Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, August 24, 2012

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 11

Posted by tyagaraju on 6:54 AM

     

                       
24.08.2012  శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 11



101.  కర్మ సిధ్ధాంతము నమ్ము.  నీ కర్మలను నీవు సక్రమముగా నిర్వర్తించు.  ఫలితమును నీవు ఆశించవద్దు.  అప్పుడే నీకు సుఖశాంతులు లభించుతాయి.

      - 03.08.93 

102.  నీవు భగవంతుని పెంపుడు కుక్కవి.  


నీళ్ళు త్రాగి నీప్రాణాన్ని నిలుపుకోమని నీయజమాని ఆజ్ఞయితే నీయజమానిపై విశ్వాసముతో, సంతోషముతో ఆనీరు త్రాగి నీప్రాణాన్ని నిలబెట్టుకో.  

      - 10.08.93

103.  వైద్యరంగములో విలువలేని పుచ్చకాయను నీవు నాకు నైవేద్యముగా పెట్టినా  నేను ప్రేమతో అంగీకరించుతాను.

      - 10.08.93

104.  రోజూ తినడానికి శనగలను సంపాదించాలి.  ఆనపగింజలను జాగ్రత్తగా నాటి పాదును పెంచి ఆనపకాయలు కోసిన తర్వాత వాటిని అమ్మి డబ్బు సంపాదించి తినడానికి శనగలు కొనాలి.  అంతే గాని ఆనపగింజలు కొనడానికి దాచిన డబ్బుతో శనగలు కొని జీవితములో చికాకులు సృష్ఠించుకోకు. 

      - 11.08.93

105.  నీవు ప్రజాసేవ, ప్రజలకు సహాయము చేయదలచుకొంటే నీదగ్గర ఉన్నవసతి, వనరులతో చేయి.  అంతేగాని అదిలేదు, యిదిలేదు అంటూ వ్యర్థ ప్రసంగాలు మాత్రము చేయవద్దు.

      - 29.08.93

106.  నాకోసము తయారు చేసిన నైవేద్యము నాకు పెట్టకుండా నాపూజలో మునిగిపోయి, ఎవరో చచ్చి ఆ నైవేద్యాన్ని ఎంగిలి చేసినారని ఆవ్యక్తిను దూషించినావే - ఆదూషణలను స్వీకరించినది నేనే.  మరి యిపుడు చెప్పు ఆనైవేద్యాన్ని తిన్నది ఎవరు?

      - 02.09.93

107.  మంచి పూలచెట్ల విత్తనాలను  (మంచి విషయాలు) నీమిత్రుడు అడగకపోయినా అతనికి యిచ్చినా మంచిదే.  కనీసము అతను వాటిని దూరముగా తీసుకొని వెళ్ళి విసిరివేస్తాడు.  అక్కడ అతనికి తెలియకుండానే మంచి పూలచెట్లు  మొలచి మంచి పూలు పూస్తాయి. 

      - 10.09.93

108.  ఉన్నత పదవులలో ఉన్నవారు మంచిని చేసిన, చెడు చేసిన సంఘములోని వారు అందరు మంచిని, చెడును గుర్తించుతారు.  సామాన్య మానవుడు మంచి చేసిన చెడు చేసిన ఎవరు గుర్తించరు.  నీవు మాత్రము మంచి చెడులను గుర్తించి మంచిని స్వీకరించి చెడును వదలివేయి.    

      - 12.09.93

109. ఎంతటి తెలివియున్న మనిషి అయిన అక్రమ సంపాదనకు అలవాటు పడితే ఏదోఒకరోజున బయటపడక మానదు ఆవ్యవహారం.  దాని తర్వాతనే అతనికి కలుగుతుంది నిజమైన తెలివితేటలు.


      - 22.09.93
110.  కాలము అనే పాఠశాలలో సాయిమాస్టర్ క్లాసులో చేరటానికి విద్యార్ధులకు వయసుతో పనిలేదు.  కులమతాల  ప్రసక్తిలేదు. 


      - 28.09.93

(యింకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు


     



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List