

09.12.2011 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు
బాబాయే నా సర్వస్వం
ఈ రోజు బెంగుళూరు నించి విజయా రావు గారు బాబాతో తమ అనుబంధాన్ని తెలియ చేస్తూ మెయిల్ పంపించారు. ఇందులో ఆమెకు బాబా మీద ఉన్న అపరిమితమైన, భక్తి, శ్రధ్ధ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఏ జన్మలోనో ఆయనతో ఉన్న అనుబంధంతోనే మనము ఆయనకు దగ్గరవుతాము, ఆయన మనలని తనకు దగ్గరగా చేసుకుంటారు.
విజయగారు పంపించిన తన అనుభవాన్ని ఆమె మాటలలోనే ...
నాకు బాబా గురించి చిన్నప్పటి నుంచీ తెలియదు. నేను మచిలీపట్నం లో పీ.జీ చదువుతున్నప్పుడు మా రూం మేట్ ద్వారా నాకు బాబా పరిచయం అయింది. ఎం.సీ.ఎ. మొదటి సెమిస్టర్ నేను పరీక్షలు సరిగా రాయలేదు. నేను ఫెయిల్ అవుతానేమో నని చాలా టెన్షన్ గా వుంది. పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఒక సబ్జెక్ట్ 2 మార్కుల తో పోయింది. నేను బాబాని ప్రార్థించాను. రీకౌంటింగ్ కి పెట్టాను. నేను ఊహించని విధంగా మార్కులు వచ్చాయి. నేను సబ్జెక్ట్ పాస్ అయాను 70 పైన పెర్సెంటేజ్ వచ్చింది. బాబా రోజూ నా కలలో కనిపించేవారు. నా చేత పూజ చేయించుకునేవారు. నాకు అర్ధం అయేది కాదు, నేను బాబాకి పూజ చేయడం ఏమిటి అంతగా ఆ కలని పట్టించుకునేదాన్ని కాదు. కాని ఆ కల తొందరలో నిజం అవుతుందని నాకు తెలియదు, బాబాకి మాత్రమే తెలుసు....
నా చదువు పూర్తి అయింది. నేను ఉద్యోగం కోసం హైదరాబాదు వెళ్ళిపోయాను. బాబాని మనస్పూర్తిగా నమ్మితే చాలు మనం ఎక్కడ ఉన్నా ఆయన మనలని తన దగ్గరికి లాక్కుంటారు. అలాగే నేను కూడా. నేను ఉన్న హాస్టల్ లో బాబా పూజా గది వుంది. కొన్ని రోజుల వరకు నేను పట్టించుకొలేదు. బాబా నా మనసుని ఆయన వైపు లాక్కున్నారు. ఇంక రోజూ బాబా కి పూజలు చేయడం మొదలు పెట్టాను. కొన్నాళ్ళకి అందులో పూర్తిగా ఎలా మునిగిపోయానంటే ప్రతీ రోజూ 4 ఆరతులు ఇచ్చేదానిని. పొద్దున్నే కాకడ ఆరతి ఇచ్చి అభిషేకం చేసేదానిని. మధ్యాహ్ న్న ఆరతి ఇచ్చి భోజనం పెట్టేదానిని. సాయంత్రము, రాత్రి కూడా ఆరతి ఇచ్చి పడుకోబెట్టి నేను వెళ్ళి పడుకునేదానిని.
విజయగారు తమ యింటిలో బాబాని పూలతో ఏ విధంగా అలంకరించారో చూడండి.




ఎక్కడ బాబా భజన జరిగినా నేను వెళ్ళేదానిని. పుష్పాలంటే బాబాకి ఇష్టం అని ఎక్కువగా పూలను తెప్పించి బాబా గదంతా పూలతో అలంకరించేదానిని. బాబాకి దీపాలను వెలిగించడం అంటే ఇష్టం అని గది అంతా దీపాలు వెలిగించేదానిని.

ప్రతి గురువారము ఇలాగే చేసేదానిని. ఒక రోజు కనకదుర్గ అమ్మవారు నా కలలో కనిపించి నువ్వు ఎందుకు ఉద్యోగం చేయడంలేదు, బాబా నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోతారు ఎప్పుడూ నీతోనే వుంటారు. నువ్వు పిలవగానే వస్తారని చెప్పింది. నేను మనసులో అనుకున్నాను తలుచుకోగానే బాబా ఎందుకు వస్తారు అని వెనకు తిరిగాను. బాబా డాన్స్ చేస్తూ వచ్చేసారు. నిజంగా చాలా సంతోషం పొందాను.
మాది మధ్య తరగతి కుటుంబం. నా తల్లితండ్రులు నన్ను కష్టపడి చదివించారు. నా అన్నయ్య మెంటల్లీ రిటార్టెడ్ పెర్సన్. ఒకరోజు తను ఇంటిలో నుంచి వెళ్ళిపోయాడు. మెంటల్లీ రిటార్టెడ్ పెర్సన్స్ వాళ్ళకి ఏమి తెలియదు. చిన్నపిల్లలకంటే కూడా చాలా సున్నితమైన మనస్థత్వం కలిగి ఉంటారు. ఇంటిలో అమ్మావాళ్ళూ అన్నిచోట్లా వెతికారు, చాలా బాధపడ్డారు. రాత్రి అంతా బాధపడుతూనే వున్నారు. పొద్దున్న మా అమ్మగారు బస్ స్టాండులో వెతుకుతూ బాబాకి మొక్కుకున్నారు. మా అన్నయ్య దొరికితే షిరిడి కి వస్తామని. అనుకున్న వెంటనే బస్ స్టాండ్ లో కనిపించాడు. మేము అందరమూ చాలా సంతోషించాము. ఇదంతా బాబా లీల అని అనుకున్నాము. బాబాయే కరుణ చూపకపోతే నా అన్నయ్య మాకు దక్కేవాడు కాదు. అంతేకాకుండా అప్పటి నుంచి అన్నయ్య ఎవరి తోడూ లేకుండా ఒక్కడే బయటకి వెళ్ళడం మానేసాడు. ఇంత మార్పు తీసుకువచ్చింది బాబానె......బాబాకి ఎంతో ఋణపడివున్నాము....
విజయ
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment