25.05.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ - 1997 నాలుగవ భాగము
సాయి.బా.ని.స. డైరీ -
1997 (04)
24.02.1997
నిన్నరాత్రి శ్రీసాయి కలలో
నాపిన తండ్రి
శ్రీసోమయాజులుగారి రూపములో దర్శనము
ఇచ్చి అన్నమాటలు.
1) తమ స్వంత పనులుకోసము,
తమ సుఖాలకోసము
నిన్ను వినియోగించుకొంటారు
ఈప్రజలు. మరినీవు
కష్ఠాలలో ఉన్నపుడు నీముఖము చూడటానికి ఎవరైన
నీదగ్గరకు వస్తున్నారా! ఆలోచించు. అందుచేత
అన్నిసమయాలలోను ఆభగవంతుని తోడు కోరుకో.
2) నీవు ఎవరి కష్ఠా
న్ని ఉంచుకోవద్దు. కష్ఠానికి
కూలి సరిగా
ఈయవలెను.
3) నీజీవిత ప్రయాణములో అహంకారము
చోటు చేసుకొన్ననాడు
ఆప్రయాణములో నీ ఉనికే యుండదు అని
తెలుసుకో.
4) నీయింటికి ఎవరు ఊరికే
రారు.
అటువంటివారిని ప్రేమతో పలకరించి
గౌరవించు.
5) జీవితములో ధనవ్యామోహము, పరస్త్రీ
వ్యామోహము నీకు తలనొప్పినే కలిగిస్తాయి.
నీకు ప్రశాంత జీవితము కావాలి అంటే
ఈరెండు వ్యామోహాలకు
దూరంగా జీవించు.
26.02.1997
నిన్నరాత్రి శ్రీసాయి నా
సాయి సోదరుడు
శ్రీశంకరయ్య గారి రూపములో దర్శనము
ఇచ్చి అన్నమాటలు.
1) నిత్యము శ్రీహేమాద్రిపంతు వ్రాసిన శ్రీసాయి సత్ చరిత్రను
పారాయణ చేయి. అదినిన్ను
నీకుటుంబాన్ని కాపాడుతుంది.
2) ఇతరులను దూషించటము మానివేయాలి.
3) నీకు బహుమానముగా వచ్చే
వస్త్రాలను వస్త్రహీనులకు దానము చేయాలి.
4) దర్పముతో తమ ఉనికిని
పదిమంది గుర్తించాలి
అనే భావన
గలవారినుండి దూరముగా జీవించాలి.
5) 1996 లో నీఆరోగ్యాన్ని దొంగలు
దోచుకొంటున్న సమయములో నాప్రేరణతో నీవు వారిని
ఎదిరించి విజయాన్ని సాధించి నాబడిలో చేరినావు. నాబడిలో
సర్వమతాలవారికి, అన్ని వయసులవారికి
చోటుయుంది. నాబడిలో
చేరినవారి అందరికి అన్నవస్త్రాలకు,
ఆధ్యాత్మిక సంపదకు లోటుయుండదు అని గుర్తించు.
28.02.1997
నిన్నరాత్రి శ్రీసాయి నాతండ్రి
శ్రీరావాడ వెంకటరావుగారి రూపములో దర్శనము ఇచ్చి
అన్నమాటలు.
1) అనుక్షణము మంచిపనులు చేస్తు
ఉండాలి అనే
తలంపుతో జీవించగలిగితే
జీవితములో పాపాలకు, తప్పుడు పనులకు చోటే
లేదు.
అప్పుడు పాపాలకు తప్పుడు పనులకు శిక్ష
గురించి ఆలోచించనవసరమే
లేదు.
2) న్యాయ స్థానాలలో న్యాయము
అమ్మబడుతున్న ఈరోజులలో తప్పుడు పనులకు, పాపాలకు
శిక్ష వెంటనే
ఎక్కడనుండి వెలువడుతుంది. కొంచము ఆలస్యముగా
భగవంతుడే శిక్షను విధించుతాడు. అంతవరకు
ఓరిమిపట్టక తప్పదు.
3) నీవు చేసిన పుణ్యాలలో
నీభార్య పిల్లలకు
వాటా ఉంది. మరినీవు
చేసిన పాపాలలో
వారికి వాటాలేదు. నీవు
చేసే పాపాలలో
పాలుపంచుకొనేవారు లేనపుడు నీవు
ఆపాపాలను ఎందుకు చేయాలి ఆలోచించు.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment