04.06.2012 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ - 1997 (11)
04.09.1997
నిన్నరాత్రి శ్రీసాయి ఒక ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) నాభక్తునియింట అన్న వస్త్రాలకు లోటు యుండదు. నేను శిరిడీకి మాత్రమే పరిమితమైయున్నాను అని భావించటము నీలోని అజ్ఞానము.
2) శిరిడీలోని నాసమాధి మందిరములో నీవు సర్వదేవతలను చూడగలవు. ఆసర్వదేవి దేవతలు విశ్వమంతట యున్నారు.
అందుచేత శ్రీసాయి విశ్వమంతట్లేఉన్నట్లే కదా.
3) ఎంత చెడిపోయిన వ్యక్తి అయిన భగవంతుని అనుగ్రహముతో తిరిగి మంచి వ్యక్తిగా మారి ప్రశాంత జీవితము గడపగలడు . అందుచేత చెడిపోయిన నాపిల్లలను మంచి మార్గములో పెట్టడము నాధ్యేయము.
05.09.1997
నిన్నరాత్రి శ్రీసాయి ఒక స్కూల్ లోని ఉపాధ్యాయునిగా దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) నీకు అన్యాయము చేసినవారిని నీవు దండించగలవు. మరియు ఎవరికి దొరకకుండా ఆకాశములో ప్రయాణముచేయగలవు.
అది అంత గొప్ప విషయము కాదు. నీకు అన్యాయము చేసినవారు ఎదురుపడినపుడు నీవు చిరునవ్వుతో వారిని పలకరించి వారినుండి ఉపాయముగా దూరముగా యుండటము నీలోని నిజమైన జ్ఞానము.
2) నీజ్వరము తగ్గడానికి నీవు తీసుకోబోయే మాత్ర మంచిదా, లేక చెడ్డదా అనేది నీవు నిర్ధారించలేవు. ఆమాత్రను తీసుకోమని చెప్పిన డాక్టర్ కు మాత్రమే ఆమాత్రయొక్క మంచిచెడులు తెలుసును. అటువంటపుడు ఆమాత్రను సిఫార్స్ చేసిన డాక్టర్ మీద నమ్మకము కలిగి యుండటము నిజమైన జ్ఞానము.
3) నీవు నీఎదుటివానిలోని మంచి చెడులను మాట్లాడినట్లే ఎదుటివాడు నీగురించి మంచి చెడులుమాట్లాడుతాడు అని గ్రహించటము నీలోని నిజమైన జ్ఞానము.
4) ఒక గంట సేపు నీకు ప్రేమతో భోజనము పెట్టిన ఆహోటల్ లోని సర్వరుపై ప్రేమతో ఒక ఐదురూపాయలు బహుమానముగా ఇచ్చి ఆ హోటల్ నుండి బయటపడుతున్నావే,
మరి నీజీవితములో నీకు, ప్రేమ, అనురాగాలు ఇచ్చి నీభార్యాపిల్లల ఋణము తీర్చుకొని ఈలోకమునుండి బయటపడటము నీలోనినిజమైన జ్ఞానము.
5) నీశరీరానికి కావలసిన శక్తిని ప్రసాదించే ఆహారాన్ని నీనోటికి అందించమని నీచేతులను సహాయము కోరుతున్నావే
మరి నీలోని ఆత్మకు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించమని నీగురువుని సహాయము కోరడము నీలోని నిజమైన జ్ఞానము.
6) ప్రాపంచిక జీవితములో ధనసంపాదన వ్యామోహముతో జూదగృహానికి వెళ్ళి అక్కడ నాడబ్బుపోతున్నదే అని ఆలోచించేవాడు పిసినిగొట్టు.
అలాగే ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతు ధనవ్యామోహమును వీడలేకుండ యుండేవాడు పిసినిగొట్టుకన్న అధముడు.
06.09.1997
నిన్నరాత్రి శ్రీసాయి ఒకసన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
"జీవితములో ఓ అదృశ్య శక్తివలన మనకు కష్ఠాలు, సుఖాలు కలుగుతు ఉంటాయి. ఆసమయములో కష్ఠాలను తొలగించమని, సుఖాలలో తోడుగా యుండమని ఆభగవంతుని ప్రార్ధించుతాము.
ఈప్రార్ధన సమయములో కలిగే ఆలోచనలనే మనము మతమని అంటాము. మతమంటే భగవంతుని గురించి తలంచటము. భగవంతుని గురించి తెలుసుకోవటము అని అర్ధము.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment