09.05.2012 బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1996 6వ.భాగాన్ని చదువుకుందాము.
సాయి.బా.ని.స. డైరీ - 1996 (06)
07.09.1996
శ్రీసాయి నిన్నరాత్రికలలో ఒక చిన్న స్కూల్ లోని
టేచర్ రూపములో
దర్శనము ఇచ్చి
అన్నమాటలు.
1) నాతత్వ ప్రచారములో భాగముగా
నీవు పదిమంది
సాయి భక్తులుతో
కలసి సత్
సంగాలు నిర్వహించు,
లేదా అనేక
వందలమందిని ఉద్దేశించి నాతత్వాన్ని
ఉపన్యాసము రూపములో వారికి అందచేయి. ఎవరైనా
ప్రశ్నలు వేసినపుడు ఓరిమితో వారికి సమాధానము
చెప్పు.
2) అజ్ఞానము అనే అడవిలో
తిరుగుతున్న నావాళ్ళకు సాయితత్వ ప్రచార పుస్తకాలను
ముద్రించి వారికి పంచిపెట్టు.
3) సత్ సంగాల తర్వాత
నీవు నాకు
హారతి ఇచ్చి
నైవేద్యము పెడుతున్నావే, నేను వాటిని క్రిమికీటకాదుల
రూపములో స్వీకరించుతున్నాను.
నాకు
అర్పించిన ఆనైవేద్యమును ప్రసాదముగా
నావాళ్ళకు పంచిపెట్టు.
08.09.1996
నిన్నరాత్రి కలలో శ్రీసాయి
శిరిడీలోని వేప చెట్టుక్రింద కూర్చుని తన
దగ్గరకు వచ్చిన
భక్తులను ఉద్దేశించి అన్నమాటలు.
1) 1918 నాటి సినీమాల ప్రభావము
సమాజము శ్రేయస్సుకు
ఉపయోగపడేలాగ ఉండేది. కాని నేటి
సినీమాల ప్రభావము
సమాజము వినాశనానికి
ఉపయోగపడేలాగ మారుతున్నది.
2) 1918 నాటి తల్లితండ్రులు తమ
పిల్లల భవిష్యత్
కోసము నమ్మకముతో
దేవీదేవతలను పూజించేవారు. కాని ఈనాడు
తల్లితండ్రులు ధనసంపాదన కోసము దేవి దేవతలను
పూజించుతు, పిల్లల భవిష్యత్ గురించి పట్టించుకోకపోవటము
చాలా
విచారకరము.
3) 1918నాటి డాక్టర్లు రోగులకు
వైద్యము చేస్తు
భగవంతుని సహాయము అర్ధించేవారు. కాని,
ఈనాడు వైద్యులు
తమ వైద్యముతో
రోగి ఆరోగ్యము
పొందగలిగితే దానిని తమ ఘనతగా చెప్పుకొంటున్నారు. రోగి
మరణించితే భగవంతుని దయలేదు అంటున్నారు.
13.09.1996
శ్రీసాయి నిన్నరాత్రి కలలో
ఒక మందిరములోని
పూజారి రూపములో
దర్శనము ఇచ్చి
అన్నమాటలు.
1) జీవితములోని కష్ఠాల వరదనుండి
బయటపడి నీతల్లితండ్రుల
ఆశీర్వచనములతో భగవంతుని గుడికి చేరుకొన్నావు. కష్ఠాల
వరదలో కొట్టుకొనిపోయి
తమ ప్రాణాలను
కోల్పోయినవారు అనేక మంది ఉన్నారు.
నీవు చాలా అదృష్ఠవంతుడివి. భగవంతుని
గుడిమెట్లు పైకి ఎక్కగలగినావు.
*** 2) ఉద్యోగాలు లేక అనేకమంది
బాధలుపడుతుంటే నీవు ఉద్యోగము మానివేస్తాను అంటావు
ఎందుకు? సరి అయిన సమయము
రాగానే నేనే
నీచేత ఉద్యోగము
మానిపించి నాతత్వ ప్రచారానికి నిన్ను నియమిస్తాను. అంతవరకు
ఉద్యోగము చేయి.
3) అడ్డదారులు త్రొక్కుతు ధనసంపాదన
చేస్తున్న స్త్రీ, పురుషులనుండి దూరంగా జీవించు.
4) నీజీవితములో ఇంతవరకు పేరుకొనిపోయిన
చెడు అనే
మురికిని "సాయి" అనే పటికతో శుభ్రము
చేసుకొని మంచిమార్గములో పయనించు.
***శ్రీసాయి ఆదేశానుసారము శ్రీ
సాయిబానిస రావాడ గోపాలరావుగారు తన ఉద్యోగమునుండి
మార్చ్ 2000 సంవత్సరములో స్వచ్చంద పదవీ విరమణ
చేసి శ్రీసాయి
సేవకు అంకితమైనారు
-
27.09.1996
నిన్నరాత్రి శ్రీసాయి ఒక
అజ్ఞాత వ్యక్తి
రూపములో దర్శనము
ఇచ్చి అన్నమాటలు.
1) పరస్త్రీలను పొగడటము, నీపేరు
ప్రఖ్యాతుల కోసము వారిని వాడుకోవడము మహాపాపము.
2) ఈజీవిత నాటక రంగములో
నీవు ఒకనటుడివి. ఈవిషయాన్ని
తెలుసుండికూడా నీవు స్వంతనాటకాలు ఆడుతు ఎవరిని
మోసము చేయదలచినావు?
3) సంసారము అనే సముద్రములో
కష్ఠాలు కలిగించే
పాములు ఉన్నాయి. మరియు
ప్రశాంతతనిచ్చే ముత్యపు చిప్పలు ఉన్నాయి.
నీవు భగవన్ నామము ఉచ్చరించుతు పాములకు
దూరంగా యుంటు
ఆముత్యపు చిప్పలులోని ముత్యాలను ఏరుకోవాలి.
జీవితాన్ని సార్ధకము చేసుకోవాలి.
4) శ్రీసాయినాధుని బడిలో కడుపునిండ
ఆధ్యాత్మిక విందు ఆరగించిన తర్వాత బయటకు
వచ్చి చిరుతిళ్ళు
తినడము ఎందుకు?
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment