21.04.2016 గురువారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి అమృత ధార
బాబా
చేసిన ధన సహాయం
ఈ
రోజు మనం మరొక అత్యధ్బుతమైన అమృత ధార గురించి తెలుసుకుందాము .
బాబా
గారు ద్వారకామాయిలో దక్షిణగా స్వీకరించిన సొమ్మునంతా మరలా భక్తులందరికీ ఉదారంగా పంచి
పెట్టేస్తూ ఉండేవారన్న విషయం మనకందరకూ తెలుసు.
బాబా వారికి సత్సంగాలంటే ప్రీతి. ఎక్కడ
సత్సంగాలు జరుగుతున్నా బాబా అక్కడ స్వయంగా ఉంటారనీ, కొంత మంది భక్తులపై తన అనుగ్రహాన్ని
ప్రసరిస్తూ ఉంటారన్న విషయం కూడా సత్సంగాలను నిర్వహిస్తున్న వారందరికి అనుభవమే.
ఒక్కొక్క సారి సత్సంగాలు జరుగుతున్నపుడు, ఆఖరులో
బాబా వారికి ఆరతి ఇస్తుండగా భక్తులలో కొందమందికి తమకు తెలియకుండానే కళ్ళంబట నీరు వస్తూ
ఉంటుంది. నేను నరసాపురంలో ఉండగా సత్సంగంలో
పాల్గొన్నపుడు నాకు కూడా అది అనుభవమే. మరికొంత
మందికి కూడా అటువంటి అనుభవమే కలిగింది. ఇప్పుడు
మనం సత్సంగం చేసుకోవడానికి బాబా ధన సహాయం ఏవిధంగా చేశారో తెలుసుకుందాము. నరసాపురంలో సత్సంగం ప్రారంభిద్దామనుకున్న తన భక్తులకి
బాబా మొట్టమొదటి సారిగా ధనాన్ని ఎలా సమకూర్చారో అది కూడా ప్రచురిస్తున్నాను. ఈ లీలను 2011 సం.నవంబరు 11 వ. తేదీన ప్రచురించాను.
సందర్భం
వచ్చింది కాబట్టి మరలా చివరలో ప్రచురిస్తున్నాను చదవండి.
ఇప్పుడు
మీరు చదవబోయే లీల శ్రీసాయి లీలా మాసపత్రిక జనవరి, 1984 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
మొట్టమొదటి
సారిగా నేను పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజగారిని 1980 వ.సంవత్సరం జూలై నెలలో కలుసుకునే
భాగ్యం కలిగింది. అప్పుడాయన చివటం (పశ్చిమ గోదావరి జిల్లా ) గ్రామంలో సాయి తత్వ ప్రచారానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. ఆ రోజు చివటం అమ్మ మహాసమాధి చెందిన ‘మండలారాధన’
రోజే కాక గురుపూర్ణిమ రోజు కూడా అవడం వల్ల ఎతో మంది మహాత్ములు వచ్చారు.
(చివటం అమ్మ. ఈమె గొప్ప అవధూత. ఈవిడ దిగంబరంగానే తిరిగేవారు. చివటం గ్రామంలో ఆవిడ సమాధి కూడా ఉంది.)
అక్కడ వారందరి సమక్షంలో ఉండగా నాకు కొవ్వూరులో సాయిసత్సంగం ప్రారంభిద్దామని ప్రేరణ కలిగింది. ఆ ప్రేరణతోనే చుట్టుప్రక్కల ఉన్న 5 సం. నుండి 15 సం.వయసుగల పిల్లలనందరినీ కలుపుకుని సత్సంగాన్ని ప్రారంభించాము. ఆ సత్సంగం నేటికీ కొనసాగుతూ వస్తోంది. ఆ సత్సంగ మహత్యం వల్ల రోజు రోజుకీ సాయి భక్తులలో బాబాపై భక్తి ప్రేమలు పెరుగుతూ వస్తున్నాయి. సమాజంలో కూడా మా సత్సంగాన్ని మెచ్చుకునేవారు. మా అనుభవాన్ని బట్టి, ప్రతి రోజూ సత్సంగ కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయంటే అది బాబా యొక్క మహత్యం వల్లనే. ఆయన అనుగ్రహమే లేకపోతె సత్సంగ కార్యక్రమాలు సజావుగా జరగవు. మా సాయికుటీర్ లో మేము సత్సంగాన్ని నిర్వహిస్తూ ఉంటాము. మా సాయికుటీర్ లో జరిగిన ఒక అద్భుతాన్ని మీకు వివరిస్తాను.
1983
వ.సంవత్సరం జూలై నెలలో మా సాయికుటీర్ లో మా సత్సంగ సభ్యులమందరం గురుపూర్ణిమ జరుపుకోవడానికి
నిర్ణయించుకున్నాము. మా సత్సంగ ముఖ్య కార్య
నిర్వాహకురాలు మా వదినగారయిన శ్రీమతి లక్ష్మీ రామమూర్తి. మా సత్సంగంలో మేమందరం పిల్లలమే. గురుపూర్ణిమ ఉత్సవం నిర్వహించుకోవాలంటే మా సత్సంగంలో
పెద్దవాళ్ళెవరూ లేకపోవడం చేత కావలసిన డబ్బు సమకూరడం కూడా కష్టమే. ఈ ఉత్సవాన్ని ఎలా నిర్వహించాలా అని మా వదినగారు
మధన పడుతూ ఉన్నారు. గురుపూర్ణిమ నిర్వహించాలంటే
దాని కోసం ఎన్నో సమకూర్చుకోవాలి. దానికి ధన
సహాయం చేసేవాళ్ళెవరూ మా సత్సంగంలో లేరు. మా
వదిన గారు ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉన్నంతలోనే గురుపూర్ణిమని సామాన్యంగానే జరుపుకుందామని
చెప్పారు. కాని, మన బాబా గారు తన భక్తులను
నిరాశ పడనివ్వరు కదా. ఆయన ఎంతో దయకలవారు, ఉదార
స్వభావులు.
1983వ.సంవత్సరం
జూలై నెల 6 వ.తారీకున పోస్టుమాన్ వచ్చి శ్రీమతి లక్ష్మి గారికి రిజిస్టర్ ఉత్తరం వచ్చిందని
ఇచ్చాడు. ఆ ఉత్తరం హైదరాబాదులో ఉన్న మా అన్నగారి కొడుకు సత్యప్రసాద్ పంపించాడు. మా వదిన గారు కవరు తీసుకుని చింపగానే అందులోనుండి
పది రూపాయల కాగితాలు 19 (మొత్తం విలువ రూ.190/-) కింద పడ్డాయి. చాలా ఆశ్చర్యంతో ఆమె ఉత్తరం మడత విప్పగానే అందులో
రూ.75/- విడిగా ఉన్నాయి. ఆ ఉత్తరంలో సత్యప్రసాద్ తాను ప్రతి నెల రూ.25/-
షిరిడీకి పంపిస్తూ ఉంటానని రాశాడు. కాని కొన్ని
అనుకోని కారణాల వల్ల మూడు నెలలనుండి షిరిడీకి డబ్బు పంపడం కుదరలేదనీ, ఆ సొమ్ము మొత్తం
రూ.75/- పంపుతున్నానని రాశాడు. ఈ పంపించే సొమ్ముతో
మీరు మీ సాయికుటీర్ లో గురుపూర్ణిమ ఉత్సవం జరుపుకోండి అని కూడా రాశాడు. కాని, కవరులో ఉన్న రూ.190/- గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. బహుశ కవరులో పొరబాటున రూ.190/- పెట్టారేమో అని మా
వదిన గారు అనుకున్నారు. వెంటనే మా వదినగారు,
కవరులో రూ.190/- కూడా పెట్టి పంపించారు, దాని సంగతేమిటని ప్రశ్నిస్తూ అతనికి ఉత్తరం
రాశారు. వెంటనే తిరుగు టపాలో తాను రూ.75/-
మాత్రమే పంపించాననీ రూ.190/- సంగతి తనకు ఏమాత్రం తెలీదని రాశాడు. అది ‘సాయిలీల’ తప్ప మరేదీ కాదని అర్ధమయింది. ఆ విధంగా బాబాగారే స్వయంగా చేసిన ధన సహాయంతో, గురుపూర్ణిమ
రోజున మేము భారీ ఎత్తున బాబావారికి సహస్రనామ పూజ, అన్నదానం మొదలైన కార్యక్రామాలన్నీ
నిర్వహించగలిగాము.
పి.ఎస్.ఆర్.
విజయభాస్కర్
కొవ్వూరు
(ప.గో.జిల్లా)
11.01.2011
వ.సంవత్సరంలో ప్రచురింపబడిన సత్సంగ ప్రారంభ లీల మరొక్క సారి ప్రచురిస్తున్నాను.
మన
మనసులో మంచి సంకల్పం ఉండాలే
గాని బాబాగారి ద్వారా అవి నెరవరతాయనడంలో యెటువంటి
సందేహము అక్కరలేదు. మన మనస్సు మంచిది
అవ్వాలి, మన ప్రవర్తన మంచిగా
ఉండాలి, మన మాట తీరు మృదువుగా ఉండాలి , మొహములో ప్రసన్నతా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రతీ సాయి
భక్తుడూ తప్పక ఆచరించతగ్గవి.
ఈ
రోజు నేను ద్వారకామాయి సాయి
బంధు సేవా సత్సంగ్ స్థాపించిన
శ్రీమతి పి.వి. మీనాక్షి
గారి బాబా లీలలను గూర్చి
చెప్పుకుందాము.
లీలా
నం. 1
ఈ
లీలను చెప్పేముందు మొదటగా సాయినాధుని ప్రార్థిస్తున్నాను.
మేము ఈ సత్సంగాన్ని 2007 లో
బాబాగారి దయతో ప్రారంభించాము. మేము
ఆయన చూపే ఎన్నో లీలలను
చూస్తున్నాము. అందులో మొదటగ ఈ సత్సంగం
ప్రారంభమయిన లీలను ఆమె మాటలలలోనే
తెలుసుకుందాము.
******************************************************
ఒకరోజున
నేను, నా స్నేహితురాలు (ఈమె
సత్సంగానికి 108 పాటలను వ్రాసారు) సత్సంగం కొత్తగా ప్రారంభించడం గురించి మట్లాడుకుంటున్నాము. ఆ సమయంలో సత్సంగానికి
ప్రారంభపు సొమ్ము ఏదీ లేదు. ఈ
సత్సంగం తరఫున ఎన్నో సేవా
కర్యక్రమాలను చేద్దామనుకొన్నాము. కాని మొదటగా ప్రారంభపు
సొమ్ము ఏది లేదు. కాని
ఏ భక్తుని వద్దనించి సొమ్ము అడగకుండా ప్రారంభిద్దామని అనుకున్నాము. ఇలా మాట్లాడుకుంటూ మేము
నడుస్తూ ఉన్నాము. దారిలో ఒక రంగుల షాప్
వద్దకు పని ఉండి వెళ్ళాము. అక్కడ కుర్చీలో ఒక
500 రూపాయల నోటు ఒకటి పడి
ఉంది. నేను ఆ నోటు
తీసుకుని పక్కన కుర్చీలో కూర్చున్న
అతనిని "ఈ నోటు ఎవరిది"
అని అడిగాను. ఆ వ్యక్తి ఆ
నోటు తనది కాదు అని చెప్పాడు.
మరలా నేను ఆ షాపు
యజమానిని అడిగాను. అతను కూడా తనది కాదు అని
చెప్పాడు. మేము ఆ షాపు
యజమానితో మరలా రేపు వస్తాము,
ఎవరయినా 500 రూపాయలు పోగుట్టుకున్నామని అడిగితే మాకు చెప్పండి అని
మా వివరాలూ, చిరునామా అన్నీ ఇచ్చి ఆ
నోటు తీసుకుని వచ్చేశాము. మరునాడు మేము ఆ షాపుకి
వెళ్ళి ఎవరయినా నోటు పారేసుకున్నామని వచ్చారా
అని అడిగాము. ఆ షాపు యజమాని
ఎవరూ నోటు పారేసుకున్నామని రాలేదు
అని చెప్పాడు. అప్పుడు మాకు అనుమానం వచ్చింది.
అసలు ఇది మంచి నోటేనా లేక
దొంగ నోటా అని. అందుచేత
మేము ఆ సాయంత్రం బ్యాంక్
కి వెళ్ళి ఆ నోటు మంచిదా
లేక దొంగనోటా అని అడిగాము. వారు
ఆ నోటు మంచిదే అని
చెప్పారు. అందుచేత ఆ సొమ్ము బాబాగారే
మా సత్సంగం ప్రారంభించడానికి తన మొదటి చందాగా
ఇచ్చినట్లు భావించాము. మరునాడు నేను, నా స్నేహితురాలు
చివర సున్నా లేకుండా 500 కి కొంత సొమ్ము
వేద్దామనుకున్నాము. అంటే 500/- కాకుండా 501/- ఇలా మాట్లాడుకుంటూ వెడుతుండగా
మాకు రోడ్డు మీద 5 రూపాయల నాణెం
కనపడింది. ఈవిధంగా బాబాగారు మా సత్సంగానికి తమ
మొదటి చందాగా 505/- రూపాయలు ఇచ్చారనటానికి నిదర్శనం. నాకు నా పేరు గాని
విద్యార్హతలు గాని చెప్పుకోవడానికి ఇష్ట
పడను. దాని వల్ల అహం
పెరుగుతుంది. బాబాగారి భక్తురాలిగా ఉండడమే నాకు ఇష్టం. బాబాగారిని
నన్ను ఎల్లప్పుడు రక్షించమని వేడుకుంటు ఉంటాను. నేను సాయి సత్సంగంలో
సభ్యురాలిగా ఉండి సేవ చేయడమే.
లీల
నం.2
మా
శ్రీ ద్వారకామాయి సాయి బంధు సేవా
సత్సంగ్ ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా
2008 అక్టోబర్ విజయదశమినాడు అన్నదానం చేయడానికి నిర్ణయించుకున్నాము. ఆ రోజు 108 మంది బీదవారికి అన్నదానం
జరుపుదామని నిశ్చయించాము. మేము వంటలు చేయడానికి
వంటవారినెవరినీ పిలవకుండా మొత్తం పదార్థాలన్నీ మేమే స్వయంగా తయారు
చేద్దామనుకున్నాము.
మా
చిన్న చెల్లెలు (ఆమె కూడా సత్సంగంలో
సభ్యురాలు) ఇంకొక ఇద్దరము ప్రధానమయిన
వంటవారు. నేను, మిగతా భక్తులం
సహాయం చేస్తున్నాము. వంట ప్రారంభించే ముందు నేను
బాబాగారికి కొబ్బరికాయ కొడదామనుకున్నాను. ఈ ఏర్పాటులన్నీ కూడా
బాబాగారి గుడి ప్రక్కనే జరుగుతున్నాయి.
మా చెల్లెలు తనకు 108 మందికి వంట చేయడంలో అనుభవం
లేదని చెప్పింది. వంటలన్నీ ఎలా ఉంటాయోనని మేము భయపడ్డాము, ఎందుకంటె
బాబాగారికి నైవేద్యం పెట్టకుండా రుచి చూడలేము కదా.
నేను కూడా చాలా భయపడ్డాను,
ఎందుకంటే వంటలు ప్రారంభించే ముందు బాబాగారికి
కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయాను. అప్పుడు నేను కొబ్బరికాయ తీసుకుని
బాబా గారి వద్దకు వెళ్ళి
ఇలా ప్రార్ధించాను," బాబా ఇదంతా కూడా
నువ్వు తయారుచేసినదే, ప్రధాన సూత్రధారివి నువ్వే, మేము నిన్ను అనుసరించేవారిమి
మాత్రమే బాబా."
మొదటగ
ఈ సత్సంగం ఎక్కడయితే ప్రారంభమయిందో ఆ గుడిలో అన్నదానం
జరుగుతోంది. అన్నదానం జరిపేముందు మేము బాబాకి నైవేద్యం
పెట్టాము. నైవేద్యం కాగానే మొదటి బాచ్ కి
వడ్డించడం మొదలు పెట్టాము. ఆ
మొదటి బాచ్ లో భోజనము
చేస్తున్న ఒక వ్యక్తి పదార్థాలు చాల రుచిగా ఉన్నాయి
అని చెప్పాడు. ఈ పదార్థాలన్నీ ఏదయినా
పెద్ద హోటల్నుంచి తెచ్చారా అని అడిగాడు. (ఈ
మాటలు అన్నవ్యక్తి గేటు పక్కనే బాబా
విగ్రహం యెదురుగా కూర్చునివున్నాడు.)
మేమంతా
చాలా సంతోషించి "శ్రీ సచ్చిదానంద సద్గురు
సాయినాథ మహరాజ్ కీ జై " అన్నాము.
సర్వం
శ్రీసాయినాథార్పణమస్తు
(మరికొన్ని
అమృత ధారలు ముందు ముందు)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment