Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, June 22, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (11)

Posted by tyagaraju on 8:23 AM
                                                      
                                           
22.06.2012  శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.స. డైరీ -  1998 (11)
23.07.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక వృధ్ధ బ్రాహ్మణుని రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.నీవు నిత్యము శ్రీసాయి సచ్చరిత్రను  పారాయణ చేస్తున్నావు.  ఆపారాయణ  ఫలాన్ని నీవు ఈవిధముగా పొందుతున్నావు. 

1) నీ కలలలో నీగ జీవితాన్ని, భవిష్యత్ జీవితాన్ని చూడగలుగుతున్నావు.

2) నీయింట జరుగుతున్న శుభకార్యాలకు, జననమరణాల సమయాలలో నేను ఏదో ఒక రూపములో వచ్చి నీకు తోడుగా నిలబడుతున్నాను.
3) నీయింట తిరుగుతున్న సర్వ జీవులలో ఉన్నది నేనే అని గ్రహించగలగుతున్నావు.

4) నీజీవితము అనేక కష్ఠాల కడలిలో పయనించుతున్న సమయములో నీకు ప్రమాదము రాకుండ కాపాడుతున్నాను.   

25.07.1998

శ్రీసాయి నిన్నరాత్రి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 

1) నీజీవిత చీకటి దినాలలో దుర్భర జీవితాన్ని గడుపుతున్నపుడు, నీవు సాయి అనే దీపము వెలుతురులో భగవంతుని పాదాలపై భక్తి అనే పుష్పాలను వేయగలిగినావు.
2) భగవంతుని సేవలో వేషము, భాష కలిగిన పండితులు ఉన్నారు.  భగవంతునిపై మూఢ భక్తితో ఉన్న పామరులు ఉన్నారు.  నీవు ఒక పామరుడిలాగ భగవంతుని పూజించు, సేవించు.  
3) ఆధ్యాత్మిక జీవిత ప్రయాణములో నీవు ఎందరినో కలుస్తావు.  వారితో మాట్లాడుతావు.  కాని, నీవు నీ ప్రయాణము ఒటరిగానే చేయాలి.  నీవు చేరవలసిన గమ్యస్థానము గురించి ఎదురు చూస్తు ఉందాలి.  నీగమ్య స్థానము రాగానే నీవు ఎవరితోను మాట్లాడకుండ దిగిపోవాలి.     

28.07.1998

నిన్న రాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నీవు కీర్తి కండూతితో స్టేజీ ఎక్కి నీగొప్పను నీవు చెప్పుకోవడము శోభస్కరము కాదు.  అదే నీవు మహాత్ముల గురించి స్టేజీ మీద మాట్లాడిన, అది నీజీవితానికి పరిమళము అబ్బినట్లుగా యుంటుంది.    


(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు  


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment