

24.08.2011 బుథవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు
రచయిత స్వంత అనుభవాలు
ఓం శ్రీ సాయినాథాయనమః
వెలకట్టలేని మా నాన్నగారి అనుభవాలని చదివిన తరువాత, నేను కూడా స్వంతంగా నా అనుభవాలను మూటకట్టుకుని వుండచ్చనే ఆసక్తితో మీరుంటారని నాకు ఖచ్చితంగా తెలుసు. నేనొకసారి ఒక మహిళా భక్తురాలికి ఒక అనుభవాన్ని వివరించాను. మా నాన్నగారి ఆథ్యాత్మిక అనుభవాలలాంటి విలువైన భండాగారం నాకు కలిగి ఉండకపోవచ్చని అందామె. కాని నేను అటువంటి పుణ్యాత్మునికి జన్మించడంవల్ల, ఆయననుంచి వారసత్వంగా లేశమాత్రమైనా పుణ్యాన్ని పొంది ఉండచ్చనీ అంచేత ఈ యుగంలో సాయి భక్తులందరికీ వివరించడానికి యోగ్యమైన కొన్ని అనుభవాలు ఖచ్చితంగా కలిగే ఉంటాయని అంది ఆమె.
ఈ విథంగా నేను ఆ పుణ్యాన్ని వారందరికీ పంచగలను. ఆ మహిళా భక్తురాలు యిచ్చిన ఆ ప్రత్యుత్తరం నన్ను కదిలించడంతో నాదృష్టిలో యింతవరకు నాకు కలిగినవి చిన్నవైనా, అల్పమైనవైనా సరే మీకందరికీ నేను తెలియ చేస్తున్నాను. ఈ విథంగా నేను నా "సాయి ప్ర్రితి" ని నా వైపునించి సాయి సేవగా స్పష్టం చేస్తున్నాను.
నా పూర్తి పేరు వీరేంద్ర జ్యోతీంద్ర తార్ఖడ్. మా పేర్ల వెనుక ఒక చిన్న కథ ఉంది. మా ముత్తాతగారు తన కొడుకులందరికీ మొదటి పేరు చివర "ద్రా' వచ్చేటట్లుగా పెట్టారు. ఈ సిథ్థాంతానికి మూల కారకులు నోబెల్ గ్రహీతయిన కీర్తిశేషులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ తప్ప మరెవరూ కాదు.

నా చిన్నతనం నించీ నేను మా యింట్లో ప్రతి గురువారం సాయంత్రం జరిగే సాయిబాబా ఆరతికి హాజరవుతూ ఉండేవాడిని. ఆ సాంప్రదాయం యిప్పటికీ కొనసాగుతోంది. అదృష్టవశాత్తు నా భార్య కూడా సాయి భక్తురాలు. ఆమె తన 5 వ సంవత్సరం వయసునుంచి, షిరిడీకి వెళ్ళి దర్శనం చేసుకుంటొంది. నేను మొట్టమొదటి సారిగా నాకు 18 సం. వయసప్పుడు షిరిడీని, నా యిద్దరు స్నేహితులు అమర్ భాగ్ తాని, శశి భాటియాలతో దర్శించాను. వివాహం అయిన తరువాత నేను మా అత్తవారి ఫ్లాట్ లో నివసించడం మొదలెట్టాను. నా భార్య 5 సం. వయసులో తన తండ్రిని పోగొట్టుకుంది. ఆడవాళ్ళు యిద్దరే అవడంతో ఒక మగ తోడు అవసరమయింది. మా అత్తగారు, భార్య యిద్దరూ కూడా సాయి భక్తులవడంతో నా సాయి సంస్కారాలకి యెటువంటి ఆటంకం కలగకుండా నిజానికి యింకా యింకా యెక్కువ పెరిగింది.
షిరిడీలో గురు పూర్ణిమ


విజ్యోత్ ఆవిర్భావం
ప్రియమైన పాఠకులారా, మనలో ప్రతి ఒక్కరం కూడా అతనిలో/ఆమెలో ఒక బలీయమైన కోరికని మోస్తూ ఉంటామని నా అభిప్రాయం. మా నాన్నగారు తనకు ఒక బంగళా, కారు, ఒకస్టొర్ రూం మట్టిపాత్రలన్నీ తినే ఆహార పదార్థాలతో నిండివుండి వీటన్నిటితో తాను కూడా ఒక థనవంతుడిననీ మాకు గుర్తు చేస్తూ ఉండేవారు. ఆయన జీవితం తరువాతి దశలో అవన్నీ మృగ్యమయిపోయాయి. నేను ఆయనకి ఆఖరి సంతానం. అందుచేత భగవంతుని దయతో నా స్వశక్తితో బాగా కష్టపడి పోగొట్టుకున్న సంపదనంతా మరలా సంపాదించాలనే బలీయమైన కోరికని సహజంగా నే మోశాను. బొంబాయిలో స్వంతంగా బంగళా కలిగి ఉండటమంటే అసాథ్యమయిన పని. నా భార్య కూడా ఖర్ లో బంగళాలోనే పెరిగింది. అందు చేత స్వంతంగా ఒక బంగళా ఉండాలనీ, కనీసం వార్థక్యంలోనయినా సుఖంగా జీవిద్దామని మాయిద్దరిదీ ఒకటే కోరిక.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment