01.01.2012 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
శ్రీవిష్ణు సహస్రనామం 20 వ.శ్లోకం, తాత్పర్యము
శ్లోకం: మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసస్సతాం గతిః
అనిరుధ్ధ స్సురానందో గోవిందో గోవిదాం పతిః ||
తాత్పర్యము: పరమాత్మను, శార్గమను విల్లును ధరించినవానిగా, భూమిని ధరించువానిగా, సృష్టి వైభవమే తన నివాసముగా గలవానిగా, సత్పురుషుల మార్గము, గమ్యము తానే అయినవానిగా, అడ్డగింప వీలులేనివానిగా, దేవతలకు ఆనందము కల్గించువానిగా, గోవులకు యజమానిగా, జ్ఞానులకు రక్షకునిగా ధ్యానకు చేయుము.
శ్రీ సాయితో మధురక్షణాలు -12/2
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి - 2వ.భాగం
(నిన్నటి సంచిక తరువాయి భాగం)
శంకరయ్యగారు స్వామీజీని కౌగలించుకొని కళ్ళంబట నీరు కారుతుండగా గట్టిగా అరిచారు "రైల్వే స్టేషన్ వద్ద నేను కలుసుకున్నది, ఆయన సాయిబాయేనా???!!!
శంకరయ్యగారికి మాయ తొలగిపోయింది. వచ్చినది బాబాయేనని గుర్తించలేక ఆయన పాదాలముందు సాగిలపడి నమస్కారం చేయలేకపోయిందుకు విచారించారు. "అత్యుత్తమ ఆధ్యాత్మిక వ్యక్తులు కూడా భగవంతుడే మానవ రూపంలో తమ ఎదుట కనిపించినా గుర్తించలేరు. వారితో పోల్చుకుంటే నువ్వు లెక్కలోకే రావు. నువ్వేమీ బాధ పడనవసరంలేదు" అని స్వామీజీ అన్నారు.
ఫకీరు ముందే చెప్పినట్లుగా కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. వచ్చిన వారంతా కూడా "నభూతో నభవిష్యతి" అని ప్రశంసించారు. శంకరయ్యగారి మాటలలో "నాజీవితంలో ఇవి మధురమైన క్షణాలు. బాబాకే స్వయంగా నేను నాలుగు అణాలు యిచ్చినందుకు నేనెంతో తృప్తిని నామదిలో నిక్షిప్తం చేసుకొన్నాను".
బాబాగారు ఉన్నకాలంలో నాడు, నేడు, ఆయన మనకేది తెలియచెప్పదలచుకున్నారో, ప్రతి లీలా కూడా మనకు బోధపరుస్తుంది. మానవుడు ప్రతిపాదించిన దానిని దైవం పరిష్కరిస్తాడని చెపుతు ఉంటుందని తెలియ చేస్తుంది పైన చెప్పిన సంఘటన. బాబా సమాధి అయిన తరువాత కూడా, తాను మాట ఇచ్చినట్లుగానే, తన బిడ్డలు వేయి మైళ్ళ దూరంలో ఉన్నాసరే ఆర్తితో అర్ధించిన వెంటనే ఆయన వారి రక్షణ కోసం వస్తారు.
ఎవరికయితే గుండె లోతులోనుంచి బాబా స్పందన వచ్చునో అది బాబాయొక్క హృదయపూర్వకమయిన ఆశీర్వచనము. అటువంటి బాబా భక్తుడు ధన్యుడు.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment