11.05.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ
- 1996
(08)
02.10.1996
నిన్నరాత్రి కలలో ఒక
గుడికి వెళ్ళినాను.
ఆగుడి ఆవరణలో
ఒక స్వామీజి
భక్తులను ఉద్దేశించి ఉపన్యాసము ఇవ్వసాగినారు. వారి
ఉపన్యాసములో ఈ ముఖ్య విషయాలు నన్ను
ఆకర్షించినవి.
1) ఆధ్యాత్మికపరమైన విషయాలు వినేటప్పుడు ప్రాపంచిక విషయాలు
గురించి ఆలోచించరాదు. అట్లా
ఆలోచించినవాడు తన్ను తాను మోసముచేసుకోవటమే.
2) ఆధ్యాత్మిక విషయాలు
చేప్పే గురువు
తన శిష్యుడిని
తనతో సమానముగా
చూడాలి.
3) భగవంతుని గొప్పతనాన్ని
గుర్తించి భగవంతునికి సేవ చేస్తున్న క్రిమి,
కీటకాదులు, జంతువుల చరిత్రను (శ్రీకాళహస్తీశ్వరుని చరిత్ర)
తెలిసిన మానవుడు మాత్రము, ఆధ్యాత్మికపరమైన
విషయాలను తెలుసుండి కూడ సాధుస్వభావాన్ని అలవర్చుకోలేకపోతున్నన్నాడే.
04.10.1996
శ్రీసాయి ఒక ఫకీరు
రూపములో దర్శనము
ఇచ్చి నాఆధ్యాత్మిక
రంగ ప్రయాణములోని
తప్పుడునడకలను చూపించి, కనువిప్పు కలిగించారు.
వారు చెప్పినమాటలు.
1) యితరులు నాసేవ చేసుకొని
పేరు ప్రఖ్యాతులు
పొందుతున్నారు అనే భావన, వారి సేవలోని
దోషాలను చూడటము
మానివేయి. భక్తిలో
ఇతరులతో పోల్చుకోవద్దు. ఎవరి
భక్తి వారిది. నీకు
ఉన్న పరిధిలో
నీవే నాసేవ
చేసుకొని తృప్తిపొందు.
15.10.1996
నిన్నరాత్రి శ్రీసాయి ఒక
అజ్ఞాత వ్యక్త్రి
రూపములో దర్శనము
ఇచ్చి నాతో
అన్నమాటలు నాలోని కొన్ని బలహీనతలను
తొలగించినవి. ఆమాటలు::
1) నీకు ఇష్ఠములేని వ్యక్తులను
జంతువులతో పోల్చి ఆజంతువులను అవమానపర్చకు.
ఆజంతువులు నీపొలములో పనిచేస్తాయి. కొన్ని
నీయింట పాలు
ఇస్తాయి. అవి చనిపోయిన తర్వాత
వాటి చర్మము
నీచెప్పుల తయారీకి ఉపయోగపడతాయి. మరి నీకు ఇష్ఠము
లేని వ్యక్తి
నీకు పనికిరాడుగా!
2) భగవంతుని గుడిలో పూజలు,
గుడి చుట్టు
ప్రదక్షిణలు నీఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఒకవేళ నీవు అనారోగ్యముతో ఉన్న సమయములో
భగవన్ నామస్మరణ ఒక్కటే నీలో
మానాసిక పరివర్తన
కలిగించి నీఅనారోగ్యానికి మూలకారణము
చూపించి నిన్ను
వాటినుండి దూరముగా ఉంచుతుంది.
3) నీవు అధికారములో యున్నపుడు
నీఅధికారదర్పముతో ఎవరి మనసు
గెలవలేవు. యుక్తిగా ప్రేమతో నీతోటి ఉద్యోగులమనసు గెలవగలవు. అదే విధముగా భగవంతుని
అనుగ్రహము పొందాలి అంటే భక్తి, ప్రేమలతో
ఆయనను అనుక్షణము
స్మరించుతు ఉండాలి.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment