Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, May 23, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1997 (02)

Posted by tyagaraju on 8:29 AM







23.05.2012  బుధవారము


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


ఈరోజు సాయి.బా.ని.స. డైరీ - 1997 తరువాయి భాగాన్ని చదువుకుందాము. 



సాయి.బా.ని.. డైరీ -  1997 (02)

28.01.1997

శ్రీసాయి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు నాలో అనేక ఆలోచనలను రేకెత్తించినవి.

1.  నీజీవితములో సుఖశాంతులు కావాలి అంటే ఆబీద యింటిలో పుట్టి చిరునవ్వుతో ఏచీకు చింత లేకుండ జీవించుతున్న ఆపసివారిని చూడు.  


నీమనసుకూడ ఆపసివారి మనసులాగ యున్నరోజున మరియు నీలోని దురాలోచనలు అనే మలినాన్ని విసర్జించిన రోజున నీజీవితములో సుఖశాంతులు వాటంతట అవే వస్తాయి

2.  జీవితములో శతృత్వము మంచిది కాదుఅదే వచ్చేజన్మకు ప్రాకుతుంది అని తెలిసికూడా ఈజన్మలో తోటివాడితో శతృత్వము పెంచుకొని నరకయాతన పడటములో అర్ధము లేదుఈజన్మకు సార్ధకత లేదు.  


29.01.1997

శ్రీసాయి ఒక పోలీసు ఆఫీసరు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నీవు అక్రమ మార్గములో సంపాదించిన ధనమును చూసి ఆనందము పడుతున్నావే అదే సమయములో నీకుటుంబ సభ్యులను అపహరించుకొనిపోయి పెద్దమొత్తములో ధనము ఇచ్చి నీవారిని విడిపించుకొని వెళ్ళమని గజదొంగలు నీకు ఉత్తరము వ్రాసిన నీపరిస్థితి ఎలాగ ఉంటుంది ఒక్కసారి ఆలోచించుఅందుచేత అక్రమమార్గంలో ధనసంపాదన చేయవద్దు.  

2) పరుల సొమ్ముపై ఆశను వదలించుకోవాలి అంటే నీవు కష్ఠపడి సంపాదించిన ధనాన్నిముందుగా దానధర్మాలకు వినియోగించు

30.01.1997

శ్రీసాయి నిన్నరాత్రి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నీవు చదువుతున్న ధర్మ శాస్త్రము అనే పుస్తకములోని ఒక పేజీ ఊడిపోయి రోడ్డుమీద పడియున్నపుడు అధర్మ మార్గములో నడుస్తున్న ఓవ్యక్తి ఆపేజీని తీసుకొని చింపి వేసిన సమయములో నీవు ఆవ్యక్తిని దూషించటములో అర్ధములేదుధర్మ శాస్త్రాన్ని జాగ్రత్తగా నీమన్సులో దాచుకొని ఆమార్గములో పయనించవససినది నీవు అనేది సదా గుర్తుంచుకో.

2) ఈదేశములో తినడానికి ఆహారములేక బాధపడుతున్న అభాగ్యులు ఉన్నారు.  

పెండ్లిళ్ళు శుభకార్యాలలో విందుల పేరిట అన్నాన్ని నేలపాలు చేస్తున్నవారు ఉన్నారు.  

అటువంటి సమయములో నీవు చేయవలసిన పని ఏమిటి అంటే అన్నార్తులకు అన్నము దొరికేలాగ చూడుఅన్నమును బాగా తిని బలిసినవాడికి బ్రహ్మజ్ఞానము కలిగేలాగ ఆభగవంతుని ప్రార్ధించు

31.01.1997

శ్రీసాయి నాకు జన్మ ఇచ్చిన నాతల్లి రూపంలో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1.  శ్రీసాయి తత్వ ప్రచారములో అనేకమంది తమ స్వంత ఆలోచనలను ప్రజలకు చెబుతున్నారువారిమాటలలోని మంచి,చెడులను ప్రజలు గుర్తించి అటువంటి దొంగ స్వామీజీల బండారమును బయటపెడతారుఅందుచేత నీవు భగవంతుని గురించి తెలుసుకోవాలని కోరికయున్న శ్రీసాయి సత్ చరిత్రను నిత్యము పారాయణ చేస్తు శ్రీసాయి అనుగ్రహాన్ని పొందు.

2)  నీవు న్యాయమార్గములో నడుస్తున్నా, అన్యాయ మార్గములో నడిచేవారు నిన్ను హింసించుతున్నారుఅందుచేత నీవు దుష్ఠులకు దూరంగా యుండటము నేటి యుగధర్మము అని గుర్తించు.

(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List