Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, April 5, 2016

శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మికమ్ – 13వ.భాగమ్

Posted by tyagaraju on 8:44 AM
        Image result for images of saibanisa
              Image result for images of flower garden

05.04.2016 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి అందువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబానిసగారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని.
      Image result for images of saibanisa

శ్రీ సాయి పుష్పగిరి  -  ఆధ్యాత్మికమ్ – 13వ.భాగమ్

        14.07.2012           


         Image result for images of giving milk to small monkey


   Image result for images of monkey and small child

121.  కోతి పిల్లకు పాలు పట్టానుతల్లి కోతి తన పిల్లకు ఏమి ప్రమాదం జరుగుతుందోనని చూడసాగిందినేను అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాను  కోతి పిల్ల తన తల్లి  పొట్టను గట్టిగా పట్టుకొందితల్లి,పిల్ల చెట్టు మీదకు వెళ్ళిపోయాయిఇది మర్కటకిశోర  న్యాయమని నేను భావించానుమనం కూడా మన గురువు పాదాలను విడవరాదుమన గురువు మన బాధ్యతలను స్వీకరించి మనలను మన గమ్యానికి చేరుస్తారు.  
                          Image result for images of touching shirdi saibaba feet



18.07.2012

122.  బీదవారయినా, గొప్పవారయినా వారి వారి మత సాంప్రదాయాలను వారు సక్రమముగా నిర్వహించి భగవంతుని చేరుకోవాలి. మత మార్పిడులకు అన్య మతాల జోలికి వెళ్ళటానికి నేను అనుమతించను.

19.07.2012

123.  సంసార జీవితంలో భార్యాభర్తలు కలిసి ఉండాలితమ బాధ్యతలను నిర్వహించాలిజీవిత ఆఖరి దశలో భార్యపై వ్యామోహం పెంచుకోరాదుశరీరముపై  వ్యామోహము, భార్యాపిల్లలపై వ్యామోహము నీవు నీ గమ్య స్థానానికి చేరటానికి ఆటంకాలు కలిగిస్తాయి.   

23.07.2012

124.  మానవుడు చంద్రమండలానికి వెళ్ళగలిగాడే కాని, విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవంతుడిని మాత్రం చూడలేకపోయాడు.

                     Image result for images of touching shirdi saibaba feet





24.07.2012
Image result for images of date seed tree

125.  ముళ్ళ జాతికి చెందిన ఖర్జూరపు చెట్లు, రేగు చెట్లను మనము కౌగలించుకోరాదుఆ చెట్ల కింద పడ్డ తీయటి పండ్లను తీసుకొని ఆస్వాదించాలిఅలాగే నీ శత్రువులను నీవు కౌగలించుకోరాదువానిలో ఏదయినా మంచి గుణాలుంటే వాటిని అలవరచుకోవాలి.
Image result for images of date seed tree



29.07.2012

                         Image result for images of pregnant woman thinking

126.  పుట్టబోయే బిడ్డకోసం తల్లి ఎలాగయితే ఆలోచిస్తుందో అదే విధంగా నేను నా భక్తుల మరు జన్మల గురించి ఆలోచిస్తాను
                       Image result for images of touching shirdi saibaba feet


03.08.2012

127.  ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పుస్తకాల ద్వారా పొందలేముదానిని సాధన, స్వయం కృషి ద్వారానే పొందాలి.  

128.  శరీరముపై వ్యామోహము ఉండరాదు అని భావించినపుడు మురికినీటిలో స్నానము చేయవలసినా చేయాలిచిన్నపిల్లలు (అవధూతలు) మలమూత్రాలతో ఆడుకున్న విధంగా ఆడుకోవాలి. (అవధూతల లక్షణములు
                                    Image result for images of avadhuta



04.08.2012

129.  నేను చేయని తప్పులకు, ఇంటిలో తల్లి, అక్క, తమ్ముడు, చెల్లిలితో గొడవలుపడి బయటకు వచ్చానుఇది  నా ఆధ్యాత్మికప్రయాణానికి మొదటి మైలురాయిగా ఉపయోగపడింది.
                                                                                                                                                                          ---  సాయిబానిస

04.08.2012

130.  రాత్రికి రాత్రి కట్టుబట్టలతో రైలు స్టేషన్ కి వెళ్ళానుఅక్కడ రైలు లేదు కాని ఆస్టేషను నుంచి యింకొక కొండమీదకి యినప తాడుతో కట్టబడి చక్రాలమీద ప్రయాణం చేసే ఒక తొట్టి ఉందినేను ఒక్కడినే తొట్టెలో కూర్చున్నానువెంటనే ఆయంత్రం తిరగడం ప్రారంభమయిందినేను దూరపు కొండకు చేరుకొన్నాను కొండ మీదకు దిగి నన్ను నేను చూసుకున్నానునా వంటిమీద బట్టలు లేవుచీకటి తొలగిపోయి సూర్యోదయమవుతున్నదితిరిగి నా నూతన జీవితం ప్రారంభించాను.   
                                                                                                                                                                                     సాయిబానిస

(మరికొన్ని ఆధ్యాత్మిక సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List