Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, April 29, 2016

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 7వ.భాగమ్

Posted by tyagaraju on 7:26 AM
Image result for images of saibanisa
         Image result for images of flower garden

29.04.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
         Image result for images of saibanisa

శ్రీ సాయి పుష్పగిరిఆధ్యాత్మిక జీవితం – 7.భాగమ్
రోజు ఆధ్యాత్మిక జీవితం మీద బాబా గారు సాయిబానిస గారికి ప్రసాదించిన మరికొన్ని సందేశాలు.


07.05.2006

61.  లంచాలు తీసుకుని భోగాలు అనుభవిస్తున్నపుడు బంధువులు చీమలలా మన చుట్టూ తిరుగుతారుమన సంపాదన వారికి బెల్లం దిమ్మలాగ కనిపిస్తుందిఅవినీతి నిరోధకశాఖ వారు ఆ బెల్లం దిమ్మ తీసుకునిపోయినపుడు ఆ చీమలన్నీ వాటంతటవే వెళ్ళిపోతాయిఅపుడు నీకు మిగిలేది ఏమీ లేదు.     


13.06.2006

62.  జీవితంలో ఏదయినా సాధించాలంటే పంతం ఒక్కటే చాలదుపట్టుదల, ఓరిమికూడా ఉండాలి అన్నారు బాబా .
                                                                                                                                                                     --- సాయిబానిస                 

                            Image result for images of old man relaxing

11.07.2006

63. జీవిత రైలు ప్రయాణంలో అనగా వృధ్ధాప్యంలో తక్కువ సామాన్లతో ప్రయాణం కొనసాగించాలినీ గమ్యాన్ని చేరే వరకు అనవసరపు స్టేషన్లలో దిగరాదుప్రమాదాలు కొని తెచ్చుకోరాదుప్రశాంత ప్రయాణం నీ గమ్యం చేరడానికి చాలా ముఖ్యము.  (స్టేషనులు అనగా అనవసర విషయాలు)


                     Image result for images of friends

19.08.2006

64.  నీ గత జీవితంలో నీతో స్నేహాలు చేసిన వారిని కలలో నీతో గడిపినట్లుగా భావించి వారిని మరచిపోగత స్నేహాలను కలగానే చూడుకలలో నీవు అనుభవించిన కష్టాలు సుఖాలు నీ నిజ జీవితంలో మంచి చెడులను గుర్తించడానికి ఉపయోగించుకో



19.08.2006
Image result for images of old education


65.  ఆనాటి నీ చదువులు, నీ విద్యా ప్రమాణాలు ఈనాటి వర్తమానానికి పనికిరావుగతం ఎంత గొప్పదయినా   అది     వర్తమానానికి పనికి రాదు.  
               Image result for images of old education

వర్తమాన పరిస్థితులను అవగాహన చేసుకుని నిజం తెలుసుకుని మసలుకోవటం నేర్చుకో


27.08.2006

66.  కష్టాలనే వరదలు రావడం సహజంఅపుడు నీవు అందరికీ ఉచిత సలహాలిచ్చిన వారు నీకు శత్రువులుగా మారుతారుఅందుచేత మనిషి ఎన్ని కష్టాలలో ఉన్నా అడగనిదే అతనికి సలహాలివ్వరాదుఉచిత సలహాలిచ్చి నీవు కష్టాలు కొనితెచ్చుకోరాదు.
                        Image result for images of man giving advices



30.08.2006

67.  ఏ పనయినా నమ్మకంతో చేయాలిఅంతేకాని, ఎవరో ఏదో మొహమాటానికి అనుకుంటారేమోనని చేయరాదునమ్మకం లేనపుడు ఎవరి సలహాను తీసుకుందుకు వెళ్ళరాదునమ్మకం లేనపుడు ఏపనీ చేయరాదు

                                Image result for images of saibanisa

13.09.2006

68.  మన గురువు మనకు తల్లి లాంటివారువారు మనకు జీవితంలో చేసిన సహాయము మరచి పోరాదుబాబా ఏనాడూ తాను భగవంతుడినని చెప్పుకోలేదుతాను భగవంతుని విధేయ సేవకుడిననే చెప్పారుతాను తన భక్తులకు కూడా సేవకుడిననే అన్నారుతాను సలహాను మాత్రమే ఇవ్వగలనన్నారుతాను శరీరంతో ఉన్న రోజులలో తన భక్తుల కర్మలను తాననుభవించి వారి కష్టాలను తొలగించారుఈనాడు మన గురువు శరీరంతో లేకపోయినా అనేక మందికి కలల ద్వారా సందేశాలు ఇస్తూ వారి జీవితాలలో సుఖశాంతులు ప్రసాదిస్తున్నారు

                                                             సాయిబానిస



29.09.2006

69.   జీవితంలో లేనిదాని కోసం బాధలు పడుతూ జీవించేకన్నా నీకు ఉన్నదానితో జీవించడం మంచిదిలేనిదాని కోసం వెతుకుతూ తిరుగుతూ జీవించడం తెలివిహీనుల పని.   భగవంతుడిచ్చిన దానితో సుఖంగా జీవించడం విజ్ఞత కలవారి పని.


10.10.2006

70.  చిన్న తనంలో పోలియో వ్యాధితో బాధపడుతు నడవలేని స్థితిలో ఉన్న కుమారుడిని తండ్రి తన భుజాలపై కూర్చోపెట్టుకుని బయట తిప్పుతాడుకాని, అదే పిల్లవాడు పెద్దవాడయిన తరువాత నడవలేని స్థితిలో   తండ్రి ఎత్తుకుని బయటకు తిప్పలేడు కదా ఆలోచన నాలో ఎవరి ఖర్మ  వారనుభవించాలి అనే భావన కలిగించింది

(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)


(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List