Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, December 12, 2012

జన్మ, పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 7

Posted by tyagaraju on 9:04 AM

12.12.2012 బుధవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
                       
                              
ముందుగా శ్రీ విష్ణుసహస్రనామం 18 వ,శ్లోకం, తాత్పర్యము

శ్లోకం:  వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః

             అతీద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః  ||

పరమాత్మను తెలియబడువానిగా, వైద్యునిగా, యోగిగా, మరియు వీరులను జయించువానిగా, లక్ష్మీదేవి భర్తగా, మధురమైనవానిగా, యింద్రియముల కతీతమైనవానిగా, మాయల కతీతమైన వానిగా, గొప్ప ఉత్సాహవంతునిగా, గొప్ప బలసంపన్నునిగా, ధ్యానము చేయుము.
 

ఈ రోజు సాయి.బా.ని.స. చెపుతున్న జన్మ, పునర్జన్మలపై సాయి ఆలోచనలు 7వ.భాగం విందాము.


                                           

 జన్మ, పునర్జన్మలపై సాయి ఆలోచనలు   -  7

ఇప్పుడు ఈ రోజు నేను మీకు చెప్పబోయే విషయాలు పునర్జన్మలమీద సాయి ఆలోచనలు, నాకలలలో సాయి ఇచ్చిన సందేశాలు, నా అనుభవాలలో కొన్నిటిని వివరిస్తాను.

మా తండ్రిగారు 1974 సంవత్సరం  (54 సంవత్సరాల వయసులో) గుండె పోటు వల్ల కేరళ లోని ఇడిక్కి అనే గ్రామంలో మరణించారు. ఆయన తరువాతి జన్మ  గురించి నాకు చాలా ఆసక్తికరమైన సమాచారం లభించింది. మా తండ్రిగారు మా కుటుంబాన్ని ఆంధ్ర ప్రదేశ్ లోనే వుంచి తను మాత్రం ఉద్యోగ రీత్యా బదిలీ మీద ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెడుతూ ఉండేవారు.  దీని వల్ల అందరిలాగానే ఆయనకు కుటుంబంతో సన్నిహితంగా ఆనందంగా గడిపే అవకాశం లేకపోయింది.  ఆయనకు కోరికలు తీరక చనిపోవడం వల్ల ఆయన ఒక సంపన్న కుటుంబంలో తిరిగి జన్మించారు. యుక్త వయసులోకి ప్రవేశించగానే ఆయన శృంగారపరమైన ఆలోచనలతో స్వేచ్చా జీవితాన్ని గడిపారు. ఇవన్నీ తెలుకుకున్న తరువాత నాకు కొంత అశాంతి కలిగిందనడంలో ఎటువంటి సందేహం లేదు, కాని క్రితం జన్మలో కోరికలు తీరకుండా చనిపోయిన తరువాత ఆత్మ ఆ కోరికలను తీర్చుకోవడం కోసం తరువాతి జన్మలో తీరని కోర్కెలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుందని  నిర్ధారించుకున్నాను.  ఇదే సందేశం శ్రీ మద్ భగవద్గీతలోని 8వ. అధ్యాయములో అక్షర బ్రహ్మ యోగములో చెప్పబడింది.

8వ. అధ్యాయములోని 5, 6 శ్లోకములు:
                       

ఎవరయితే అంత్యకాలమును నన్నే  స్మరింతురో వారు నన్నే చేరుతున్నారు. ఈ విషయములో ఎటువంటి సందేహము లేదు. కౌంతేయా, (అర్జునా) ఈ మానవుడు అంత్య కాలమున ఏఏ భావమును స్మరిస్తూ దేహ త్యాగము చేయునో, ఆయాభావమునే  మరుజన్మలో పొందుచున్నాడు.  ఎందుకనగా అతడెల్లవేళలందూ ఆభావము చేతనే ప్రభావితుడగుచున్నాడు.

మాబంధువుల ఇంటిలో, వారి పెద్దబ్బాయి నరాల జబ్బుతో చిన్న తనం నుంచీ పూర్తిగా మంచానికే అతుక్కుపోయాడు. అతని తల్లి తండ్రులు అతనికి 20 సంవత్సరముల వయసు వరకూ సేవ చేశారు, తరువాత అతను చనిపోయాడు.  ఆ పిల్లవాడు అన్ని సంవత్సరాలపాటు మంచానికే ఎందుకు పరిమితమైపోయాడని నా మనస్సు ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేది.  ఈ క్రమంలో నాకు ఆసక్తికరమయిన విషయాలు తెలిసాయి. ఆపిల్లవాడు క్రిందటి జన్మలో ఈ దంపతులకు చాలా సన్నిహితమైన స్నేహితురాలు. ఆమెకు వివాహం కాలేదు.  ఈ జన్మలో ఆమెకు వీరు తల్లిదండ్రులుగా లభించారు.  ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించి వీరికి కొడుకుగా జన్మించి వారి చేత పూర్తిగా సేవలు చేయించుకొని మరణించడం జరిగింది.

నా స్నేహితులలో ఒకరు బ్యాంక్ లో పెద్ద హోదా కలిగిన ఉద్యోగంలో ఉన్నారు. 45 సంవత్సరాల వయసులో, పక్షవాతంతో ఆయన తన భార్య, ఐదుగురు కుమార్తెలను వదలి మరణించారు.  వారి కుటుంబంలో జరిగిన ఈ వైపరీత్యానికి కారణమేమిటని ఆశ్చర్యపోతూ సమాధానం కోసం బాబా వైపు చూశాను.  ఆయనకి ఎందుకని ఇటువంటి మరణం సంభవించింది?

క్రిందటి జన్మలో ఆయన ఒక స్కూల్ లో డ్రిల్ మాస్టారు..  ఆయన ఎప్పుడు అమ్మాయిలని తక్కువగా చూసి అబ్బాయిలనెప్పుడూ ఆటలలో ప్రోత్సహిస్తూ ఉండేవాడు.  ఈ జన్మలో ఆ ఐదుగురు అమ్మాయిలు ఆయన మీద కక్ష తీర్చుకోవడానికి ఆయన కుమార్తెలుగా జన్మించారు.  అ విద్యార్దినిలని నిరాదరణతో అగౌరవంగా చూసినందుకు ఆయన పక్షవాతంతో మరణించాడు.

నా సన్నిహిత స్నేహితులోని ఒకరి అబ్బాయి అమెరికాలో ఉండేవాడు.   అతను బాగా విద్యావంతుడు.  ఎంతో ధనం సంపాదించాడు. ధన సంపాదనా ప్రయత్నంలో ఒక ప్రమాదానికి గురయ్యి అతను 34 సంవత్సరాల చిన్న వయసులోనే మరణించాడు. ఆ ప్రమాదం నన్ను బాగా కలచి వేసింది. వారి కుటుంబానికి ఎందుకని ఈ విధంగా జరిగాల్సి వచ్చిందని మొదట నాకు ఆశ్చర్యం వేసింది.  వారు ఎవ్వరికీ కూడా హాని తలపెట్టిన వారు కాదు. అటువంటి వారికి ఎందుకని ఈ శిక్ష?  ధ్యానంలో నేను బాబాని అడిగాను. దానికి బాబా ఈ విధంగా చూపించారు.

నా స్నేహితుని భార్య వివాహానికి ముందటి రోజులలో ఒక అనాధ బాలుని మీద జాలి చూపించింది.  ఆమె అతనికి భోజనం పెట్టింది. ఆ పిల్లవాడు ఆమే తనకు మాతృమూర్తి కావాలనుకున్నాడు. ఒకరోజున అతడు ఏదో ఆలోచనలలో ఉండి రోడ్డు ప్రమాదం లో మరణించాడు. అతడు నాస్నేహితునికి కొడుకుగా జన్మించాడు. క్రిందటి జన్మలో బీదరికాన్ని అనుభవించడం వల్ల ఈ జన్మలో అతను సంపన్నమైన కుటుంబంలో జన్మించాడు.  బాగా విద్యవంతుడయి, ఇంకా ధనం సంపాదించడానికి మార్గాలు వెతుకుతూ , అమెరికాలో ప్రమాద వశాత్తూ ఒక కొండమీదనించి  క్రిందపడి మరణించాడు.  క్రిందటి జన్మలో నా స్నేహితుని కొడుకుగా, ఆఖరి క్షణాలలో కూడా ఎప్పుడు ధనం గురించే ఆలోచిస్తూ మరణించడం వల్ల అతను ఇప్పుడు మరలా అమెరికాలోని ఒక కోటీశ్వరుని  కుటుంబంలో తిరిగి జన్మించి మంచి జీవితాన్ని గడుపుతున్నాడు.

ఇప్పుడు పునర్జన్మల మీద  ఉపన్యాసం ఇస్తున్న వ్యక్తి (నేను) క్రిందటి నాలుగు జన్మలు ఎలా వుండేవో తెలుసుకోవాలనే ఆసక్తి మీలో కలగవచ్చు.  వాటి గురించి కూడా వివరిస్తాను.  

(గత  జన్మలు  - తరువాయి భాగంలో)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు 

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List