30.05.2012 బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
07.04.1997
నిన్నరాత్రి శ్రీ సాయి ఒక ఫకీరు రూపములో సాయి దర్బారుకు వచ్చి అన్న మాటలు నేను ఎన్నడు మరచిపోలేను.
1) సాయిదర్బారులో నీవు ఒక సేవకుడివి మాత్రమే. అన్ని మతాలువారికి ఇక్కడ భగవంతుని గురించి ప్రార్ధనలు చేసుకోడానికి అనుమతి ఉంది అనే విషయము నీవు మర్చిపోవద్దు.
2) నీఇంటికి వచ్చే నాభక్తులకు మంచినీరు ఇచ్చి దాహము తీర్చుతున్నావు. మరి నీఇంటిముందు నిలబడి దాహపు బాధను తెలియచేయలేని నోరులేని మూగ జీవాల సంగతి ఎప్పుడైన ఆలోచించావా!
3) సమాజములోని మానవులలోని మంచితనాన్ని నీవు గ్రహించు. వారిలోని చెడుకు నీవు దూరముగా ఉండు.
4) స్త్రీ, పురుషులు నాసమక్షములో వివాహము చేసుకొన్న చాలదు. భార్య భర్తలు నీతిమంతులై ఉండాలి. అపుడే వారికి నా ఆశీర్వచనాలు లభిస్తాయి.
10.04.1997
నిన్నరాత్రి శ్రీసాయి నేను పనిచేస్తున్న కర్మాగారములోని ఓవృధ్ధ కార్మికుని రూపములో దర్శనము ఇచ్చి అన్న మాటలు.
1) నీవు రోజూ నీశరీరములోని మలినాన్ని విసర్జించుతున్నావు. అలాగే ఏదో ఒకరోజున నీవు నీశరీరాన్ని విసర్గించక తప్పదు. విసర్జించబడే ఈశరీరమును మట్టిలో ఏవిధముగా కలపాలి అనే విషయముపై గొడవలు పడటము ఎందుకు.
2) ఎవరైన తప్పుడు పనులు చేస్తు ఉంటే నీవు వారికి అటువంటి పనులు చేయరాదు అని సలహా మాత్రమే ఇవ్వగలవు. మాకు తెలుసులే అని సమాధానము వారినుండి వస్తే మాత్రము నీవు వారిదరిదాపులకు వెళ్ళటము పెద్ద తప్పు.
15.04.1997
శ్రీసాయి నిన్నరాత్రి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) నీయింటికి నామనుషులు వస్తారు. వారి బాధలను నివారించి వారికి ప్రశాంత జీవితాన్ని ప్రసాదించేది నేనే. నీవు సాక్షిభూతుడివి మాత్రమే.
2) హరిదాసులు చేప్పే హరికధకంటే, తల్లి చేప్పే విద్యకన్న, తండ్రి ఇచ్చే రక్షణకన్న శ్రీహరి యొక్క కరుణను సంపాదించే మార్గములో నిన్ను నడిపించేది నేనే.
3) నీదగ్గరకు వచ్చే నామనుషులలో గొప్ప, బీద అనే తారతమ్యము విడనాడి అందరికి సమానముగా నాగురించి చెప్పు.
4) నాతత్వప్రచారములో ఆడంబరాలకు పోవద్దు. నీశక్తికి మించిన ఖర్చులు చేయవద్దు.
5) నేను ఇతరమత సాంప్రదాయాలలో ఉన్నా నీవు నీమత సాంప్రదాయాన్ని పాటిస్తూ నాసేవను నిర్వర్తించు.
6) మంచి స్నేహితులతో స్నేహము, సాయి బంధువులతో సత్ సంఘాలు నాకు చాల ఇష్ఠము. నేను అటువంటివారితోనే యుంటాను.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment