21.05.2012 సోమవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి సాయి పిలిచి చూడు .... కోరిక తీర్చెను చూడు
ఈరోజు సాయిభక్తురాలయిన వాణిగారు బాబా అనుభూతిని తెలుసుకుందాము.
సాయి భక్తురాలయిన వాణిగారి బాబా అనుభవాలను తెలుసుకుందాము.
రెండున్నర సంవత్సరాల క్రితం మేము మెల్బోర్న్ లో ఇల్లు కట్టుకుందామనుకున్నాము. బాబా అనుగ్రహం వల్ల మేము స్థలం కూడా కొనుక్కున్నాము. శంకుస్థాపనకు ముహూర్తం నిర్ణయించాము. పురోహితుని సలహా మేరకు అక్షయ తృతీయనాడు శంకుస్థాపన జరుపుకొన్నాము. నాకు సంతోషముగా ఉన్నప్పటికీ భూమి పూజకు ఎవరూ రాలేదనే బాధ ఉండిపోయింది. మేము స్థలం వద్దకు వెళ్ళి పూజకు అన్ని ఏర్పాటులు చేసాము. బాబా ఫోటో బయటకు తీసి ఫోటో వైపు చూస్తూ "బాబా నువ్వు ఈ శంకుస్థాపనకి వచ్చి నువ్వు వచ్చినట్లుగా నాకు తెలియచేయి" అని మనసులో అనుకున్నాను. పూజ అయిపోయిన తరువాత సామానులన్ని సద్దుకోవటం మొదలుపెట్టాము. అప్పుడు పురోహితుడు మీరు సాయి భక్తులేనా అని అడిగాడు. నేను వెంటనే అవునని సమాధానం చెప్పాను. అప్పుడాయన తన సంచీలోనుండి కోవా తీసి నాకు ఇచ్చాడు. ఉదయాన్నే ఒక భక్తుడు , వ్రతం పూర్తి చేసుకొని గుడికి వచ్చి ప్రసాదం పంచినట్లు చెప్పారు. పురోహితులుగారు అందులోనించి ఒకటి తీసి నాకు ఆ ప్రసాదం ఇచ్చారు. ఈ విధంగా బాబాగారు నా కోరికను మన్నించి భూమిపూజకి వచ్చి మమ్మలిని ఆశీర్వదించారనే భావంతో నాకు చాలా సంతోషం కలిగింది. నేను నా భర్తకు ఇదంతా చెప్పినప్పుడు తను కూడా చాలా సంతోషించారు. పురొహితులవారి ఆశీర్వాదములు తీసుకున్న తరువాత నేను నామనసులో అనుకున్న విషయాన్ని చెప్పి బాబా గారు తన ప్రతినిధిగా పురోహితుని ద్వారా తన కోరికను తీర్చిన విధానాన్ని చెప్పినప్పుడు ఆయన కూడా చాలా సంతోషించారు. ఎటువంటి అవరోధాలు లేకుండా మేము ఇల్లు కట్టుకున్నాము.
నా తల్లితండ్రులు నన్ను చూడటానికి భారతదేశమునుండి వచ్చారు. భారతదేశంలో ఉన్నప్పుడు వారు ప్రతీ గురువారం బాబా గుడికి వెడుతూ ఉంటారు.మాయింటికి దగ్గరలో కొత్తగా ఒక ధ్యాన మందిరాన్ని ప్రారంభించబోతున్నట్లుగా తెలిసింది. ఒకరోజు మేమక్కడికి వెళ్ళాము. మేమందులోకి ప్రవేశించగానే హాలు మధ్యలో పెద్ద సైజు బాబా ఫోటొని చూశాము. ఇది గురువారమునాడు జరిగింది. నాకు చాలా సంతోషం వేసింది. ప్రతి గురువారం బాబా గుడికి వెళ్ళాలనే మా తల్లితండ్రుల కోరిక కూడా ఆవిధంగా నెరవేరింది. రోజు విడిచి రోజు మేమక్కడికి వెడుతూ ఉండేవారము. నేను 9 గురువారముల వ్రతం ప్రారంభించాను . వ్రతం చేసే సమయంలో మేము
ప్రతీ గురువారము క్రమం తప్పకుండా బాబా గుడికి వెడుతూ ఉండేవారము. ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్రతం కొనసాగేలా చేయమని బాబాని ప్రార్ధించాను. బాబా నాకు ఆ విషయంలో సహాయం చేసారు. కొన్ని ఆర్ధిక సమస్యలు ఉండటము వల్ల యింట్లో శాంతికోసం నేను వ్రతం మొదలుపెట్టాను. వ్రతం చేస్తున్న సమయంలో ఆర్ధిక సమస్యలకు కారణమైన తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడం మొదలుపెట్టాము. మా తప్పులను సరిదిద్దుకోవడానికి సాయి మాకు మార్గదర్శకునిగా ఉన్నారనిపించింది. ఇది మాకు ఎంతో శాంతినిచ్చింది. 9వ గురువారము వైకుంఠ ఏకాదశి అయింది. గుడ్లిలో ప్రసాదంగా పంచడానికి నేను, మా అమ్మగారు, రొట్టెలు, కూర తయారు చేసాము. గుడిలో మేము మధ్యాహ్న ఆరతిని కూడా చూడాలనుకున్నాము. బాబాకి నేను తెల్లని పూలతో పూలమాలను కూడా సమర్పిద్దామనుకున్నాను. కాని ఉదయం నేను దానిని తయారుచేయలేకపోయాను. కారు నడుపుతూ నేను మా నాన్నగారితో పైన చెప్పిన నా అనుభవాన్ని వివరిస్తూ ఈ సారి కూడా బాబా వారు తను ఉన్నారని నిరూపిస్తారని చెప్పాను. నేను ఇలా చెప్పగానే మాపక్కనుంచి ఒక కారు వెళ్ళింది. ఆ కారుమీద "షిరిడీ" అని ఒక నేం ప్లేట్ ఉంది. నాకళ్ళనుండి ఆనంద భాష్పాలు రాలాయి. ప్రతీరోజు నేను ఆ దారిలోనే ఆఫీసుకు వెడుతూ ఉంటాను. కాని ఎప్పుడూ కూడా ఆ కారుని చూడలేదు. సాయి కరుణామయి. నా మనసులో ఆలోచించానో లేదో బాబా నాకు ఈ విధంగా దర్శనం ఇచ్చారు. సంతోషకరమైన స్థితిలో నేను గుడికి వచ్చాను. గుడిలోకి ప్రవేసించినంతనే, గుడిలో ఒకతను ఆరతికి ముందు బాబాకు దండవేయడానికి పూల దండ కడుతుండటం చూసాను. నేను కూడా దండ తయారు చేయనా అని అతనిని అడిగాను. అతను నాకు తెల్లని పువ్వులను ఇచ్చి దానిని దండగా తయారు చేయమని చెప్పాడు. నాకు చాలా ఆనందం వేసింది. బాబాకు తెల్లనిపూలతో దండను సమర్పిద్దామనుకొన్న నాకోరికను ఈ విధంగా తీర్చారు. పూజ ప్రారంభమయ్యాక, నైవేద్య్హము ఆరతి తరువాత మేము అందరికీ ప్రసాదాన్ని పంచాము. భక్తులంతా ప్రసాదాన్ని సంతృప్తిగా ఆరగించారు. భక్తులలో ఒకభక్తురాలు నావద్దకు వచ్చి రొట్టెలు, కూర చాలా రుచిగా ఉన్నాయని చెప్పారు. అవి మామూలుగా చేసే పధ్ధతిలోనే తయారుచేసామని చెప్పాను. "అవి నాకు చాలా బాగున్నాయి, మీరు బాబాకు ఎంతో ప్రీతితో చేసినట్లుగా ఉన్నాయి. బాబా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు " అని అందామె. ఆరోజు చాలా అద్భుతంగా గడిచింది. బాబా నా ప్రతీ చిన్న కోరికను తీర్చి తన దీవెనలను అందచేశారు.
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
గూగుల్ లో వెతికి మెల్బోర్న్ షిరిడీ సాయిబాబా మదిరంలోని పల్లకీ ఉత్సవం లింక్ల్ ఇస్తున్నాను చూడండి.
ఓం సాయిరాం
0 comments:
Post a Comment