23.04.2016 శనివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
సాయి
బానిసగారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక జీవితం మీద మరికొన్ని సందేశాలు.
శ్రీసాయి
పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం -5 వ.భాగమ్
41. ఏదయినా
మంచిపని పూర్తి చేయవలసివచ్చినపుడు మధ్యవర్తుల జోక్యమునకు దూరంగ ఉండటము మంచిది. మనమే
ముఖాముఖీ మనకు కావలసినవారితో మాట్లాడుకుని
ఆ పనిని పూర్తి చేసుకోవడం మంచిది
42. కాల చక్రంలో నలిగిపోయి
కాలగర్భంలో ఎందరో కలిసిపోయారు.
నీవు వారందరి గురించి ఆలోచిస్తున్నావా? ఒకనాడు
నేటి వర్తమానంలోని నీవు, నీ వాళ్ళు కూడా
ఇదే విధంగా కనుమరుగవుతారు. అందుచేత
వర్తమానాన్నే నమ్ముకుని ప్రశాంతంగా జీవించు.
30.01.2005
43. చెడ్డతనాన్ని
గుర్తించడానికి చెడు సహవాసాలు చేయనవసరం
లేదు. ఆ
చెడు లక్షణాలు ఉన్నచోట దూరంగా ఉంటూ చెడు ప్రవర్తన
కలిగినవారి నుండి జాగ్రత్తపడవచ్చు.
చెడును దూరం నుంచే గుర్తించి, మంచిని దగ్గరనుంచే అనుభవించాలి.
44. ముళ్ళబాటలో
(నల్లేరుమీద) బండి మీద ప్రయాణం
చేస్తే నీకు కష్టాలు తెలియవు. అదే
నీ కాలికి చెప్పులు లేకుండా ముళ్ళ బాటలో ప్రయాణం
చేసి చూడు. కష్టాలంటే
ఏమిటో తెలుస్తాయి. అందుచేత
జీవిత ప్రయాణంలో బండిలో ప్రయాణం చేసేకన్నా నీ కాలికి స్వయము
రక్షణ అనె చెప్పులు ధరించి
ప్రయాణం చేయటం మంచిది.
17.03.2005
45. సమస్యలు,
వాటికి పరిష్కారాలు వెతకటంలో కాలము వ్యర్ధము చేసుకోవద్దు. కొన్నిసార్లు
మనము ఆ సమస్య గురించి
ఆలోచించకుండా ఆ సమస్య కలిగించినవారి
నుండి దూరంగా ఉన్నా ఆ సమస్య
పరిష్కరింపబడుతుంది.
18.303.2005
46. నీ
వృత్తి ధర్మాన్ని
పాటించే సమయంలో నిన్ను కొందరు పొగడవచ్చు. వాటికి
చిరునవ్వుతోనే సమాధానం చెప్పాలి. అలాగే
కొందరు ఈర్ష్యా ద్వేషాలతో నిన్ను తిట్టవచ్చును. వారికి
కూడా నువ్వు చిరునవ్వుతోనే సమాధానం చెప్పాలి
02.07.2005
47. ఆకలి
వేసినపుడు భగవంతుని పేర ఇచ్చే ప్రసాదం
కడుపునిండా తింటాము. అదే
మామూలు పరిస్థితిలో ఆ ప్రసాదం ఏ
మతం వారిచ్చారని అని
ఆరా తీస్తాము. ఆకలికి
కులమతాలు లేనపుడు కులమతాల పేరిట గొడవలు పడటంలో
అర్ధమేమిటి?
26.07.2005
48. జీవిత
ప్రయాణంలో మనకు తలనొప్పి కలిగించేవారు,
మన మనస్సుకు బాధ కలిగించేవారు ఎదురు
పడినప్పుడు వారిని పలకరించవలసిన అవసరం లేదు. నీవు వారిని చూడనట్లుగా
నీ మానాన నీవు ముందుకు
సాగిపోవాలి.
49. ఆడపిల్లకు
పెళ్ళిచేసి అత్తవారింటికి పంపాలి. అత్తవారింట
ఆ పిల్ల వారి కుటుంబ
అలవాట్లకు తగ్గట్లుగా మసలుకోవాలి. అత్తమామల
ముందు, భర్త ముందు సాంప్రదాయంగా
ఉండాలి, అని కాబోయే పెళ్ళికూతుళ్ళకు
చెప్పాను.
25.08.2005
50. ఉద్యోగాన్వేషణలో
నీవు యితరుల సహాయం కోరడంలో తప్పులేదు. అంతేకాని
నిరుద్యోగిగా ఇంకొకరి ఇంట వుంటూ ఉద్యోగాన్వేషణ
చేయవద్దు. అది
నరక ప్రాయమవుతుందని గ్రహించు.
**49. జీవితప్రయాణంలో ఎపుడయినా ఎక్కడయినా అనాధపిల్లవాడు ఎదురుపడితే ఆ పిల్లవాడు భగవంతుని పిల్లవాడిగా భావించి ఒక్క క్షణము ఆ పిల్లవానిని దగ్గరకు చేరదీసి సహాయం చేయి. భగవంతుడు తృప్తిచెంది నీకు నీ జీవిత ప్రయాణంలో తోడుగా నిలచి సహాయం చేస్తాడు.
** ఇప్పుడు దీనిని రాత్రి 10.30 తరువాత ప్రచురిస్తున్నాను.49 వ.నంబరు ఒక్కసారి చదవండి. ఇది ఈ రోజు ప్రచురించేముందు అంటే రాత్రి 9.30 కు అనాధ పిల్లలను చేరదీసి వారి అవసరాల నిమిత్తమై చందా వసూలు చేస్తున్నామంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఎక్కువగా ఆడపిల్లలు ఉన్నారట. మీరు ఒక అమ్మాయిని స్పోన్సర్ చేయండి అని వచ్చారు. వారు చెప్పిన వివరాలన్నిటిని విచారించాను. వారికి నేరుగా సొమ్ము కూడా ఇవ్వనక్కరలేదని ఆన్ లైన్ లోనే పంపించవచ్చని చెప్పారు. వారు చెప్పినదంతా వారు ఇచ్చిన వెబ్ సైట్ లో చూసి నిర్ధారించుకున్నాను. ఒక అనాధ కు ఒక సంవత్సరానికి నా శక్తి కొలది సొమ్ము ఇచ్చాను. (ఎంత ఇచ్చానన్నది అప్రస్తుతం కనుక చెప్పటంలేదు) ఇది ఎందుకని చెప్పానంటే బాబా ఇచ్చిన సందేశం ఈరోజు ప్రచురించటానికి ఈ సంఘటన జరిగినదానికి బాబా వారు చూపిన చమత్కారంగా భావించాను) అపాత్ర దానం చేయకూడదు కాబట్టి అన్ని వివరాలను నిర్ధారించుకున్నాను. ఈ సందేశాన్ని ప్రచురించి, నేనే ఆచరించకపోతే ఎలా? సాయి సందేశాలను ప్రచురించేవన్ని నిరర్ధకమే కదా?
50. జీవన
సమరంలో ఉద్యోగ పర్వము ఒకటి. ఆ
పర్వంలో నీ పైఅధికారితో నీకు శతృత్వం ఉన్నా
ఆ శతృత్వాన్ని అణచిపెట్టి యుక్తితో యుధ్ధం చేయాలి. నీ
పైఅధికారి బలహీనతలను
గ్రహించి అర్ధం చేసుకుని వాటికి
నీవు దూరంగా ఉంటూ ఆ పైఅధికారి
పతనం చెందినపుడు తగిన శాస్తి జరిగిందని
భావించి నీవు ప్రశాంతముగా జీవించాలి. ఎట్టి
పరిస్థితిలోను ఓరిమిని వీడరాదు.
(మరికొన్ని
సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment