13.09.2011 మంగళవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. బాబాతో అనుభవాలలో నాలుగవ అనుభవాన్ని తెలుసుకుందాము.
సాయితో సా.యి.బా.నిస. అనుభవాలు - 4
బాబా నానుండి పాదుకలను స్వీకరించుటఈ సంఘటన వేసవికాలం ఏప్రిల్, 1990 ఒక శనివారం సాయంత్రం జరిగినది.. ఈ అనుభవం నా మూడవ అనుభవంలోచెప్పిన గుడి వద్దనే జరిగినది.సాయితో జరిగిన నా మొదటి అనుభవంతో నా మనసంతా నిండిపోయి ఉంది. నామధురానుభూతులను యెప్పటికీ శాస్వతంగా ఉంచుకోవడానికి నేనేదయినా చేయగలనా అని వేప చెట్టుకింద నిలబడిఆలోచించ సాగాను. పాలరాతితో పాదుకలు చేయించి వేప చెట్టుకింద ప్రతిష్టిస్తే తగినట్లుగా ఉంటుందని భావించాను.
అదే సమయంలో ఆంజనేయస్వామి గుడిలో ఉన్న పూజారి బయటకు వచ్చి వేప చెట్టు చుట్టూ ప్రకక్షిణలు చేస్తూ నాదగ్గరకు వచ్చినాడు.. ఆయన నా ప్రక్కన నిలబడి నాతో మాట్లాడుతూ ఒక విచిత్రమైన కోరికను కోరాడు, ఆ కోరికఆయన మాటలలో మీకు చెబుతున్నా "అయ్యా, వచ్చే వేసవికాలం చాలా ఉగ్రంగా ఉంటుంది, ప్రతీరోజూ నేను కాళ్ళకుచెప్పులు లేకుండా గుడికి రావాల్సి వస్తోంది. అందుచేత దయచేసి మీరు నాకొక జత తోలు చెప్పులు దానంగా ఇవ్వమనికోరుతున్నాను. " అని అడిగారు. నేను చాలా ఆశ్చ్రర్యపో యాను., నేను సాయినాథులవారి జ్ఞాపకంగా ఈ వేపచెట్టుకింద పాలరాతి పాదుకలు ప్రతిష్టించడానికి ఆలోచించుచుండగా బాబా ఈ పూజారి రూపంలో నా నుండి తన పాదాలకు ధరించడానికి తోలు చెప్పులు కోరడము నా మనసులోని కోరికను తీర్చడానికే అని భావించాము. సాధారణంగా చెప్పులజత దానాన్ని యెవరూ స్వీకరించరు. కాని సాయినాధులవారు తాను తన భక్తులకు విధేయ సేవకుడనని సచ్చరిత్రలో చెప్పి యున్నారు. తన భక్తుల మనసులోని కోరికను తీర్చడానికి సదా సిథ్థముగా ఉంటానని చెప్పినారు. ఈఆలోచనలతో సాయినాధులవారే పాలరాతి పాదుకలకు బదులుగా తాను ధరించడానికి తోలుచెప్పులు అడుగుతున్నారని గ్రహించాను. అదే సమయంలో ఆయన కోరిన మరొక కోరిక కూడా నన్ను ఆశ్చర్యములోముంచివేసింది. తాను తన యింటిలో వంట చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నదని తనకొక కిరోసిన్ స్టవ్ కొనిపెట్టమనికోరినారు. ఆ గుడి పూజారి కిరోసిన్ స్టవ్ కోరడము ద్వారకామాయిలోని ధుని ఉండటము గుర్తు చేసింది. నేను ఈ రెండుకోరికలను తీర్చగలనని మాట ఇచ్చి ఆ మరుసటి శనివారమునాడు నూతన తోలు చెప్పులను దుకాణమునుండి కొని, తలపై పెట్టుకుని గుడికి వచ్చి పూజారిగారి పాదాలకు తొడిగినాను. నేను తెచ్చిన కిరోసిన్ స్టవ్ వారి యింటికి తీసుకునివెళ్ళి వారికి ఇచ్చినాను. ఆ సమయంలో బాబా గారు నా నుండి పాదుకలు, ధుని స్వీకరించిన అనుభూతిని పొందినాను. వారి ఆశీర్వచనాలు పొందినాను.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment