Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, February 16, 2016

ధన సంపాదన - సాయిబానిస ఆలోచనలు - 3

Posted by tyagaraju on 7:15 AM
    Image result for images of shirdisaibaba
   Image result for images of rose hd

16.02. 2016 మంగళవారం 
ఓం సాయి శ్రీసాయి అజయజయ సాయి 
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 

ఈ రోజు ధన సంపాదనపై సాయి బానిస గారి ఆలోచనలను మరికొన్ని చూద్దాము. 

ధన సంపాదన - సాయిబానిస ఆలోచనలు -  3

30.08.2007

21.  ధనానికి గౌరవం యివ్వాలిధనము లక్ష్మీస్వరూపము. ఆ ధనము మనందరికి జీవనాధారము. జీవనాధారానికి భగవంతుని దయ అవసరము.   ప్రశాంతంగా జీవించటానికి కావలసిన ధనమును ప్రసాదించమని ఆ భగవంతుని ప్రార్ధించాలిభగవంతుడు ప్రసాదించిన ధనాన్ని ఎన్నడూ దుర్వినియోగం చేయరాదు.  


08.09.2007

22.  దొంగలు దొంగతనం చేయడానికి నీయింటికి వస్తున్నారని తెలిసిన తరువాత, నీవస్తువులన్ని పక్కవాడింట్లో దాచుకోవడం, ఆ పక్కవాడు దానిని దోచుకుంటాడా, దాచి ఉంచుతాడా అనే ఆలోచన నిన్ను చికాకు పరుస్తుందిఅందుచేత నీకు కావలసినంత ధనాన్ని మాత్రమే సంపాదించుకుని నీ దగ్గిరే ఉంచుకోనీవే ధనాన్ని దొంగల బారినుంచి కాపాడుకో

23.  భుక్తి కోసం కొందరు తమ శరీరానికి సూదులతో రుద్రాక్షలను గుచ్చుకొని తాము దైవ స్వరూపులమని చెప్పుకుంటూ ప్రజలను తమ చుట్టూ తిప్పుకుంటూ ధనాన్ని ఆర్జిస్తూ తమ జీవితాన్ని గడుపుతున్నారువారికి ధన సంపాదన ఒకటే తెలుసువారికి ఆధ్యాత్మికము ఏమీ తెలియదు

                 Image result for images of costly house
24.  నీవు నివసిస్తున్న ఇల్లు ఎంత ఖరీదు చేస్తుంది అని ఆలోచించటము అవివేకముఆ యింటిలో నీవు ప్రశాంతముగా జీవించగలుగుతున్నావా లేదా అని ఆలోచించటం వివేకము.

Image result for images of happy life person

Image result for images of happy life person

11.09.2007

25.  జీవితంలో ధనము ఒక్కటే ప్రధానం కాదుప్రశాంత జీవితం గడిపే హక్కు అందరికీ ఉందిప్రశాంత జీవితం గడపడానికి కావలసినంత ధనము మాత్రమే సంపాదించి జీవిత ప్రయాణం కొనసాగించాలిధనము ఏ ఒక్కరి సొత్తు కాదని గ్రహించాలి.

15.01.2008

26.  జీవితంలో ధనసంపాదన ఒక్కటే ముఖ్యము కాదుభార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యము చాలా ముఖ్యముభగవంతుని నమ్ముకుని జీవించేవారికి సుఖప్రదమయిన ప్రశాంత జీవితము లభిస్తుంది.

              Image result for images of gods photo

   Image result for images of happy life person

23.08.2008

27.  మనిషి జీవితంలో బాగా ధనము సంపాదించగలడుసర్వ సుఖాలను కొనగలడుకాని, అతని మనసులో ఏదో తెలియని బాధ. చెప్పుకోలేని బాధతో కుమిలిపోతూ ఉంటాడుఅటువంటివానికి నాతత్వ ప్రచారం చేస్తున్నవారు వెళ్ళి వారికి మనోధైర్యం కలిగించాలి.  
Image result for images of man in depression
                      

02.09.2008

28.  నా విగ్రహాన్ని కొనేటప్పుడు విగ్రహాన్ని మలచడంలో ఆ శిల్పి పడిన కష్టాన్ని చూడు కష్టానికి తగిన కూలి అందచేసినప్పుడే నీవు నాకు చేసిన నిజమయిన పూజ అవుతుంది.
               Image result for images of sculpture shirdi sai baba

12.02.2008

29.  అప్పుతీర్చగలము అనే నమ్మకం ఉన్ననాడే అప్పు చేయాలిలేనినాడు అప్పు యిచ్చినవాడు నీపాలిట యముడిగా మారి నీకు నరకాన్ని చూపిస్తాడు.

13.09.2008


30.  ధనసంపాదనలో విలువలకు కాలరాసినా ప్రమాణాలకు తిలోదకాలిచ్చినా, అటువంటి ధనసంపాదన (నల్లధనం) తలనొప్పులను మిగులుస్తుంది జాగ్రత్త.   
                  

(మరికొన్ని ఆలోచనలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List