19.04.2012 గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు నెల్లూర్ నించి సుకన్య గారు పంపిన పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలి బాబా లీలను చదువుకుందాము.
నాజీవితాశయాన్ని నెరవేర్చిన బాబా
నేను రెండుసంవత్సరాలకు పైగా యునైటెడ్ కింగ్డం లో ఉంటున్నాను. క్రిందటి సంవత్సరం జనవరిలో నాకు అబ్బాయి జన్మించాడు. యెప్పటినుంచో నాకు యూ.కే.లో యింజనీరుగా ఉద్యోగం చెయాలని కోరిక. వివాహానికి ముందు భారత దేశంలో యింజనీరుగా పనిచేశాను, తిరిగీ మరలా ఉద్యోగం చేయాలని నా కోరిక. క్రిందటి సంవత్సరం మా బాబుకు 6 నెలల వయసప్పుడు తిరిగి ఉద్యోగాల వేటలో పడ్డాను. కాని ఏమీ ఫలించలేదు. చాలా కాలం యింట్లోనే ఉండిపోయాను. ఉద్యోగానికి ఏ ఇంటర్వ్యూ కాల్స్ రాకపోయేటప్పటికి నాకు చాలా నిరాశ వచ్చింది. బాబా ప్రశ్నలు సమాధానాలు పుస్తకంలో, ఒక స్నేహితుడు వచ్చి సహాయం చేస్తాడు, అది జరుగుతుంది అని సమాధానం వచ్చింది.
అనుకోకుండా ఒక రోజు యూ.కే. లో ఉంటున్న నా చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు. అతనినికి నేను ఉద్యోగం కోసం వెతుకున్నట్లు చెప్పాను. అతను నాకు సహాయం చేస్తానని చెప్పాడు. నా రెజ్యూం ని మరలా రాయించి, అతను తన కంపనీలో పనిచేస్తున్న ఒక వ్యక్తితో నాఉద్యోగం గురించి మాట్లాడాడు. నెలలు గడుస్తున్నా ఏ ఫలితం కనపడలేదు.
తరువాత నేను 9 గురువారముల వ్రతం మొదలుపెట్టి, డిసెంబరు, 29, 2011 న పూర్తి చేశాను. ప్రతీసారి నేను బాబాని నా ఉద్యోగం గురించి అడుగుతూ ఉండేదానిని, అన్నిటికీ అనుకూలంగానే సమాధానం వచ్చేది.
ఒకరోజు షివపూర్ మందిరం లీలల గురంచి నాకు మైల్ వచ్చింది. అక్కడ పూజకోసం డొనేషన్ పంపించాను. అమిత్ గారితో మాట్లాడి నా ఉద్యోగం గురించి బాబాని ప్రార్ధించమని చెప్పాను. జనవరి 2012 కల్లా నాకు ఉద్యోగం వచ్చేలా చేయమని వెబ్ సైట్ ద్వారా షిరిడీకి నా ప్రార్ధనలను పంపించాను. నాకు ఏవిధమైన జవాబు రాకపోవడం వల్ల రోజు రోజుకీ నాకు పిచ్చి ఎత్తినట్లుగా ఉండేది. తరువాత జనవరి, 13, 2012 న, 19 వ.తారీకు యింటర్యూ కి రమ్మని కాల్ లెటర్ వచ్చింది. యింటర్వ్యూ గురువారము.అప్పటివరకు నాకు ఒక్క యింటర్వ్యూ కాల్ కూడా రాలేదు.
ఈ కంపనీ కూడా పెద్ద కంపెనీలలో ఒకటి, ఇది మాయింటికి దగ్గరలోనేఉంది. నాకెప్పుడూ ఆ కంపెనీలోనే పనిచేయాలనే కోరిక.
నాకు అప్పచెప్పబోయే పనిలో అనుభవం లేనందువల్ల నాకు భయంగా ఉంది. నాకు ఆ సబ్జెక్ట్ లో డిగ్రీ మాత్రమే ఉంది, ఏమాత్రము అనుభవం లేదు. నేను బాబాని ప్రార్ధించి యింటర్వ్యుకి వెళ్ళాను. యింటర్వ్యూ బాగా చేశాను. ఫలితం కోసం ఎదురుచూడసాగాను. రోజులు గడిచిపోతున్న కంపెనీనుంచి ఎటువంటి సమాధానమూ రాలేదు. బాబాముందు రోదించి, ఆయన అనుగ్రహం చూపమని ప్రార్ధించాను. ఒక గురువారమునాడైనా నాకు సమాధానం వస్తుందని ఎదురుచూశాను,కానీ రాలేదు. నాకు చాలా నిరాశ వచ్చింది. జనవరి 31 వచ్చింది, కాని ఎటువంటి సమాధానము రాలెదు. నా హృదయం క్షోభించింది, నేను బాబాతో దెబ్బలాడాను, నాకు జనవరి 2012 లో ఉద్యోగాన్నిమనమని షిరిడీకి కూడా నావిన్నపాలు పంపించాను ఎందుకని నా కోరిక తీర్చలేదని. ఇక్కడే విచిత్రం జరిగింది.
ఫిబ్రవరి 1 తారీకున పోస్ట్ లో నాకు ఆఫర్ లెటర్ వచ్చింది, అది జనవరి 31వ తారీకున పోస్ట్ చేయబడింది. బాబా తన మాటను నిలబెట్టుకుని నాకు చేసిన సహాయానికి షాక్ కి గురయ్యాను. షిరిడీలో బాబా నాప్రార్ధనలని ఆలకించినందుకు,
షివపూర్ లోని బాబా
నన్ను ఆశీర్వదించినందుకు నాకు చాలా ఆనందం కలిగింది. నా జీతంకూడా నేను ఊహించనిది, నాకప్పగించబోయే పనికూడా ఆశ్చర్యకరమే.కంపెనీ కూడా మాయింటినించి నడిచే దూరంలోనే ఉంది. ఇక్కడ విచిత్రమేమంటే, నేను డిసెంబరు 29 న ఉద్యోగానికి అప్ప్లై చేశాను. ఆరోజు నేను వ్రతం పూర్తి చేసిన రోజు. యింటర్వ్యూ జనవరి 19 న జరిగింది, అదే రోజున నా ప్రేయర్స్ షిరిడీకి చేరాయి. బాబా ముందుగానే ఇవన్నీ ఏర్పాటు చేసి తనలీలను చూపించారు.
నాకోరిక బాబా తీర్చి, నాకు ఉద్యోగాన్నిచ్చారు, ఇదంతా తలుచుకుంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇటువంటి పెద్ద కంపెనీలో కూడా నాకు అసలు అనుభవం లేదు. బాబాముందు నేను కన్నీళ్ళతో నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
నేను బాబాకి తగినంతగా కృతజ్ఞతలు తెలుపుకోలేకపోవచ్చు,కాని బాబాయే నా సర్వస్వం. నాజీవితాన్ని నేను బాబాకి అంకితం చేశాను. నాకర్ధమైనదేమిటంటే, తన బిడ్డలకు ఏది ఇవ్వాలో బాబాకు బాగా తెలుసు, కాని మనకు ఆయన మీద సడలని నమ్మకం ఉండాలి. నాకీరోజు ఆయన తన లీలను చూపించారు, మీకు కూడా చూపించవచ్చు. షివపూర్ లో ఉన్న బాబా కూడా ఎంతో దయగలవారు. తన భక్తుల కోరికలను తీర్చడానికి ఆయన అక్కడ ఉన్నారు.
జై సాయినాధ్, కోటి కోటి ప్రణామాలు, బాబా అందరినీ దీవించుగాక.
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment