

04.09.2011 ఆదివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీమతి ప్రియాంకా గారి ఆంగ్లబ్లాగులో 21.09.2008 నాటి ప్రచురణకి తెలుగు అనువాదం అందిస్తున్నాను. యింటర్నెట్ లో యెన్నో వెబ్ సైట్లు, బ్లాగులు ఉండగా మరొకటి అవసరమా అన్న ఆమె స్నేహితురాలి ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాథానాన్ని తెలుసుకుందాము.
మనం సాయిబాబా గురించి యెందుకు రాయాలి
ఈ రోజు నా స్నేహితురాలొకామె నన్ను చాలా విచిత్రమైన ప్రశ్న ఒకటడిగింది. ఆమె నన్నిలా అడిగింది.. నువ్వు సాయిబాబాని గురించి యెందుకు రాస్తున్నావు. యిప్పటికే నెట్లో చాలా బ్లాగులు, వెబ్ సైట్లు వున్నాయి, నువ్వు కూడా యింటి దగ్గిర యెందుకంత శ్రమపడతావు...అని....ఒక విథంగా ఆమె కరెక్టే..ఆమె ప్రశ్న కూడా మంచిదే, నేను ఆ ప్రశ్నకి సమాథానం చెప్పదలచుకున్నాను. మొట్టమొదటగా బాబా గురించి రాయడానికి నేను ధైర్యం చేయను, బాబాయే నా చేత రాయిస్తున్నారు, మనం యెంతోమంది ప్రేక్షకుల మధ్య రంగస్థలం మీద ఆడుతున్న ఒట్టి తోలుబొమ్మలం మాత్రమే...దానికి మహా నిర్ణేత...సాయి.
యిక రెండవది, నేను సాయిబాబా మీద బ్లాగ్స్ తయారు చేస్తాను..ప్రపంచవ్యాప్తంగా నేను ఉచితంగా సాయి సచ్చరిత్రలు పంపుతున్నాను...ఉచితంగా ఊదీ పంపుతాను...ఇంకా.. అలా...అలా...
ఈ విశ్వంలో ప్రతీ సాయిభక్తుడి గృహానికి సాయిబాబా చేరాలి..మానవులందరూ తమ జీవితంలో ఒక్కసారయినా సచ్చరిత్రను చదవాలనీ..కారణం ఒక్కసారి చదివితే కనక వారు మారతారు..వారి ప్రవర్తనలోను, ఆలోచనలోను..ప్రవృత్తిలోను...వారు అనుకూలంగా ఆలోచిస్తారు..వారికి దయార్ద్ర హృదయం ఉంటుంది..వారు యితరులని మోసం చేయరు...వారు అసత్యమాడరు...ఇవన్ని నేను అనర్గళంగా ఈ కారణాలన్ని చెపుతూనే ఉన్నాను.
అప్పుడు కారులో నాపక్కన కూర్చున్న నా స్నేహితురాలు ఏడుస్తోందని గమనించాను. అటువంటి ప్రశ్న అడిగినందుకు క్షమించమని అడిగింది.
ఆమె అడిగింది కరెక్టే, ఆమే కాదు, మనమందరమూ కూడా సాయిబాబా గురంచి మనమెందుకు రాయాలి, చదవాలి అని ఆలోచిస్తాము.. అటువంటివారందరికీ నేను ఒకటే చెపుతున్నాను ఒక్కసారి సచ్చరిత్ర చదవండి అప్పుడు ఈ ప్రశ్న మరొకసారి అడగండి.
ఆయనలో నమ్మకముంచుకుంటే బాబా మీ జీవితాన్ని మారుస్తారు. ఒక్కసారి శ్రీ సాయిబాబా పాదాలవద్ద శరణాగతి చేస్తే ఏ సాథనలోను మీ కాలాన్ని వ్యర్థం చేసుకోనక్కరలేదు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment