Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, May 11, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1996 (09)

Posted by tyagaraju on 5:00 PM


12.05.2012  శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


సాయి.బా.ని.. డైరీ -  1996  (09)

18.10.1996

నిన్నరాత్రి శ్రీసాయి నా చిన్ననాటి స్కూల్ టీచర్ రూపములో దర్శనము ఇచ్చి నాలో దాగి ఉన్న తప్పులను చూపి నా చేతిమీద బెత్తముతో కొట్టి నాకు కనువిప్పు కలిగించినారు. ఆయన చెప్పిన మాటలు.

1) అనవసరముగా ఇతరుల విషయాలలో కలుగచేసుకోకుండ నీపని నీవు చేసుకొంటు యోగిలాగ జీవించుతు మంచి పేరు తెచ్చుకోవాలి.

2) తప్పులు చేయటము మానవ నైజముఆతప్పులను సరిదిద్దుకోవటము మాధవుని దయకు పాత్రుడు అవటమునీజీవితములో నీవు ఎన్ని తప్పులు చేయలేదు అలోచించుయింక ఆతప్పులు చేయనని మాట ఇచ్చినావే - నీమాట నిలబెట్టుకోఇకమీదట ఇతరులు చేస్తున్న తప్పులు గురించి ఆలోచించకునీవు నమ్ముకొన్న సాయి మార్గములో ప్రశాంతముగా ప్రయాణము కొనసాగించు


20.10.1996

నిన్నరాత్రి కలలో శ్రీసాయి ఒకఫకీరు రూపములో దర్శనము ఇచ్చి చెప్పిన మాటలు నాకు సంతోషాన్ని కలిగించినవిఆమాటలు.

1) ఎంత చెట్టుకు అంత గాలి అనే సామెత నీకు తెలుసు కదా - అదేవిధముగా నీకు ఉన్న గ్రహించే శక్తికి తగిన సందేశాలను ఇస్తున్నానువాటిని నీవు అర్ధము చేసుకొనగలుగుతున్నావుదానితో తృప్తి చెందు.

2) కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత ఉన్నదే - మరి నాభక్తులు నాకు ముద్దు కాదా !

3) నీలో దాగి ఉన్న ఒక్కొక్క దుర్గుణాన్ని విసర్జించుతున్నావుఅదే నాకు కావలసినది.

4) నా యితర భక్తులను తక్కువ అంచనా వేయవద్దుఎవరి భక్తివారిదివారి భక్తిలోని విశిష్ఠత నాకు మాత్రమే తెలుసుఅందుచేత ఇతర సాయి భక్తులను నీవు విమర్శించవద్దు.

5) మత మార్పిడి అంటే నాకు ఇష్ఠము లేదుమత మార్పిడి చేసుకొన్నవారిని చూసి జాలి పడతాను వారు చేసిన తప్పు పనికిప్రతివారు తమ స్వధర్మాన్ని పాటించుతు ప్రశాంత జీవనము సాగించుతు భగవంతుని అనుగ్రహము పొందాలి

10.11.1996

నిన్నరాత్రి నిద్రకు ముందు శ్రీసాయి సత్ చరిత్రలోని గోపాలనారాయణ అంబేడ్ కర్ ఆత్మహత్య ప్రయత్నముపై శ్రీసాయి ఇచ్చిన సలహాలు, సూచనలపై ఆలోచించుతు నిద్రపోయినానుశ్రీసాయి "మానవ జీవితములో చేయని తప్పులకు శిక్ష అనుభవించుతున్నవారిని, సంసార బాధలు పడలేక ఆత్మ హత్యలు చేసుకొన్నవారిని, ఆత్మహత్య అనంతరము ఆకుటుంబములో తలెత్తిన నూతన సమస్యలను చూపించి" సమస్యల పరిష్కారానికి ఆత్మహత్య సమాధానముకాదు అని తెలియచేసినారు.  
16.11.1996

నిన్నరాత్రి నిద్రకుముందు మానవ జీవితములో "మరణము" అనే పరిస్థితిపై సలహాలను, సూచనలను ప్రసాదించమని శ్రీసాయిని వేడుకొన్నానుశ్రీసాయి శ్మసానములోని కాటికాపరి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు

1) శ్రీసాయి భక్తులు సత్ చరిత్రలోని మేఘశ్యామునిలాగ ఆదర్శముగా జీవించి జీవితగమ్యాన్ని చేరండి.

2) జీవిత ప్రయాణములో నీవు నీగమ్యానికి చేరిన తర్వాత నీవు వదలిన శరీరము ఏవిదహముగా పంచభూతాలలో కలుస్తుంది అనే ఆలోచన నీకు అనవసరముదిక్కులేని శవాలకు దహన సంస్కారాలు చేయించేది నేనే.  

3) నీవు జీవించినంతకాలము నీజీవితాన్ని గంగానదిలాగ పదిమందికి ఉపయోగపడనియమునా నదిలాగ భక్తితో భగవంతుని పాదాలను కడగని, అపుడు నీవు సరస్వతీ నదిలో (కింటికి కనిపించని నది) మోక్షాన్ని పొందగలవుఅటువంటి జీవితముగడపినవాని పార్ధివ శరీరము బూడిద అయిన తర్వాత ఆబూడిదను ఏనదిలో కలిపిన త్రివేణి సంగమము (గంగా - యమున - సరస్వతి) నీటిలో కలిపినదానికంటే ఎక్కువ పవిత్రత సంపాదించుకొంటుంది.  

 (ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment