపతను పాపం చాల శ్రమ తీసుకున్నాడనిపించింది నాకు. బాక్సు మూత తెరిచి చూడగానే నాకు నోట మాటరాలేదు. బాక్సు వంక కన్నర్పకుండా చూడ టం మొదలుపెట్టాను. నా భార్య, అత్తగారు నన్నుచూసి యేమయింది అలా ఉండి పోయావు? యెమి జరిగింది? అన్నారు. వారికి బాక్సు చూపించగానే వాళ్ళకు కూడా నోటమాట రాలేదు.

బాక్సు మూత లోపల బాబా బొమ్మ అతికించి ఉంది.

ఇదంతా నేను అతిశయంగా చెప్తున్నానని అనుకోవద్దు. చిన్న బాక్సు లో బాబా బొమ్మ యెవరు ఫి ట్ చేస్తారు? పైగా ఇది 1974 సం. బాబా మీద భక్తి అంతయెక్కువగా లేదు. ఇప్పుడు ఉన్నంతగా అప్పుడు ఇంతమంది భక్తులు లేరు.

అందుచేత యెవరయిన బాబా భక్తుడు ఇంత శ్రమ తీసుకుని బాక్సులో బాబా బొమ్మ పెట్టాడంటే నాకు నమ్మబుథ్థిగాలేదు. లేకపోతే గణపతి, రాముడు, కృష్ణుడు, శంకరుడు, వేరే దేవుళ్ళ బొమ్మలు పెట్టుకునుందేవారు.

షాప్ యజమాని బాక్సుకి మెరుగు పెట్టించి ఇచ్చాడు. అది ఇప్పటికి మెరుగు తగ్గకుండా వుంది. ఇంట్లో ఇంకా కొన్ని వెండి సామాన్లు,బొమ్మలు ఉన్నాయి అవి కొంతకాలమయిన తరువాత నల్లగా మారాయి కాని, ఈ బాక్సు మాత్రం ఇంకా వన్నె తగ్గలేదు. ఈ బాక్సు యెప్పుడు నాతోనే ఉంటుంది. బాబా ఊదీ యెప్పుడు తీసుకున్నా బాబా దర్శనం బాక్సులో నాకు కనపడుతూ ఉంటుంది.

నేను గతం గుర్తు చేసుకుంటే, నేనేకనక కొత్త బాక్సుకి ఆర్డర్ చేసుంటే అందులో బాబా ఫోటో వుండేది కాదు. ఇప్పటికి అనుకుంటాను బాబా నాకోసమే ఆ బాక్సు తయారు చేయించారేమోనని. తార్ఖడ్ కుటుంబంలో మూడవతరంవారమయిన మాకు బాబామీద ఇంకా నమ్మకం బలపడింది.

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు



అబా పన్షికర్ నుంచి సాయి ప్రసాదం







యిక మామూలు క్రమంలో వాస్తవ సంఘటనలు ముందున్నాయి. మా బంగళా బ్లూ ప్రింట్ ని మేము తయారు చేసినప్పుడు, పూజ చేసుకోవడానికి, థ్యానానికి ఒక చిన్న పాలరాతి మందిరం కూడా ఉండాలని నిర్ణయించుకున్నాము. మందిరం తయారయింది, దానిలోకి నిలువెత్తు సైజు బాబావారి రంగుల చిత్రపటం ఉంచాలని బలమైన కోరిక కలిగింది. మేము చాలా ప్రయత్నం చేశాము కాని దొరకలేదు. అది ఏప్రిల్ నెల 1993. బొంబాయి మార్చ్ నెలలో విషాదకరమైన బాంబు పేలుళ్ళను చవి చూసింది. ప్రజలంతా అపరిచితులనెవరితోనైనా మాట్లాడటానికి భయపడేవారు. ఒక రోజున సాయంత్రం పొద్దు పోయాక ఒక అపరిచిత వ్యక్తి మా యింటి తలుపు బెల్ మోగించాడు. నా భార్య తలుపు వద్దకు వెళ్ళింది. ఆ అపరిచిత వ్యక్తి ప్రత్యేకంగా నన్నే కలుసుకోవాలని పట్టుపడుతున్నాడు. అతను నా పేరు చెప్పలేకపోవడంతో నాభార్య అతని గురించి కొంచెం అనుమాన పడింది. అప్పుడు నేను కల్పించుకోవడంతో నన్నతను గుర్తు పట్టాడు. షిరిడీలో లెండీ బాగ్ లో తామిద్దరమూ కలుసుకున్నామని గుర్తు చేసి, తనకక్కడ బాబా అనుభవాన్ని కూడా చెప్పినట్లు చెప్పాడు. అప్పుడు నాకు స్పష్టంగా బోథపడింది. అతను పూనా సాయి మందిరంలో సామాజిక సేవకుడు. అతనిని యింట్లోకి రావడానికి అనుమతించాను. అప్పుడది రాత్రి భోజనం చేసే సమయం కనుక మేమతనిని భోజనం చేయమన్నాము. దానికతను అంగీకరించాడు. మేము మాట్లాడుకుంటున్నపుడు నేనతనిని సాయిబాబా రంగుల చిత్రపటం కావాలనే నా కోరికను వెల్లడించాను. మేము కనక రంగుల చిత్రపటం కోసం చూస్తూ ఉండినట్లయితే, ఒక చిత్రకారుడినుంచి నిలువెత్తు చిత్రపటానికి రంగులు వేసినది పొందవచ్చని వెంటనే సమాథానమిచ్చి, అప్పుడే అబా పన్షికర్ మాకు సహాయం చేయగలరని చెప్పాడు. మరాఠీ రంగస్థలం మీద ప్రముఖ నటుడయిన ప్రభాకర్ పన్షికర్, అతని తమ్ముడయిన అబా పన్షికర్ ఫోన్ నంబరు అతని వద్ద ఉంది. నేనాయనకి ఫోన్ చేసి లండన్ లో ఉన్న అబా పన్షికర్ నంబరు తీసుకుని ఫోన్ చేశాను. రంగుల చిత్రపటం గురించిన నా కోరికను విని, అతను తాను మే నెలలో బొంబాయి వస్తున్నానని, తనను తన తమ్ముడు ఉండే చోట ప్రభాదేవి వద్ద కలుసుకోవచ్చనీ సమాథానమిచ్చాడు. నేను మే నెల దాకా నిరీక్షించి ఒక శనివారం సాయంత్రానికి కలుసుకోవడానికి అనుమతి తీసుకున్నాను. మేమంతా, అనగా నాభార్య కుందా, మా అమ్మాయి సుజాల్, నా కుమారుడు మహేంద్ర అందరమూ కలిసి 22, మే,1993 న. వెళ్ళాము. నా కతని గురించి అసలు తెలీదు. మా ముందు కాషాయ వస్త్రాలు థరించి మెడలో రుద్రాక్ష మాలతో ఒకాయన మాముందు కనిపించాడు. అబా పన్షికర్ గారు తనను తనను పరిచయం చేసుకున్నారు. నేనాయనకు చేతులు జోడించి 'నమస్కారం' చేసి నా కుటుంబాన్ని పరిచయం చేశాను. పూలదండ, కోవా ఏమీ తేకుండా ఉట్టి చేతులతో ఎలా వచ్చారని ఆయన కొంచెం మందలించారు. ఆయన మాకోసం చిత్రపటం తెచ్చినట్లు నాకసలెప్పుడూ చెప్పకపోవడంతో నేను కొంచెం ఆశ్చర్యపోయాను. ఏమయినప్పటికీ నా తప్పును మన్నించమని వెంటనే సిథ్థివినాయక మందిర ప్రాంతానికి వెళ్ళి పూలదండ, కొన్ని కోవా బిళ్ళలు కొన్నాను. ఆయన లోపలికి వెళ్ళి తనతో కూడా ఏనుగుసైజంతగ ఉన్న చిత్రపటాలను వుంచే పెట్టిని తీసుకునివచ్చారు. దానిని తెరచి డ్రాయింగ్ పేపరు చుట్టను తీశారు. ఆయన ఆ చుట్టను విప్పారు. దాని మీద ప్రసిథ్థమైన సిం హాసనం మీద కూర్చుని సాయి తన నిత్యమైన చిరునవ్వుతో మాముందున్నారు. ఆయన సలహామీద, 1 మీ.మీ.దళసరి కోడక్ పేపరు మీద చిత్రించబడ్డ రంగుల చిత్రపటానికి దండవేసి అందరికీ కోవా పంచాను. అబా గారు దాని మీద సందేశం యిలా రాశారు, "వీరేంద్ర, కుందా, సుజాల్, మరియు మహేంద్ర కు" --- అబా పన్షికర్ నుంచి సాయి ప్రసాదం"... కింద సంతకం చేశారు. అప్పుడాయన "మీ నిథిని తీసుకోండి" అన్నారు. పాఠకులారా అది నా జీవితంలో బంగారు క్షణమంటే నమ్మండి. ఏమి చేయడానికి నాకు నోట మాట రాలేదు.
నిస్సందేహంగా నాకది విలువకట్టలేని సంపద. నేను నాపర్సులోచి రూ.1,001/- తీసి ఆయనకిచ్చాను. కాని దానినాయన అంగీకరించలేదు. తాను బాబా ఫోటోలు అమ్మనని చెప్పారు. లండన్ లో సాయి మందిరానికి విరాళంగా తీసుకోమని చెప్పాను. అయిష్టంగానే ఆయన ఒప్పుకుని, చేతితో తీసుకోకుండా దానిని బల్లమీద పెట్టమన్నారు. ఆయన మా గత చరిత్ర గురించి అడిగారు. సాయిబాబాతో మా నాన్నగారికున్న అనుబంథం గురించి చెప్పాను. నేను చెప్పినది వినగానే నన్నాయన కౌగలించుకుని తానా రోజు తన జీవితంలో అమితమైన ఆనందాన్ని పొందానని చెప్పారు. ఆయన ఉద్విగ్న్నతతో లోపలికి వెళ్ళి రూపాయి నాణాలు రెండు తెచ్చి నాకిచ్చారు. నేను వాటిని తీసుకుని ఆయన ముందు సాష్టాంగ పడి "నేనిప్పుడు బాబా యొక్క నిజమైన ప్రసాదాన్ని పొందాను" అన్నాను. ఆయన దీనికర్థమేటని అడిగారు. "ఈ రెండు నాణాలు బాబాగారి విశ్వవ్యాప్తకమైన సందేశం అనగా 'శ్రథ్ఠా' మరియు 'సబూరీ' , ఆయన ఉన్న కాలంలో ప్రపంచం మొత్తం వ్యాపించిందని" చెప్పాను. నా వివరణతో అబా సంతోషంలో మునిగిపోయారు. ఆయన కళ్ళనుంచి ఆనంద భాష్పాలు జాలువారుతూండగా, తానారోజు ఒక నిజమైన సాయి భక్తుడిని కలుసుకున్నానని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు.

అప్పుడు ఆబా మాకు తన కథను చెప్పారు. ఆయన తండ్రి, గిర్గావ్ లో ఉన్న గణపతి మందిరం ప్రథాన పూజారి. తనకి 8 సం.వయసప్పుడు ఒక ముస్లిం ఫకీరు వారి యింటి ఆవరణలోకి వచ్చి సాయిబాబా ఫోటొనిచ్చారు. ఆబా, ఆఫకీరుతో తాను బ్రాహ్మణుల కొడుకుననీ, యింటిలో ముస్లిం బాబా ఫొటోను పెట్టనివ్వరనీ అన్నాడు. ఆపుడాఫకీరు, "బేటే, అబ్ తూ యిసే మత్ లే తేరీ కిస్మత్ మే లిఖాహై తూ ఇస్కీ జిందగీ భర్ సేవా కరేగా జోర్ ఇస్కే ఫోటో లోగోంకో బతా కరేగా" (అబ్బాయి, యిప్పుడు నువ్వీ ఫొటోని తీసుకోలేకపోవచ్చు, కాని నీ భవిష్యత్తుని చదవగలను. నువ్వు నీ జీవితాంతమూ ఆయన సేవ చేస్తావు. ఆయన చిత్రాలని నువ్వు ప్రజలకు పంచుతావు). ఆయన భవిష్యత్ సూచనలు నూటికి నూరుపాళ్ళు యధార్థం. ఆబా గారు తమ చరమదశ వరకు సాయిబాబా సేవలో ఉనారు. నేను మిమ్మల్ని మన్నించమని కోరుతున్నాను. నేను ఆయనని కీర్తిశేషులు అబా పన్షికర్ అని సంబోథిస్తాను, కారణం ఆయన మనమథ్యన లేరు.

విలువైన ఆ చిత్రపటాన్ని లామినేషన్ చేయించి దానికి చెక్క ఫ్రేము తయారు చేయించాను. 1993 సం.ఒక గురుపూర్ణిమనాడు, వన్ గాన్ లోని మా 'విజ్యోత్' బంగళా లో చిన్న సాయిమందిరంలో దానిని ప్రతిష్టించాము. అప్పటినుంచి మేము మా గురుపూర్ణిమని అక్కడే సామాన్యంగా యింటిలో జరుపుకునే పథ్థతిలోనే జరుపుకుంటాము.

యిది నా స్వంత చిన్న అనుభవం. నాకు కోరిక పుట్టినప్పుడెల్లా షిరిడీ వెడుతూ ఉంటాను. యిప్పుడు నేను పదవీ విరమణ చేసి, సుఖంగా జీవిస్తున్నాను. మేమిప్పుడు బాబాని ఒకటే ప్రార్తిస్తున్నాము. మా పిల్లలకు కూడా సాయిభక్తులే జీవిత భాగస్వాములుగా రావాలని, తార్ఖడ్ కుటుంబంలో లార్డ్ సాయి మీద ప్రేమ, భక్తి అలా నిరంతరం కొనసాగుతూ ఉండాలనీ ప్రార్థిస్తున్నాను.

ఆఖరుగా నేను సాయి భక్తులందరినీ కోరేదేమంటే సాయిబాబా మనకిచ్చిన మహా మంత్రాలయిన 'శ్రథ్థ, సబూరీ, ' అనగా నమ్మకం, సహనం, వీటిని మరవవద్దని. యదార్థంగా వీటికే కట్టుబడివుంటే ఈ రెండు మంత్రాలూ మీ కోరికలను తప్పక నెరవేరుస్తాయి. అపరిమితమైన నమస్కారములతో ఉచితమైన రీతిలో మనమెప్పుడు నిత్యం ప్రేమించే మనసాయికి ఈ క్రింది విథంగా అభివాదములు సమర్పించుకుంటూ ఈ గ్రంథాన్ని ముగించదలచుకున్నాను.
"అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాథిరాజ యోగిరాజ ప్రరబ్రహ్మ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరజ్ కి జై"



సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List