07. 01. 2016 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ జీ.ఎస్. ఖపర్డే గారి డైరీలోని మరికొన్ని విశేషాలు
శ్రీ జీ.ఎస్.ఖపర్డే
డైరీ – 18
05.01.1912 శుక్రవారం
రాత్రి సరిగా
నిద్రపట్టకపోయినప్పటికీ తొందరగా నిద్ర లేచాను.
కాకడ ఆరతికి వెళ్ళాను. సాయి మహరాజ్
ప్రసన్నంగా ఉన్నారు. మా అబ్బాయి బాబా, గోపాలరావు
దోలే ఆయన వద్దకు వెళ్ళారు. వారిని చూడగానే
ఆయన “వెళ్ళండి” అన్నారు.
వారు తిరిగి వెళ్ళడానికి
ఇదే ఆయన ఇచ్చిన అనుమతిగా భావించి, వారు బాబా భావూ టాంగా కట్టించుకుని వెళ్ళిపోయారు. నేను ప్రార్ధన చేసుకున్నాను. సాయి మహరాజ్ బయటకు వెళ్ళేటప్పుడు మరలా తిరిగి వచ్చేటప్పుడు
చూశాను.
ఆయన చాలా ప్రసన్నంగా ఉన్నారు. చాలా మంది భక్తులు వచ్చారు. మధాహ్న ఆరతి తరువాత ఎప్పటిలాగే భోజనం చేసిన తరువాత
కాసేపు పడుకున్నాను. తరువాత దీక్షిత్ రామాయణమ్
చదువుతుంటే వింటూ కూర్చున్నాను. దీక్షిత్ ఉపాసనీ,
భీష్మ, మాధవరావు కూడా రామాయణం వినడానికి వచ్చారు.
సాయంత్రం 5 గంటలవేళ భీష్మ తోను, మా అబ్బాయి బల్వంత్ తోను సాయి మహరాజు దర్శించుకోవడానికి
వెళ్ళాను. ఆయన తనకు చేసిన అనారోగ్య లక్షణాల
గురించి వినోదంగా చెప్పారు. బాలా భావు జోషి వేయించిన ఉలవలు తెచ్చాడు. సాయి మహరాజ్ కొన్ని
తిని మిగిలినవి పంచిపెట్టారు. ఆయన వ్యాహ్యాళికి
వెళ్ళడానికి బయటకు వచ్చినపుడు మేము చావడి దగ్గర నుంచున్నాము. తరువాత మామూలుగా ఆరతి, భీష్మ భజన జరిగాయి. దీక్షిత్ రామయణంలో రెండు అధ్యాయాలు చదివాడు. ఈరోజు కొంతమంది ధులియానుండి వచ్చి వెళ్ళిపోయారు.
06.01.1912 శనివారమ్
తెల్లవారకముందే
నిద్రలేచి, యధావిధిగా ప్రార్ధన చేసుకున్నాను.
సాయి మహరాజ్ బయటకు వెడుతుండగా చూశాను.
ఆయన వెళ్ళిన తరువాత బాలా సాహెబ్ భాటే దగ్గరకు వెళ్ళి, రంగనాధస్వామి యోగవాసిష్టమ్
మరాఠీ పుస్తకం అడిగి తెచ్చుకున్నాను. బసకు
తిరిగి వచ్చాను కాని, రామాయణం తిరిగి చదవడం ప్రారంభించాను. మేమంతా మధ్యాహ్న ఆరతికి వెళ్ళి, భోజనాలు కానిచ్చాము. నిద్ర పోకూడదనుకున్నాను కాని ఎలాగో నిద్ర ముంచుకు
వచ్చేసింది. ఏకంగా కొన్ని గంటలు నిద్రపోయాను. తరువాత దీక్షిత్ రామాయణ పఠణం జరిగింది. తరువాత నేను మసీదుకు వెళ్ళి సాయిమహరాజ్ దర్శనం చేసుకున్నాను. ఆయన ఉత్సాహంగా ఉన్నారు. తరువాత మట్లాడారు. సాయంత్రం ఎప్పటిలాగే వాడాలో ఆరతికి, ఆ తరువాత చావడిలో
శేజ్ ఆరతికి వెళ్ళాము. సాయి మహరాజ్ అసాధారణంగా
మంచి ఉల్లాసంతో మేఘాకు రహస్య సైగలు చేసి యోగాలో చెప్పబడె ‘దృష్టి పాతం’ ప్రసాదించారు. ధులియానుండి ఒక జ్యోతిష్కుడు ఉపాసనీకి అతిధిగా వచ్చి
వాడాలో ఉంటున్నాడు. రాత్రికి భీష్మ భజన, దీక్షిత్
రామాయణ పఠణం జరిగాయి.
(తరువాతి విశేషాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment