Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, September 9, 2012

నాస్తికుడు - తప్పక చదవవలసినది

Posted by tyagaraju on 7:45 AM

                                           
                                            
09.09.2012 ఆదివారము 
ఓం సాయి శ్రీ సాయిజయజయసాయి 
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 

నాస్తికుడు - తప్పక చదవవలసినది

ఈ రోజు మీరు చదవబోయే బాబా లీల 2010 సంవత్సరములో శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారి బ్లాగులోనిది.

బాబా శక్తిమీద ఎవరికయితే నమ్మకం లేదో వారందరూ తప్పక దీనిని చదవాలి. సాయి సోదరుడు గౌరవ్ పంపించిన ఈ అధ్బుతమైన అనుభవాన్ని చదవండి.


మనం అడుగడుగునా మనం బాబాని పరీక్షిస్తూ ఉంటాము. మనం మంచివారమా, చెడ్డవారమా అని ఆలోచించకుండా, బాబా వెనువెంటనే మన రక్షణ కోసం వస్తారు.  కారణం మనం ఆయన బిడ్డలం కనక, తన బిడ్డలు కష్టాలలో ఉంటే చూడలేరు. కాని దురదృష్టవశాత్తు, మనం ఆయన ప్రేమని, శక్తిని గ్రహించలేము.  మనమెప్పుడూ మనకు మంచి జరిగితే నమ్ముతాము, చెడు జరిగితే భగవంతుడిని నిందిస్తాము.

ఇది ప్రతీవారు తప్పక చదవవలసినది. ఇక చదవండి గౌరవ్  గారు పంపిన బాబా లీల.

                                          *************

నేనెపుడూ బాబాని పూజించేవాడిని కాదు.  గుడికి వెళ్ళే అవకాశం వచ్చినా కూడా వెళ్ళేవాడిని కాదు. పూజలూ పునస్కారాలు ఉన్న కుటుంబం మాది. మా కుటుంబలోనివారంతా రోజుకు రెండుసార్లు పూజ చేస్తారు. బాబా చేసిన అధ్బుతాల గురించి ఎన్నో విన్నాను.  కాని నాకెప్పుడూ  మనసులో సంశయం ఉండేది.

2005 సంవత్సరం వెనకటి మాట.  నేనప్పుడు లండన్లో ఉన్నాను. ఒకరోజున నామీద అక్రమంగా నేరారోపణ జరిగి, పోలీసులు నన్ను జైలులో పెట్టారు. నేను నిరపరాధిని పైగా అశక్తుడిని. నేను కనీసం 24 గంటలులోగా  కూడా బయటకు రావడం కష్టమని పోలీసులు చెప్పారు. 
 
నేను మానవమాత్రుడినయినప్పటికీ నేను ఆకలితో నీరసంగా ఉన్నానని చెప్పుకోవటానికి నాకు సిగ్గనిపించటంలేదు. నాకళ్ళంబట కన్నీరు కారసాగింది. హటాత్తుగా నా మనసులోకి అందరూ మాట్లాడుకొనే సాయి లీల గురించి ఆలోచన వచ్చింది. నాకు దేవుడి మీద కోపంగా ఉంది.  బాబా నేను నిన్ను ప్రార్ధించను.  నువ్వు రక్షిస్తావని అందరూ అంటారు.  నిరపరాధులని ఆదుకొంటావనీ, మరికొందరికి అవసరమయినప్పుడు సహాయం చేస్తావనీ అంటారు.  రెండురోజులన్నించీ నేనేమీ తినలేదు. 3 గంటల నుండీ నేనీ జైలులో ఉన్నాను. నువ్వేకనక నిజంగా ఉంటే, నేను నీనామాన్ని 11 సారులు 11 అంటే 11 సార్లె ఉచ్చరిస్తాను, నాకు ఆహారం పంపించు. నీమీద నాకు నమ్మకం కలగాలంటే నాకు ఆహారం పంపించు.

ఓం సాయినాధాయనమహ అని బాబా నామాన్ని ఉచ్చరించడం ప్రారంభించాను.

11 సార్లు నామోచ్చరణ పూర్తయిన వెంటనే, ఎవరో జైలు తలుపు తెరిచారు. "నువ్వు ఆకలితో ఉన్నావని నాకు వినపడింది. ఇదిగో ఇది తిను" అని చెప్పి తలుపుమూసేసి వెళ్ళిపోయడు.  నాకు ఇవ్వబడిన ఆహారం ఒక ఆపిల్, అరటిపండు, సాండ్ విఛ్, కేక్, కాఫీ.
 
నేను చదువుకున్నవాడినవడం వల్ల అది కేవలం కాకతాళీయం అనుకున్నాను. అంచేత సాయికి మరలా సవాలు చేశాను. ఇది కేవలం కాకతాళీయంగా జరిగి ఉండచ్చు, అయినప్పటికీ నీపై నాకు  నమ్మకంలేదు. ఎందుకంటే నువ్వే నన్ను కనిపెట్టుకుని వుంటూ ఉంటే నేనీ జైలులో ఉండేవాడిని కాదు. నేనిప్పుడు 51 సార్లు ఓం సాయినాధాయనమహ అని నీనామాన్ని జపిస్తాను. నేను నిరపరాధినని వారికి తెలిసినా కూడా  24 గంటలలోపులో నేనీ జైలునుంచి బయటపడలేనని నాకు తెలుసు.  నేనీ జైలునుంచి బయటపడాలి.  నీ లీలను చూపించు. ఇలా అని నేను 51 సార్లు బాబా నామజపం చేశాను. 51 సార్లు ఓం సాయినాధాయనమహ అని పూర్తికాగానే కళ్ళు తెరిచాను.  ఏమీ జరగలేదు. ఎంతటి చదువుకున్న మూర్ఖుణ్ణి నేను, హహా, హాహా  అని నాలో నేనే నవ్వుకున్నాను.  అసలు దేవుడులేడు. 

మరుక్షణంలోనే ఎవరో తలుపు తెరిచి నన్ను వదిలేశారు,  వెళ్ళచ్చు అని చెప్పారు.  నాకు నోట మాటరాలేదు. నాశరీరంలో వణుకు మొదలైంది. సాయి ఎప్పుడూ నాతోనే ఉన్నాడు. కాని నేను గ్రహించుకోలేకపోయాను. సాయి నన్ను 3 గంటలలోగానే బయటకు రప్పించారు. నేనిప్పుడు సాయి భక్తుడిని. నేనిది రాస్తున్నపుడు నాకు కన్నిరు వస్తోంది, బాబాకు తెలుసు. ఇప్పటికి 4 సంవత్సారాలు అయింది,  బాతో నేను చేసిన సవాలుని నేను మర్చిపోలేదు.

బాబా మీద నాకు భక్తి, విశ్వాసం లేకున్నా, నాకు సహాయం చేశారు.

బాబా నీకు నాకృతజ్ఞతలు.  

సర్వం శ్రీసాయినాదార్పణమస్తు  

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List