07.08.2013 బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 49వ.అధ్యాయం
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 80వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం : అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్ |
సుమేధా మేధజోధన్య స్సత్యమేధా ధరాధరః | |
తాత్పర్యం : పరమాత్మను ఆత్మ గౌరవములేనివానిగా, తన స్పర్శచే సృష్టికి గౌరవమిచ్చువానిగా, అందరిచే గౌరవింపబడువానిగా, ధ్యానము చేయుము. ఆయన మూడు లోకములకు అధిపతియై అట్టి మూడు లోకములనూ తానెత్తిపట్టి యున్నాడు. ఆయన అబివృధ్ధి చెందుచున్న బుధ్ధిగా, దాని ఫలితముగా దానిని పొందువానిగా ధ్యానము చేయుము. సత్యమే ఆయన ధర్మమై, భౌతికస్థితినుండి సత్యలోకము వరకూ తన బుధ్ధియందు సమస్తము ధరించుచున్నాడు.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 49వ.అధ్యాయం
20.02.92
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు, సాయి భక్తులుగా మారిపోయిన యిద్దరి చరిత్ర - సాయిభక్తునిగా ఉంటూ మనసులో నిగ్రహము లేక మానసిక బాధపడుతున్న ఒక వ్యక్తి చరిత్ర వర్ణించినారు. ఈ ఉత్తరము చదవటానికి ముందు ఈముగ్గురి చరిత్ర చదివినపుడు నీకే చాలా ఆస్ఛర్యము వేస్తుంది.
శ్రీసాయిపై విపరీతమైన నమ్మకము ఏర్పడుతుంది. అన్నట్టు ఈ ఉత్తరము రాజమండ్రి స్టేషన్ నుండి ఎందుకు రాస్తున్నాను అనేది నీకు చెప్పలేదు కదూ - ఈరోజు నిత్యపారాయణ 49వ.అధ్యాయము రైలులో చేసినాను. ఈ అధ్యాయములో హేమాద్రిపంతు చెప్పిన మాటలు, ఈ నారైలు ప్రయాణానికి, జీవితము అనే రైలు ప్రయాణానికి చాలా దగ్గర సంబంధము చూపించుతున్నది. "మన కర్తవ్యమును మనము చేయగలిగినచో, సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును". ఈమాటలపై నమ్మకముతో నాకర్తవ్యమును పూర్తిచేయటానికి నిన్నరాత్రి సికిన్ద్రాబాద్ నుండి విశాఖపట్నము బయలుదేరినాను. దారిలో రాజమండ్రి స్టేషన్ నుండి నీకు ఈఉత్తరము వ్రాస్తున్నాను. మీ అక్క వివాహము చేయటము నాకర్తవ్యము. ఈరోజు సాయంత్రము విశాఖపట్నములో పెండ్లి తాంబూలాలు తీసుకొనవలసి యున్నది. శ్రీసాయిబాబా సహాయము కోరుతు ముందుకు వెళ్ళుతున్నాను. శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసోమదేవస్వామి యొక్క గురువు చెప్పినమాటలు వివరించబడినవి "ఎచ్చట మనసు శాంతించి యానందమును పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము".
నావిషయములో నేను కోరుకొంటున్న కోరిక నీకు చేబుతాను, విను. కమలానగర్ హైదరాబాదులో నేను స్వంతముగా కట్టుకొన్న నాస్వంత యింటిలో శ్రీసాయి దర్బారు నిర్మించుకొని ఈశేష జీవితము శ్రీసాయి సేవలో గడపాలి అని ఉంది. ఈనాకోరిక తీరాలంటే శ్రీసాయి దయ - నీసహకారం కావాలి. నానాసాహెబు చందోర్కరు అందమైన స్త్రీని చూసిన తర్వాత మనోనిగ్రహము లేక బాధపడుతున్న సమయములో శ్రీసాయి ఆయనకు యిచ్చిన సలహా ప్రతి ఒక్కరు తెలుసుకోవలసియున్నది. "నానా! అనవసరముగా చీకాకు పడుచున్ టి వేల? యింద్రియములను వాని పనులు చేయనిమ్ము. వానిలో మనము జోక్యము కలుగజేసికొనకూడదు. దేవుడు ఈసుందరమైన ప్రపంచమును సృష్ఠించి యున్నాడు గాన అందరిని చూచి సంతసించుట మన విధి". నానా త నతప్పును తెలుసుకొని తన మన్సులోని చెడు ఆలోచనలను తొలగించినాడు. నావిషయములో శ్రీసాయి ఒకసారి (ధ్యానములో యండగా) అంటారు - పరస్త్రీ వ్యామోహము పరస్త్రీ సంబంధము టిక్కెట్టు లేకుండ చేసే రైలు ప్రయాణము వంటిది. అటువంటి జీవితము అనే రైలు ప్రయాణములో సుఖశాంతులు కరువు అయి మనము మన జీవిత గమ్యం చేరలేము. ఈవిషయములో యింతకంటే విపులముగా నీకు నేను వ్రాయలేను. నీజీవితములో మంచి, చెడును గమనించుతు ముందుకు సాగిపో.
శ్రీసాయి సేవలో
నీతండ్రి.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
గురువుయొక్క మహిమ యెవరికీ తెలియదు..గురువుని బాగా అర్ధం చేసుకోవాలి..ఆయనలో ఉన్న విశిష్టమయిన గుణాలన్నిటినీ మనం అర్ధం చేసుకొని, ఆచరించినప్పుడే మనం మన గురువుని పూర్తిగా అర్ధం చేసుకున్నట్లు..ఈ మధురమైన భజన వినండి.
http://www.youtube.com/watch?v=-Qb2jMOUxtE
Shirdisaidarbar link
https://www.facebook.com/ShirdiSaidarbar1?ref=hl
Dwarakamayi geet maala link
https://www.facebook.com/dwarakamai?ref=hl
0 comments:
Post a Comment