Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, October 31, 2015

శ్రీ జీ.ఎస్.కపర్డే డైరీ - 8

Posted by tyagaraju on 3:23 AM
       
      Image result for images of shirdisaibaba old photos

       Image result for images of white rose

31.10.2015 శనివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ జీ.ఎస్.కపర్డే గారి డైరీ లోని మరికొన్ని విశేషాలు

రేపు తిరుపతి యాత్రకు వెడుతున్నందు వల్ల, మరికొన్ని విశేషాలను యాత్రనుండి తిరిగి వచ్చిన తరువాత ప్రచురిస్తాను. 


శ్రీ జీ.ఎస్.కపర్డే డైరీ - 8

12 డిసెంబరు, 1911, మంగళవారం

కాకడ ఆరతికి వేళ అయిపోతోందనే ఉద్దేశ్యంతో నేను, భీష్మ చాలా తొందరగా నిద్ర లేచాము.  కాని ఆరతికి ఇంకా గంట సమయం ఉంది.  తరువాత మేఘా వచ్చాడు.  అందరం కలిసి ఆరతికి వెళ్ళాము.  సాయి మహరాజ్ బయటకు వెళ్ళేంతవరకు నేను ప్రార్ధన చేసుకొంటూ కూర్చున్నాను.  ఆయన బయటకు వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు దర్శనం చేసుకున్నాను.  ఆయన బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే సమయంలో గోఖలే పాటలు వింటూ కూర్చున్నాను.  ఆయన చాలా బాగా పాడతారు.  
                  Image result for images of shirdisaibaba old photos

ఈ రోజు అల్పాహారం కాస్త ఆలస్యమయింది.  ఈ రోజు మేఘాకి మారేడు ఆకులు దొరకకపోవడంతో వాటి కోసం చాలా దూరం వెళ్ళవలసి వచ్చింది.  అందుచేత మధ్యాహ్న పూజ 1.30 కి గాని పూర్తవలేదు.  సాయి మహరాజ్ మంచి ఉల్లాసంగా ఉన్నారు. నవ్వుతూ కబుర్లు చెబుతూ కూర్చున్నారు. 
                  
                      Image result for images of shirdisaibaba old photos

మేము తిరిగి వచ్చి అల్పాహారం చేయడానికి కూర్చున్నపుడు, స్థానికంగా ఉన్న పాఠశాలలో దర్బారుకు నన్ను రమ్మని ఒకతను వచ్చి చెప్పాడు.  నేను భోజనం చేసి బయటకు వచ్చేటప్పటికి పూర్తయిపోయింది.  నానాసాహెబ్ సాఠేగారి దాతృత్వంతో బీదలకు అన్నదానం జరిగింది.  అయన కార్యక్రమానికి తగిన సూచనలన్నీ చేశారు.  ఈ విషయంలో హెచ్.ఎస్.దీక్షిత్ ఎంతగానో శ్రమించారు.  అల్పాహారం తరువాత కొద్ది నిమిషాలు పడుకుని లేచి, మావాళ్ళతో కలిసి మసీదుకు వెళ్ళాను.  సాయి మహరాజ్ మంచి ఉల్లాసంగా ఉన్నారు.  ఆయన ఒక కధ చెప్పారు.  అక్కడ ఉన్న ఒక పండును తీసి పట్టుకుని చూపిస్తూ ఈ పండు ఎన్ని పళ్ళను ఉత్పత్తి చేయగలదని నన్నడిగారు.  అందులో ఎన్ని విత్తనాలయితే ఉన్నాయో అన్ని వేల పళ్ళు ఇవ్వగలదని అన్నాను.  ఆయన మనోహరంగా నవ్వి, అది తన స్వధర్మాన్ని పాటిస్తుందని అన్నారు. ధర్మపరాయణత కల్గిన ఒక అమ్మాయి తనను సేవించి ఏవిధంగా పురోగతి సాధించిందో చెప్పారు.  సూర్యస్తమయం వేళ మాకు ఊదీ ఇచ్చారు.  సాయి మహరాజు సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్ళే సమయంలో ఆయనను దర్శించుకోవడానికి చావడికి ఎదురుగా నిలబడ్డాము.  ఆయన దర్శనమయ్యాక తిరిగి వచ్చేశాము. 
                      Image result for images of shirdisaibaba old photos

 భీష్మ, గోఖలే, భాయి యువకుడైన దీక్షిత్ లు చేసిన భజనలు వింటూ కూర్చున్నాము.  మాధవరావు దేశ్ పాండే ఉపాసనీలు కూడా ఉన్నారు.  సాయంత్రం చాలా ఆనందంగా గడిచింది. 

13 డిసెంబరు, 1911, బుధవారం

నేను యధాప్రకారంగా లేచి, ప్రార్ధన చేసుకున్నాను.  స్నానం చేద్దామనుకుంటే వేడి నీళ్ళు సిధ్ధంగా లేవు.  బయటకు వచ్చి మాట్లాడుతూ కూర్చున్నాను. సాయి మహరాజ్ బయటకు వెళ్ళేటప్పుడు నమస్కరించుకొన్నాను. తరువాత స్నానం చేసి పంచదశి చదివాను.  తరువాత మసీదుకు వెళ్ళి సాయి మహరాజ్ ను దర్శించుకుని ఆరతి అయిన తరువాత తిరిగి వచ్చాను. సాయంత్రం నాలుగు గంటలకు బల్వంత్, భీష్మ, బంధు లతో కలిసి బయటకు వెళ్ళాను.  సాయిమహరాజ్, బంధు తెచ్చిన నా హుక్కా తీసుకొని పీల్చారు.

మాధవరావు నాకు అమరావతి తిరిగి వెళ్ళడానికి అనుమతినివ్వవలసిందిగా సాయి మహరాజ్ ను కోరాడు.  ఆయన మరుసటి రోజు ఉదయం నిర్ణయిస్తానని చెప్పారు.  ఆయన మసీదులో ఉన్నవారినందరినీ బయటకు పంపించేసి, ఎంతో దయతో ఒక తండ్రిలాగ నాకు ఒక సలహా ఇచ్చారు. మరలా సూర్యాస్తమయం సమయంలో మరలా వెళ్ళి చావడి ఎదురుగా ఆయనను దర్శించుకొని, శేజ్ ఆరతికి వెళ్ళాము.  భీష్మ మామూలుకంటే కాస్త ముందరగా పంచదశి చదివాడు.  భాయి కూడా ఒక భజన పాడాడు. 

14, డిసెంబరు, 1911, గురువారం

ఊరికి వెళ్ళిపోదామనే ఉద్దేశ్యంతో తొందరగా లేచి, కాకడ ఆరతికి వెళ్ళి హడావుడిగా ప్రార్ధన ముగించాను.  మాధవరావుతో కలిసి మసీదులో ఉన్న సాయిమహరాజ్ వద్దకు వెళ్ళాను.   రేపు గాని, తరువాత ఎప్పుడో గాని వెళ్ళవచ్చులే అన్నారు నన్ను, సాయి మహరాజ్.  నేను దైవాన్ని తప్ప మరెవ్వరినీ సేవించకూడదన్నారు.  "మనిషి ఇచ్చేది నిలవదు.  దైవమిచ్చేది పోదు" అని కూడా అన్నారు.  నేను తిరిగి వచ్చేసరికి కల్యాణ్ కు చెందిన దర్వేష్ సాహెబ్ ఫాల్కే వచ్చారు.  ఆయన పాత కాలానికి చెందిన వాడు, మర్యాదస్తుడు.  ఆయనతో పాటు, షింగ్లే, షింగ్లే భార్య కూడా వచ్చారు. షింగ్లే బొంబాయి హైకోర్టులో పెద్ద వకీలు.  ఆయనకు న్యాయ తరగతులు కూడా ఉన్నాయి సహజంగానే బెంగాల్ విభజనలో రాజధానిగా కలకత్తా బదులు ఢిల్లి గా మార్పు జరిగిందనీ,  కొంతమంది ఖైదీలను విడుదల చేశారని, కాని వారిపేర్లు తెలియవనీ, ఇంకా ఇతర విషయాలన్నీ చెప్పారు ఆయన.  నేను మధ్యాహ్న పూజకు వెళ్ళి బాపూ సాహెబ్ జోగ్ తో కలిసి ఫలహారం చేశాను. తరువాత పడుకుని నిద్రపోయాను. కాస్త ఆలస్యంగా మసీదుకు వెళ్ళి చావడి వద్ద నమస్కారం చేసుకున్నాను.  దర్వేష్ సాహెబ్ షింగ్లేలతో మాట్లాడుతూ కూర్చున్నాను.  తరువాత భీష్మ తన రోజువారీ భజన చేశాడు.

(మరిలొన్ని విశేషాలు తరువాతి సంచికలో)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment