01.06.2012 శుక్రవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులకు ఒక వివరణ
సాయి.బా.ని.స. డైరీ - 1997 -- 7వ.భాగములో పొరబాటున 09.05.1997 రోజు డైరీ పోస్ట్ కాలేదు. దానిని ఈ 8వ. భాగములో పోస్ట్ చేస్తున్నాను. గమనించగలరు. పొరపాటుకు చింతిస్తున్నాను.
సాయి.బా.ని.స. డైరీ - 1997 (08)
09.05.1997
శ్రీసాయి నిన్నరాత్రి కలలో ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
"దొంగలు దోచుకోలేని జ్ఞానము అనే ధనాన్ని ప్రసాదించేవాడు భగవంతుడు. మానవుల మధ్య ప్రేమ బంధాలను కల్పించేవాడు భగవంతుడు. మూగవానికి మాట్లాడే శక్తిని కల్పించేవాడు భగవంతుడు. మానవుని మనసులో ప్రవేశించి తోటిమానవునికి సహాయము చేసేవాడు భగవంతుడు. విజయదశమిరోజున మానవులు అందరి చేత సంతోషముగా శక్తికి పూజలు చేయించేది భగవంతుడు. అటువంటి భగవంతుని అనుక్షణము స్మరించటము మానవుల విధి."
2) యింటి దగ్గర బంగారునగలు దాచుకొని తీర్ధయాత్రలకు బయలుదేరి ఆయాత్రలో డబ్బు ఖర్చుగురించి, యింటిదగ్గర దాచిన బంగారు నగలు గురించి ఆలోచించితే
యింక ఆతీర్ధయాత్రకు అర్ధము ఏమిటి? అటువంటి పరిస్థితిలో తీర్ధయాత్రలు చేయకుండ యింటి పట్టున యుండటము మేలు.
29.05.1997
నిన్నరాత్రి శ్రీసాయి నేను పనిచేస్తున్న కర్మాగారములోని ఒక వృధ్ధ కార్మికుని రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) భగవంతుడు సర్వాంతర్యామి అని స్టేజీమీద ఉపన్యాసాలు ఇచ్చే స్వామీజీలు తమకాలి క్రింద నలిగిపోతున్న క్రిమికీటకాల గురించి ఆలోచించనినాడు ఆస్వామీజీ మాట్లాడే మాటలకు అర్ధము ఏమిటి?
2) అకలితో ఉన్న బీదవాడు మజ్జిగతో అన్నము తింటు ఆభగవంతునికి కృతజ్ఞతలు తెలియచేసుకొనుచున్నాడు.
మరిఒకడు ధనమదముతో ఆకలితో యున్నపుడు పెరుగు అన్నము తింటు తనపళ్ళెములోని సగము అన్నమును నేలపాలు చేసి ఆనందించుతున్నాడు.
మరి అన్నము పరబ్రహ్మ స్వరూపమని తలచిన బీదవాడు గొప్పవాడా, లేక ధనమదముతో అన్నమును సరిగా భుజింపకుండ నేలపాలు చేసినవాడు గొప్పవాడా! నీవు అలోచించు.
30.05.1997
నిన్నరాత్రి శ్రీసాయి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) నీవు నాసేవలో ఎంతచేయగలవు అనేది ఆలోచించి చేయి, అంతేగాని సమాజములోని తోటివారు నాకు ధనసహాయము చేయలేదు లేకపోతే ఇంకా చాలా సేవ చేసేవాడిని అని మాత్రము ఆలోచించవద్దు.
2) పదిమందిలో నీవు ఒక్కడివి అని ఆచోటకు నీవు వెళ్ళకపోయిన ఫరవాలేదు. అదే నీవు ఆచోటకు వెళ్ళకపోతే ఆపదిమందికి యిబ్బంది కలుగుతుంది అని భావించినపుడు నీవు అక్కడకు తప్పక వెళ్ళాలి.
3) ఇతరులు సాయిసేవలో ఎంత పనిచేస్తున్నారు అనేది నీకు అనవసరము. నీవు సాయిపేరిట ఎంతపని చేయగలవు అనేది ముఖ్యము.
4) మరణము అనేది శరీరానికి శాశ్వత నిద్ర. ఆటువంటి నిద్రలో ఉన్న శరీరానికి దహనము చేయడానికి, లేదా ఖననము చేయడానికి రాత్రి ఆగితే నాఎమి పగలు అయితేనేమి ఒక్కసారి ఆలోచించు.
12.06.1997
శ్రీసాయి నిన్నరాత్రి ఒక పల్లెటూరివాని గా దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) మీజీవితాలు అరటితోటలువంటివి. ఆతోటను పెంచి, జాగ్రత్తగా పంటపండేలాగ చూసుకొనే తోటమాలిని నేను. నేను మీనుండి కోరేది శ్రధ్ధ, సాబూరి అనే రెండుఫలాలు మాత్రమే.
2) నేను నాభక్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మంటలులోనేనా లేదా నూతిలోనేనా దూకడానికి సిధ్ధపడతాను.
3) సంతోషము అనేది బాహ్యముగా ప్రదర్శించే మానసిక స్థితి. మీసంతోషములో నేను పాలుపంచుకొంటాను.
(ఇంకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment