Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, September 25, 2015

సైనస్ కి సర్జరీ వద్దు - నామీద నమ్మకముంచు

Posted by tyagaraju on 5:14 AM
    Image result for images of shirdi sai baba doing treatment
         Image result for images of rose hd

25.09.2015 శుక్రవారం
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి

సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు హెతాల్ పాటిల్ రావత్ గారి బ్లాగులో ప్రచురింపబడిన ఒక సాయిభక్తురాలి అనుభవం గురించి తెలుసుకునేముందు సిధ్ధవైద్యం గురించి కొంత తెలుసుకుందాము.

సిధ్ధవైద్యం గురించి క్లుప్తంగా మీకందరికీ తెలియచేస్తాను

సిధ్ధవైద్యం, ఆయుర్వేదం రెండింటికీ భేదం ఉంది.  ఆయుర్వేదం వ్యాధిమీద పనిచేస్తుంది.  సిధ్ధవైద్యం ప్రధానంగా శరీరం లోపలి మూలాలని పటిష్టపరచి ఒక నిర్దిష్టమార్గంలో శరీరాన్ని ఉత్తేజ పరుస్తుంది. సాధన లేకుండా సిధ్ధవైద్యం జరిగేపని కాదు. సిధ్ధవైద్యం యోగశాస్త్రం నుండి ఆవిర్భవించింది.

ఇది చాలా ప్రాచీనమయిన వైద్యవిధానం.  పదివేల సంవత్సరాలకు పూర్వమే ఇది ప్రాచుర్యంలో ఉంది.  
     
Image result for images of agastyamuni

తాళపత్రగ్రంధాలలో వివరించిన ప్రకారం మొట్టమొదటగా పరమశివుడు పార్వతికి సిధ్ధవైద్యం గురించి వివరించాడు.  

         Image result for images of parvati teaching kumaraswamy

పార్వతి ఈ వైద్యశాస్త్రాన్ని తన కుమారుడు కుమారస్వామికి వివరించింది.  కుమారస్వామి ఈ శాస్త్రాన్నంతా అగస్త్యమునికి బోధించాడు.  

            Image result for images of agastya sage

అగస్త్యమహాముని 17మంచి సిధ్ధులకు బోధిస్తే వారు మానవాళికంతటికీ బోధించారు.  

సిధ్ధ అనే పదం సిధ్ధి నుండి పుట్టింది.  సిధ్ధి అంటే దివ్యానందము యొక్క పరిపూర్ణత.  ఇందులో పరిపూర్ణతను  సాధించినవారిని సిధ్ధులు అంటారు.  ఈ వైద్యశాస్త్రం దక్షిణ భారత దేశంలో ప్రాచుర్యంలో ఉంది.  

(ఇంకా సమగ్ర సమాచారం కోసం గూగుల్ లో సిధ్ధవైద్యం గురంచి పూర్తిగా చదవండి.) 

http://www.ishafoundation.org/blog/lifestyle/health-fitness/health-a-holistic-perspective/

http://www.rapidhomeremedies.com/page/3

సైనసైటిస్ తలనొప్పికి క్రింద ఇచ్చిన సైట్లు చూడండి. సిధ్ధవైద్యం ఇంటిలోనే ఏవిధంగా చేసుకోవచ్చొ వివరింపబడింది.

http://www.rapidhomeremedies.com/remedies-for-sinus-infection.html

http://www.thesiddha.com/home-remedies-sinusitis/ 



సైనస్ కి సర్జరీ వద్దు - నామీద నమ్మకముంచు  
        
       Image result for images of  gowrivakkam sai temple

నాలుగు సంవత్సరాలనుండి నేను బాబాను పూజిస్తూ ఉన్నారు.  ప్రతివారం చెన్నైలో ఉన్న గౌరివాక్కం సాయిమందిరానికి వెళ్ళి బాబాను దర్శించుకుంటు ఉంటాను. నిజం చెప్పాలంటే నాకన్నా నాభర్తకే బాబా అంటే ఎంతో భక్తి.  సాయిభక్తులందరికీ నాఅనుభవాన్ని వివరంగా చెబుతాను.   



2007వ.సంవత్సరం నుండి నాభర్త సైనస్ తో ఎంతో బాధపడుతూ ఉన్నారు.  దురదృష్టవశాత్తు ఒకసారి సైనస్ వల్ల బాధ మరీ ఎక్కువయి ముక్కునుండి కాస్త రక్తం కూడా కారసాగింది.  అన్ని ఆస్పత్రులలో పరీక్ష చేయించాము.  డాక్టర్లందరూ సీ.టీ.స్కాన్ చేయించమని చెప్పారు.  స్కాన్ చేయించిన తరువాత రిపోర్ట్ చూసిన డాక్టర్ సర్జరీ చేయవలసిందేననీ అంతకుమించి మరో మార్గం లేదని చెప్పారు.  

     Image result for images of sinus

గౌరివాక్కం సాయిమందిరంలో వుండే సాయిభక్తుడు, గురువుగారు అయిన శివ అన్నా గారిని కలుసుకుని పరిస్థితి వివరించి చెప్పాము.  నాభర్త  సమస్యనంతా  విని ఆయన, బాబా నూటికి నూరుశాతం సర్జరీ జరిపించరనీ, సాయిబాబా మీద నమ్మకం ఉంచమని చెప్పారు.  కొంతకాలం వేచి చూడమని చెప్పారు.   

               Image result for images of shirdi sai baba doing treatment

ఆయన చెప్పిన ఈ మాటలను విని సర్జరీ చేయించుకోవాలా, వద్దా అనే మీమాంసలో పడ్డాము.  శివ అన్నాగారు చెప్పినట్లుగా కొంతకాలం ఆగి చూద్దామా? వద్దా?  ఈ విధంగా ఆలోచించాము.  ఆఖరికి బాబా మాట మీదే విశ్వాసం ఉంచి కొంతకాలం ఓపికతో వేచి చూద్దామనే నిశ్చయించుకున్నాము. కాని అప్పుడు నాభర్తకి సైనస్ బాధ చాలా ఎక్కువగా ఉంది.  ఒకరోజు (అది మాకు బాబా ప్రసాదించిన రోజు) మానాన్నగారు నాభర్త స్కాన్ రిపోర్ట్ ని ఒక సిధ్ధవైద్యునికి చూపించారు.  మానాన్నగారు కేంద్రప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్నారు.  అక్కడికి ప్రతివారం, వారంలో మూడురోజులు ఒక సిధ్ధవైద్యుడు వస్తూ ఉంటారు.  మేమసలు ఆవైద్యుడిని సంప్రదిద్దామనుకోలేదు.  ఆ ఆలోచనా లేదు.  బైక్ డిక్కీలొ పట్టని కారణం చేత నా భర్త తన స్కాన్ రిపోర్ట్ ని  బైక్ కి ఉన్న హాండిల్ కి తగిలించి ఉంచారు.  మానాన్నగారు ఆఫీసుకు వెడుతూ ఆస్కాన్ రిపోర్ట్ ని కూడా పట్టుకుని వెళ్ళారు.  ఆయన కూడా ముందు అనుకోలేదు రిపోర్ట్ పట్టుకెడదామని.  మాతో చెప్పకుండానే, తన ఆఫీసుకు వచ్చే సిధ్ధ డాక్టర్ గారికి స్కాన్ రిపోర్ట్ చూపించారు.  మానాన్నగారి ఆఫీసు, ఆస్పత్రి రెండూ దగ్గర దగ్గరగానే ఉన్నాయి. మానాన్నగారు తను డాక్టర్ అప్పాయింట్ మెంట్ తీసుకున్నానని, తన ఆఫీసుకు వచ్చి స్కాన్ రిపోర్ట్ పట్టుకెళ్ళమని నాభర్తకు ఫోన్ చేసి చెప్పారు.  తరువాత సిధ్ధా డాక్టర్ గారు మా ఆయనతో ఫోన్ లో మాట్లాడారు.  తనకు ఒక నెల సమయం ఇవ్వమనీ, ఒక్క నెలలోనే సైనస్ ని తగ్గిస్తానని నమ్మకంగా చెప్పారు.  నిజంగా సాయిబాబాయే ఆవిధంగా చెపుతున్నంత ఆనందం వేసింది నాకు.     

డాక్టర్ గారు సిధ్ధవైద్యం మొదలు పెట్టారు.  ఒక వారం గడిచింది. నాభర్తలో ఒక్కసారిగా అధ్బుతమైన మార్పు వచ్చింది. సాయిబాబాయే సిధ్ధవైద్యుని రూపంలో వైద్యం చేశారు. సాయిప్రేరణే లేకపోతే ఇది సాధ్యమయే విషయం కాదు.  సాయి ఒక్కరే తన భక్తులను కన్నతల్లిలా కనిపెట్టుకుని ఉంటారు. అంతా ఆయనే.  ఒక్కసారి నమ్మకంతో స్మరిస్తే చాలు, మరుక్షణంలోనే ఆయన మనముందు ఉంటారు.  సర్జరీ లేకుండా నాభర్తకి సైనస్ నివారణయితే, నా అనుభవాన్ని సాయి మిరకిల్ సైట్ లో ప్రచురణకు పంపిస్తానని బాబాని ప్రార్ధించాను.  బాబా తాను చెప్పినది చేసి చూపించారు. 

(సర్జరీ అవసరం లేకుండా చూస్తాను అని శివ అన్నా గారి ద్వారా చెప్పించిన విషయం సాయి భక్తులు గుర్తుంచుకోవాలి -  త్యాగరాజు) .

ఓం సాయిరాం

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List