29.09.2015 మంగళవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు హెతాల్ పటేల్ రావత్ గారి బ్లాగులోనుండి సేకరించిన రెండు బాబా లీలలను చదువుదాము.
బాబా ప్రసాదించిన సంతానం
చిన్నప్పటినుండి నేను బాబా భక్తురాలిని. నేను గృహిణిని. బాబా నాకు ఎన్నో అనుభవాలనిచ్చారు. నాకెప్పుడు అవసరం వచ్చినా ఆయన సహాయం చేస్తున్నారు. రెండుసంవత్సరాల క్రితం నాకు వివాహమయింది. సంతానం కోసం ఎదురు చూస్తున్నాను. నాకు సంతానం ప్రసాదించమని ప్రతిరోజు బాబాని ప్రార్ధిస్తూ ఉన్నాను. నెలలు గడుస్తున్నా ఎటువంటి సూచనలు కలగలేదు. బంధువులందరూ శుభవార్త ఎప్పుడు చెపుతావు అని అడగడం ప్రారంభించారు. నేనెప్పుడు ఎదురుపడినా వారలా అడగడం నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. నన్ను నిరాశకు గురిచేసేది. శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ ప్రారంభించాను. ప్రతినెల పారాయణ చేస్తున్నాను. మనస్పూర్తిగా బాబానే నమ్ముకున్నాను. ఒకరోజున డాక్టర్ దగ్గిరకి వెళ్ళి పరీక్ష చేయించుకుందామనుకున్నాను. డాక్టర్ పరీక్ష చేసి (పీసిఓడి) పోలీ సిస్టిక్ ఒవేరియన్ డిజార్డర్ ఉందని చెప్పింది. ఆరు నెలలు వాడమని టాబ్లెట్స్ ఇచ్చింది. ఇది వినగానే నేను హతాశురాలినయ్యాను.
ప్రశ్నలు జవాబులలో బాబాని అడిగాను. "నీబాధలన్నీ ఒక్క నెలలోనే పరిసమాప్తమవుతాయి. నీ జబ్బు నయమవుతుంది" అనే జవాబు వచ్చింది. మరలా ఇంకొక ప్రశ్న అడిగినప్పుడు "నీకు మగపిల్లవాడు జన్మిస్తాడు. నీ బంధువులందరూ నిన్ను అభినందిస్తారు" అని జవాబు వచ్చింది.
ఈ రెండు జవాబులు వచ్చిన మరుక్షణంలో కిటికీ గుండా బయటకు చూశాను. బాబా నన్ను ఆశీర్వదిస్తున్నారా అన్నట్లుగా బయట వెళ్ళే రిక్షామీద బాబా బొమ్మ కనపడింది. డాక్టర్ ఇచ్చిన ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు. మరుసటి నెలలోనే నేను గర్భవతినయ్యాను. సుఖప్రసవమయ్యి నాకు మగపిల్లవాడు జన్మించాడు. బాబా నా మొరాలకించారు. ఆయనమీద నమ్మకం ఉంచుకొని ఆయననే నమ్ముకుంటే ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తారు.
ఓం సాయిరాం
2) మాది బెంగళూరు. నావయసు 30 సంవత్సరాలు. మావివాహమయి 3 సంవత్సరాయలయిన తరువాత సంతానం కోసం ప్లాన్ చేసుకొన్నాము. నాకు అరోగ్యవంతమయిన సంతానాన్నిమ్మని భగవంతుని ప్రార్ధిస్తూ ఉండేదానిని. తరువాత నేను గర్భవతినయ్యాను. బంధువులందరూ ఎంతో సంతోషించారు. క్రమం తప్పకుండా డాక్టర్ దగ్గిరకి వెళ్ళి పరీక్ష చేయించుకుంటూ ఉన్నాను. పుట్టబోయే బిడ్దకి ఏదయినా డౌన్ సిండ్రోం ఉందేమో తెలియాలంటే , డబుల్ మార్కర్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పింది డాక్టర్.
(డౌన్ సిండ్రోం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ లింక్ చూడండి. పాఠకులకు అవగాహన కోసం ఇస్తున్నాను --
http://www.downtv.org/seccion.asp?id=7&id_video=589&gclid=CLXJ2seGnMgCFQ8sjgod-rMLMQ
త్యాగరాజు )
నాకు రక్తపరీక్ష చేశారు. అందులో పాజిటివ్ వచ్చింది. నాకు భయం వేసింది. నిర్ధారణ చేయడానికి ఇంకా కొన్ని పరీక్షలు చేయాలని చెప్పింది. తరువాత చేసే పరీక్షలన్నిటిలోను పాజిటివ్ వస్తే కనక, అబార్షన్ చేయాలని చెప్పింది. మాకు చాలా దుఖం కలిగింది. తరువాత చేయబోయే పరీక్షలు చాలా బాధాకరంగా ఉంటాయి. పెద్ద సిరంజితో యుటిరస్ నుండి నీటిని తీసి పరీక్ష చేయాల్సి ఉంటుంది. లోపల ఉన్న శిశువుకు కూడా అది ప్రమాదకరం. నాకు చాలా ఏడుపు వచ్చింది. నేను నమ్ముకున్న దైవాలయిన బాబా, దుర్గాదేవి, హనుమాన్ లని ప్రార్ధించాను. తను లోపల బాధపడుతున్నా నా భర్త బయటకి గంభీరంగా ఉండి నాకు ధైర్యం చెప్పసాగారు.
సెకండ్ ఒపీనియన్ కోసం మరొక డాక్టర్ వద్దకు వెళ్ళాము. ఆ డాక్టర్ బెంగళూరు లో స్కానింగ్ సెంటర్, లాబ్ నిర్వహిస్తోంది. ఆమె దీనిమీదే ఎక్కువగా అధ్యయనం చేసింది. బెంగళూరులో మంచి పేరు కూడా ఉంది. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఆవిడ దగ్గర అప్పాయింట్ మెంట్ తీసుకుందామనుకున్నాము. నా భర్త అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు. కాని రెసెప్షన్ లో అప్పాయింట్ మెంట్ ఇప్పటికిప్పుడే కుదరదనీ, డాక్టర్ గారు విదేశాలకు వెడుతున్నందువల్ల 15 రోజుల తరువాత రమ్మనమని చెప్పారు. నా భర్త పరిస్థితిని వివరంచి బాగా ప్రాధేయపడి ఎలాగయితేనే మరునాటికి అప్పాయింట్ మెంట్ తీసుకున్నారు. 15 రోజుల ముందే అన్నీ బుక్ అయిపోయాయి, దానివల్ల డాక్టర్ కూడా చాలా బిజీ, అప్పాయింట్ మెంట్ దొరకడం అంత సులభం కాదు. ఇటువంటి సమయంలో అప్పాయింట్ మెంట్ దొరకడం చాలా అధ్బుతం. మేము డాక్టర్ దగ్గిరకి చెక్ అప్ కోసం వెళ్ళాము. మూడురోజులుగా ఏడుస్తూనే ఉన్నాను. బాబా నువ్విచ్చిన బిడ్దని మళ్ళీ నువ్వే తీసేసుకుంటున్నావా అని రోదించాను.
మేము డాక్టర్ ని కలిశాము. ఆవిడ నాతో మాట్లాడి రిపోర్ట్స్ చూసింది. రిపోర్ట్స్ అన్నిటినీ చింపేసి చెత్తబుట్టలో పడేసింది. ఈ రిపోర్ట్ సరిగా లేదు, టెస్ట్ లు చేసినవాళ్ళకి కూడా తగిన అర్హత లేదని చెప్పింది. అంతా సరిగా ఉందో లేదో మళ్ళీ నేను స్కాన్ చేసి చూస్తానని చెప్పింది డాక్టర్. నాగుండె వేగంగా కొట్టుకోసాగింది. డాక్టర్ స్కాన్ చేసి అంతా సరిగ్గానే ఉంది. ఎటువంటి భయం పెట్టుకోవద్దు. ఇంక మిగతా టెస్ట్ లు ఏమీ అవసరం లేదని చెప్పింది. దుర్గా అమ్మవారే డాక్టర్ రూపంలో వచ్చినట్లనిపించింది నాకా క్షణంలో.
ఈ అధ్బుతాన్ని చేసిన సాయికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఆస్పత్రినుండి నేరుగా బాబా మందిరానికి వెళ్ళాము. తరువాత నేను ముందు చూపించుకున్న డాక్టర్ ని, ఆస్పత్రిని మార్చేసి, బాబా చూపించిన మరొక డాక్టర్ దగ్గిరకి వెళ్ళాను. ఆమె ఎంతో మృదువుగా మాట్లాడి అంతా సరిగానే ఉంటుందని నాకు ధైర్యాన్నిచ్చింది. రోజులు గడుస్తున్నాయి. మంచి ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టాలని సాయి నవ గురువార వ్రతం మొదలుపెట్టాను. ఏడవనెలలో నాకు సుగర్ చాలా హెచ్చు స్థాయిలో ఉంది. ఎంతకీ అదుపులోకి రాలేదు. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోమని చెప్పారు. 9వ.నెలలో స్కాన్ చేసారు. లోపల బిడ్డ బాగా బరువు పెరిగాడని ప్రసవం చేయాలని చెప్పారు. ఇక రెండు వారాలలో సాయివ్రతం పూర్తవుతుంది. 15రోజుల తరువాత డెలివరీ చేయమని డాక్టర్ తో చెప్పాను. ఎందుకని కారణమడిగింది. నేను సాయి నవ గురువార వ్రతం చేస్తున్నాను, ఇక రెండువారాలలో పూర్తవుతుందని చెప్పాను. ఆవిడ చిన్న చిరునవ్వు నవ్వి, అలాగే కాని, కాని వ్రతం పూర్తిచేసుకొని ఉదయం 6 గంటలకల్లా వచ్చేయమని చెప్పింది. ఆరోజు ఉదయానికల్లా వ్రతం, ఉద్యాపన పూర్తి చేసుకుని 6 గంటలకల్లా రావాలంటే నాకు కాస్త టెన్షన్ అనిపించింది. కాని సాయి నాకు సహాయం చేశారు. ఆస్పత్రికి వెళ్ళే రోజు రాత్రి ఉదయం రెండు గంటలకే లేచి పూజ పూర్తిచేసుకుని బీదలకు పంచడానికి ప్రసాదం తయారు చేశాను. పనిమనిషి సహాయంతో ప్రసాదం పంచి, 6 గంటలకల్లా ఆస్పత్రికి చేరుకున్నాము. ఏప్రిల్, 18, 2003 గురువారం ఉదయం 9.57 కి బాబు జన్మించాడు. నాకు అందమైన బాబుని బహుమతిగా ప్రసాదించిన సాయికి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తీరదు. మన గురువు, మార్గదర్శకుడు, దైవం ఆ సాయి. ఆయనని పూజిస్తూ ఆయన చెప్పిన సూత్రాలని ఆచరణలో పెడదాము. ఆయనే చెప్పిన బోధనలని ఆచరిస్తే మన జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
ఓం సాయిరాం.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment