Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, March 13, 2016

శ్రీసాయి పుష్పగిరి - ఆధ్యాత్మికం - 5వ.భాగం

Posted by tyagaraju on 9:01 AM
        Image result for images of saibanisa
         Image result for images of rose hd

13.03.2016 ఆదివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి బానిస గారికి బాబా వారు ఆధ్యాత్మికతపై ఇచ్చిన సందేశాలను చదవండి.
          Image result for images of saibanisa
శ్రీసాయి పుష్పగిరి - ఆధ్యాత్మికం - 5వ.భాగం

11.02.2006

41.  అన్నం పరబ్రహ్మస్వరూపంఆకలితో ఉన్నవారికి ప్రేమతో అన్నంపెట్టుఅతని ఆకలి తీరేవరకు అతనికి అన్నం పెట్టు సమయంలో అతనిని భగవత్ స్వరూపంగా భావించి అన్నం పెట్టునీవు ఎవరికయినా అన్నం పెట్టినపుడు వారిని అర్ధాకలితో బయటకు పంపవద్దుఅర్ధాకలితో పంపడం మహా పాపమని గ్రహించు

         




42.  శ్రీసాయి మనకు గురువు, దైవంమనము ఆయనకు భక్తులం మాత్రమేశ్రీసాయికి శిష్యులెవరూ లేరుమనం శ్రధ్ధ సాబూరీతో ఆయన నామస్మరణ చేస్తు మన సంసార సాగరాన్ని దాటాలి.                
                                                                                                                                                                           సాయిబానిస   

14.05.2006

43.  ఒక రాజుగారి దర్బారులో, రాజుగారు ప్రజలకు మంచి సూక్తులు చెబుతున్నారుఆసమయంలో నేనక్కడికి వెళ్ళి రాజుగారిని ఒక ప్రశ్న వేశానురాజా! నీకు గురుదర్శనం లభ్యమవుతున్న సమయంలో ఒక అనాధప్రేత సంస్కారానికి సంబంధించిన శవము కనిపిస్తే, గురుదర్శనం ముందు చేసుకుంటావా లేక అనాధప్రేత సంస్కారం చేస్తావా అని అడిగానునామాటలకు ఆ రాజు ముందుగా అనాధ ప్రేత సంస్కారం చేసిన తరువాతే నేను గురుదర్శనానికి వెడతాను అని అన్నాడుఈసమాధానం నాకు తృప్తినిచ్చింది.
(గురుసేవకంటె అనాధప్రేత సంస్కారము గొప్పది

11.08.2006

44.  జన్మించడం ఎంత సత్యమో మరణించడం కూడా అంత సత్యమేఅందుచేత జనన మరణాల గురించి ఆలోచించకుండా వీటిని ప్రసాదిస్తున్నటువంటి భగవంతుని గురించి ప్రశాంతంగా ఆలోచిస్తూ జీవితాన్ని కొనసాగించు.
                         Image result for images of man praying to hindu  god


11.08.2000

45.  ఈమధ్యకాలంలో యోగా కేంద్రాలలో చేరడం ఒకగొప్ప లక్షణంగా భావించబడుతోందివీటి వలన ఆరోగ్యం సంపాదించవచ్చుకాని, ఆధ్యాత్మికమును ఏమాత్రము సంపాదించలేముఅందుచేత ఆధ్యాత్మిక సంపాదన కోసము ఏకాంతముగా భగవంతుని గురించి ఆలోచించు

46.  ఆధ్యాత్మిక నదిలో ప్రయాణం సాగిస్తున్న నావను ఒడ్డుకు చేర్చి దానిని ఒక నాలుగు చక్రాల వాహనముపై పెట్టి అడ్డదారిన సముద్రతీరానికి తీసుకొని వెళ్ళి, సముద్రంలో ఆ నావను వదలటం మూర్ఖత్వం కాదా

      ఆధ్యాత్మిక రంగములో మనం ఆఖరిశ్వాస వరకు ప్రయాణం సాగించవలసిందేభగవంతుని సన్నిధికి చేరడానికి అడ్డదారులు ఉండవు

02.11.2006

47.  అన్నిమతాల సారము ఒక్కటేఅందరూ ఆఖరికి చేరవలసిన గమ్యము ఒక్కటేఅందుచేత అన్యమతాలలో ఆసక్తిని కనపర్చవలసిన అవసరం లేదునీవు నీస్వధర్మాన్ని పాటిస్తూ నీ గమ్యాన్ని చేరుకో.  

21.01.2007

48.  ఆధ్యాత్మిక విందు (అనగా సత్సంగాలు) ను అందరితో కలిసి చేయికాని ఆధ్యాత్మిక ప్రయాణం నీవు ఒంటరిగానే చేయవలసి ఉంటుందని గుర్తుంచుకో.  
                       Image result for images of satsanga


28.03.2007

49.  మనిషియొక్క ఆయుష్షు పెంచడానికి గుండెకాయకు బ్యాటరీ (పేస్ మేకర్) పెట్టి ఆయుష్షును పెంచగలరు వైద్యులు బ్యాటరీ కూడా పనిచేయడం ఆగిపోయినపుడు మనిషి మరణించవలసిందేమరణించిన మనిషితో పాటు బ్యాటరీ కూడా చితి మంటలలో కాలి బూడిదవవలసిందే.
                                    Image result for images of pace maker


26.06.2007

50.  నేను మీకు రెండు కణుపుల చెఱకు గడను యిచ్చానువాటి కణుపుల దగ్గర కోసి మీ పొలంలో నాటండి చెఱుకు పంట పండించి పంటనుండి వచ్చే చెఱకురసంతో నాభక్తుల దాహం తీర్చండి.

(తరువాతి సంచికలో మరికొన్ని సందేశాలు)
 (రేపటి సంచికలో  బాబా వారు పంపించిన నెయ్యి --  ఎదురు  చూడండి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Kindly Bookmark and Share it:

1 comments:

Unknown on March 13, 2016 at 9:26 AM said...

41 chala bagundi. Youga center kuda baba varu cheppina vidamga kanipistunnayee.

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List