Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, March 24, 2016

శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మికం - 9వ.భాగం

Posted by tyagaraju on 6:01 AM
Image result for images of saibanisa
      Image result for images of rose garden

24.03.2016 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బానిసగారికి బాబా వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని మనందరికోసం. 
           Image result for images of saibanisa

శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మికం - 9వ.భాగం  


08.09.2009

81.  చిన్నపిల్లలు భగవంతునికి ప్రతిరూపాలు పిల్లలలోని అమాయకత్వం  నీలో ఉన్నా వారిలో నీవు భగవంతుని చూడగలవు.

                           Image result for images of small children

05.05.2010

82.  ఆధ్యాత్మిక రంగంలో ఉత్తీర్ణుడవటానికి ఈ రోజు నుండే సాధన ప్రారంభించుఅంతే గాని ఎవరి సిఫార్సులు మాత్రం కోరవద్దు

16.05.2010

83.  తన ఆకలి తీరలేదుఇంకా భోజనం కావాలనే వ్యక్తికి నీవు తినబోయే భోజనము అర్పించి నీవు ఉపవాసమున్నా నేను నీ ఉపవాసాన్ని అంగీకరిస్తాను.   


26.05.2010

84.  మానవ రూపంలో ఉన్న భగవంతుడే నీ గురువుసదా నీగురువు సేవలోనే నీ జీవితాన్ని ముందుకు నడిపించు
                                                                                                                                                                           --- సాయిబానిస
03.06.2010

85.  నీవు ఆకాశంలొ (ఆధ్యాత్మిక రంగంలో)  ఎంతపెద్ద భవనము కట్టినావు అన్నది ముఖ్యం కాదు భవనము నిలబడటానికి ఎంత మంచి పునాది (సాధన) వేసినావు అనేదే ముఖ్యము.  

                          

31.08.2010

285.  సామూహిక పూజలుచేసే కన్నా ఏకాంత పూజలు చేయటం నాకిష్టమునీవు ఏకాంతముగా పూజలు చేసేకన్నా మానసికంగా పూజలు చేయటం నాకు చాలా ఇష్టము

10.09.2010

86.  నీవు ఒక మంచి పని చేస్తున్న సమయంలో ఎవరయినా నీ ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసిన అతనితో దెబ్బలాడేకన్నా, నీవు చేస్తున్న మంచి పనిని ఆపేసి వెళ్ళిపోయినా పాపము లేదు.

15.09.2010

87.  ప్రాపంచిక రంగంలో నీ తోటివాడికి సహాయం చేయడం నీధర్మముఅదే ఆధ్యాత్మిక రంగంలో నీ సహాయము ఎదుటివారు కోరినప్పుడు వినయంతో సహాయం చేయలేనని చెప్పుఆధ్యాత్మిక రంగంలో ఎవరి కృషి వారే చేసుకోవాలని గ్రహించాలి

12.10.2010.

88.  నీవు ఎదుటివాని యొక్క తప్పులను, నేరాలను భగవంతుని ముందు ఏకరువు పెడుతున్నావే, నీలాగే ఇంకొకడు నీవు వానికి చేసిన అన్యాయాలను తప్పులను భగవంతునికి నివేదించుకుంటున్న విషయాన్ని మర్చిపోవద్దు.


16.10.2010

89.  ప్రాపంచిక రంగంలో ఇరువురి మధ్య అయస్కాంత తరంగాలు వేరువేరుగా ఉన్నా వారు కలుసుకుంటారుఅదే ఆధ్యాత్మిక రంగంలో ఇరువురి మధ్య అయస్కాంత తరంగాలు ఒకటవుతేనే కలుసుకుంటారు.  

                                    Image result for images of white  calf behind white cow

08.11.2010

90.  దూడవెనుక ఆవు ఉన్నట్లే, భక్తుడి వెనుక భగవంతుడు ఉంటాడు

(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List