24.05.2012 గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1997 3వ. భాగాన్ని చదువుకుందాము.
సాయి.బా.ని.స. డైరీ
- 1997 (03)
01.02.1997
నిన్నరాత్రి శ్రీసాయి ఒక
అజ్ఞాత వ్యక్తి
రూపంలో దర్శనము
ఇచ్చి అన్నమాటలు.
1) పల్లెలలోను, పట్నవాసాలలోను, పగటివేళ, రాత్రివేళ,ఎండలోను, వానలోను,
బానిసత్వములోను,స్వేచ్చవాతావరణములోను నీవు
అలసిపోయిన నీకు విశ్రాంతి కలుగచేయటానికి నామందిర
ద్వారము ఎల్లపుడు
తెరచియుంటుంది.
2) నీకు జన్మ ఇచ్చిన
నీతల్లితండ్రులలోను, నీవు జన్మ
ఇచ్చిన నీ
పిల్లలలోను ఉన్నది నేనే.
3) నీవు ప్రేమతో నాకు
ఏమిసమర్పించిన నేను దానిని సంతోషముగ స్వీకరించుతాను. నీవు
ఇచ్చిన వస్తువుకన్న
నీవు నాపై
చూపిన ప్రేమ
అంటేనే నాకు
చాల ఇష్ఠము.
12.02.1997
శ్రీసాయి ఒక ఫకీరు
రూపములో దర్శనము
ఇచ్చి అన్నమాటలు,
"పాపాలతో గడచిపోయిన గత జీవితానికి చరమ
గీతము పాడిన
తర్వాత, ప్రశాంత
జీవితము కావాలని
కోరుకుంటే, సాయి అనే జీవిత భీమా
పధకంలో శ్రధ్ధ,
సబూరిలతో చేరి నీజీవిత గమ్యాన్ని చేరుకో.
18.02.1997
శ్రీసాయి నాతల్లి రూపములో
దర్శనము ఇచ్చి
అన్నమాటలు.
1) నీజీవిత ప్రయాణములో నీగురువును
తోడుగా యుండమని
కోరుకో. అపుడు
ఆజీవితము ఒడిదుడుకులు లేకుండ ముందుకు సాగిపోతుంది.
2) నీ ఆధ్యాత్మిక జీవితములో
నిన్ను ఎవరు
గుర్తించటములేదని, నీప్రాపంచిక జీవితములో
నీపిల్లలు నిన్ను వదలివేసి ముందుకు వెళ్ళిపోతున్నారని,
నీభార్య నిన్ను
వదలి వేసి
వెనక్కి వెళిపోతున్నదని
నీఅవసరాలకు ఎవరు ముందుకు వచ్చి సహాయము
చేయటములేదని ఆలోచించుతు బాధపడటముకంటే,
ఆభగవంతుని నామము స్మరించుతు ఏకాతముగా, ప్రశాతముగా
జీవించటము నేర్చుకో.
20.02.1997
శ్రీసాయి నిన్నరాత్రి నాచిన్ననాటి
స్నేహితుని రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) గొడవలు లేని ప్రశాంత
జీవితముకావాలి అన్నపుడు నీకు జరిగిన అన్యాయాలను
మరచిపోగల శక్తిని ప్రసాదించమని ఆభగవంతుని వేడుకో.
2) నీవు చికాకులతో ఉన్నపుడు
ఇతరులకు చికాకు
కలిగించకుండ నీజీవితాన్ని ముందుకు నడిపించిన, అటువంటి
జీవితములో అశాంతి అనేది రాదు.
3) నీవు నవ్వితే ఈ
లోకం నవ్వుతుంది. నీవు
ఏడిస్తే ఈలోకం
నవ్వుతుంది. అటువంటి
ఈలోకంలో నీవునవ్వులపాలు
అగకుండ జాగ్రత్తపడటము
నీజీవితానికి మంచిది.
4) నీకళ్ళముందు ఇతరులు చెడుపనులు
చేస్తు తాత్కాలిక
సుఖాలు పొందుతు
ఉంటే నీమనసు
వాటివైపు లాగటము సహజము. నీవువివేకముతో
అటువంటి మనుషులనుండి
అటువంటి పరిస్థితులకు
దూరంగా ఉండగలిగిననాడు,
నీజీవితములో ప్రశాంతతకు లోటుయుండదు అని గ్రహించు.
21.02.1997
నిన్నరాత్రి కూడ నాచిన్ననాటి
స్నేహితుడు
కలలో దర్శనము
ఇచ్చి అన్నమాటలు.
1) యితరులు తప్పులు చేస్తు
ఉంటే నీవు
ఆతప్పులు చేయకుండ ఉండటానికి ప్రయత్నించు.
అంతేగాని ఇతరుల తప్పులను
ప్రచారము చేయవద్దు.
2) నీఅనారోగ్యము విషయము ఇతరుల
సానుభూతికోసము ప్రచారం చేసుకోవద్దు.
3) బంధుత్వములో రాగద్వేషాలను విడనాడు.
4) ఇతరధర్మాల జోలికి పోవద్దు.
5) శ్రీసాయి తత్వ ప్రచారములో
కుల, మతాల
ప్రశక్తినిరానీయవద్దు.
6) శ్రీసాయి బంధువులనుండి ప్రాపంచిక
సంపదను ఆశించవద్దు.
7) శ్రీసాయి బందువులతో కలసి
ఆధ్యాత్మిక విందుభోజనము చేయి.
8) శ్రీసాయి బందువుల వ్యక్తిగత
ఆచార వ్యవహారలలో
నీవు కలుగ
చేసుకోవద్దు.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment