08.05.2012 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1996 5వ.భాగాన్ని చదువుకుందాము
సాయి.బా.ని.స. డైరీ - 1996 (05)
08.08.1996
నిన్నరాత్రి శ్రీసాయి ఫకీరు
రూపములో దర్శనము ఇచ్చి అన్న మాటలు.
"శ్రీ
సాయి లీలా అమృతమును కొందరు త్రాగి జీర్ణించుకొని సుఖ శాంతులతో జీవించుతారు. కొందరు ఆలీలామృతము సీసాను (శ్రీసాయి సత్ చరిత్ర)
తమ యింట షోకేసులో పెట్టుకొని సంతోష పడతారు.
ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే లభించుతుంది.
అందుచేత ఎవరి చేత బలవంతముగా శ్రీసాయి లీలామృతము త్రాగించరాదు.
20.08.1996
నిన్నరాత్రి కలలో శ్రీసాయి ఫకీరు
రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు నాలో ఆలోచనలు రేకెత్తించినవి. అవి
1) నా తత్వ ప్రచారములో నీమాటలు
కొందరికి రుచించుతాయి. కొందరికి కాలక్షేపము
కలిగించుతాయి. నీవు మాత్రము నేను ఇచ్చిన బాధ్యతను
పూర్తిచేయి.
2) నాతో నీవు పొందిన అనుభవాలను
నీపిల్లలు డైరీలో వ్రాసి నీకు బహుకరించుతారు.
3) నీవు తెల్లని వస్త్రాలను
ధరించినావు. కాని, నీవు యింకా యితరులను దూషించసాగటము
వలన నీవస్త్రాలపై మరకలు పడుతున్నాయి. ఆమరకలను
శుభ్రము చేయడము కష్ఠము. అందుచేత ఇతరులను దూషించటము
మానివేయి.
4) నీవు వ్రాస్తున్న డైరీనుండి
సాయి బంధువులు అనేక విషయాలు తెలుసుకొని సుఖ, శాంతులతో జీవించుతారు.
25.08.1996
నిన్నరాత్రి శ్రీసాయి నామాతా
మహుని రూపములో
దర్శన ము
ఇచ్చి అన్నమాటలు.
"మనిషి చనిపోయి పునర్జన్మ
ఎత్తటము సహజము.
ఆమనిషి
బ్రతికి ఉన్నపుడు
అతనికి పూజలు
చేయడము గొప్పకాదు. అతని
మరణానంతరము కూడ ఆతనిలోని గొప్పతనాన్ని గుర్తుంచుకొని
పూజించటము నీఔన్నత్యానికి నిదర్శనము. సంవత్సరానికి
ఒకరోజున (ఆభ్ధికమునాడు) అతనిని పూజించు.
అంతేగాని చేదుమాటలు మాత్రము
అనవద్దు.
29.08.19996
నిన్నరాత్రి శ్రీసాయి సమాధి
మందిరములో సత్ సంగము జరిగినది.
అక్కడ హాలులో ఒక సైకిల్ మీద
పదిమంది ఎక్కినారు.
కాని ఒక
ముసలివాడు (శ్రీసాయి) మాత్రము ఆసైకిలును త్రొక్కసాగినాడు. తెల్లవారిన
తర్వాత దీనికి
అర్ధము ఏమిటి
అని ఆలోచించినాను. నాకు
తోచినది. "శ్రీసాయి
సత్ సంగములలో
సాయిమార్గమును చూపించువారు శ్రీసాయి. ఆమార్గములో
ప్రయాణము చేయవలసినవారు శ్రీసాయి భక్తులు.
`
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment