27.04.2016
బుధవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
షిరిడీ సాయి వైభవమ్
దుష్ట శక్తులు - బాబా వారి వివరణ
ఈ
రోజు శ్రీ షిరిడీసాయి వైభవంలో మరొక వైభవం తెలుసుకుందాము. దెయ్యాలు, భూతాలు ఉన్నాయా అంటే కొంతమంది ఉన్నాయంటారు,
కొంత మంది అదంతా మన భ్రమ అని కొట్టి పారేస్తారు.
సైన్స్ ఇటువంటి వాటిని అసలే నమ్మదు.
ఈ విషయంలో బాబా ఏమి చెప్పారో ఈ నాటి వైభవంలో తెలుసుకుందాము.
బాబా,
లక్ష్మీబాయి, జనాబాయి, ద్వారకామాయిలో తిరగలిలో గోధుమలు విసురుతూ ఉన్నారు. ఆ సమయంలో బొంబాయినుండి ఒక స్త్రీ వచ్చింది. ఆమె కూడా ద్వారకామాయిలో వారి ప్రక్కన కూర్చుని
“బాబా, నేను కూడా గోధుమలను విసరనా?” అని అడిగింది. “నువ్వు అలసిపోతావు, వద్దు” అన్నారు బాబా.
“అయినా సరే, నేను ఎంత వరకు చేయగలనో అంత వరకు విసురుతాను”
అంది. బాబా, లక్ష్మీబాయిని ప్రక్కకు తప్పుకోమని
చెప్పి, బొంబాయినుంచి వచ్చిన ఆ స్త్రీని విసరమని చెప్పారు. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వాటినన్నిటికి బాబా నుంచి సమాధానాలు తెలుసుకోవాలని
ఎంతో ఆతృతగా ఉంది. ఆమె బాబా తో “ఈ గోధుమలను
ఎందుకని విసురుతున్నారు? ఆ తర్వాత ఈ గోధుమపిండిని
గ్రామ సరిహద్దులలో ఎందుకని చల్లుతున్నారు” అని అడిగింది. అప్పుడు బాబా” అక్కాబాయి, మరియమ్మలు (కలరా, మశూచి
అమ్మవార్లు) గ్రామంలోకి ప్రవేశించాలని చూస్తున్నారు. అందుకనే గ్రామ సరిహద్దులకి అవతల, వారికి నేను ఈ
గోధుమపిండిని ఆహారంగా సమర్పించి వారు షిరిడీ గ్రామంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తున్నాను. దానితో
వారు శాంతించి షిరిడీలోకి అడుగు పెట్టకుండా నిష్క్రమిస్తారు. ఆ విధంగా నేను నా భక్తులను రక్షిస్తాను” అని సమాధానమిచ్చారు.
ఆ
తరువాత ఆమె ‘జారి’, ‘మారి’ అనబడే (దుష్టశక్తులు) వాస్తవంగా ఉన్నాయా” బాబా అని బాబాని
ప్రశ్నించింది. “అవును. అటువంటి శక్తులు ఉన్నాయి.
కాని అవి మనల్ని ఏమీ చెయ్యవు” అన్నారు బాబా. అప్పుడామె ఈ దుష్ట దేవతల వల్లనే ప్రజల ప్రాణాలు
పోతున్నాయి కదా అనే సందేహాన్ని వెలిబుచ్చింది.
ఆమె సందేహానికి సమాధానంగా బాబా “దుష్ట దేవత నన్ను దూషిస్తూ ఉంది. తనని గ్రామంలోకి ప్రవేశించనిమ్మని నన్ను బలవంత పెడుతూ
ఉంది. అందువల్ల ఆమె తీసుకు వెళ్ళడానికి ఏ వ్యక్తయితే
నిర్ణయించబడ్డాడో అతనినే ఆమెకు ఇమ్మని నేనా భవంతుడిని కోరాను” అని చెప్పారు బాబా.
“దెయ్యాలు,
భూతాలు అనేవి ఉన్నాయా బాబా? నేను బొంబాయిలో నీమ్ గావ్ లో ఉన్నప్పుడు, బావి ప్రక్కనుండి
ఒక దెయ్యం వచ్చి మేడమీద గదిలోకి వెళ్ళి అక్కడ మాయమవుతూ ఉండేది” అని దెయ్యాల గురించి
తన సందేహాన్ని వెలిబుచ్చి బాబాని ప్రశ్నించింది.
సర్వాంతర్యామి, సర్వజ్ణుడయిన బాబా, “అవును, దెయ్యాలు అనేవి ఉన్నాయి. కాని, అవి మనకు హాని తలపెట్టవు” అన్నారు. దెయ్యాల గురించి ప్రస్తావిస్తూ ఆయన ఇంకా “నువ్వు
చూసిన దెయ్యం ఆ ఇంటి యజమాని. అది వచ్చి మేడమీదకు
వెళ్ళి నువ్వు ప్రసవించిన చోటకు వచ్చి మాయమవుతోంది” అని అన్నారు.
బాబా
నుంచి ఈ విషయాలన్నీ విన్న ఆమె నిశ్చేష్టురాలయింది. బాబా ఇవన్నీ మీకెలా తెలుసు అని అడిగింది. “ “నువ్వు,
నాకు నీ చిన్నతనం నుండి తెలుసు. నువ్వు నన్ను
మర్చిపోయినా నేను నిన్ను మరవను. నా భక్తులు
వేల మైళ్ళ దూరంలో ఉన్నా సరే వారినందరినీ నా వద్దకు రప్పించుకుంటాను. వారు మంచివారయినా, చెడ్డవారయినా అందరినీ సమానంగానే
చూస్తాను” అన్నాను బాబా.
కొంతసేపటి
తరువాత ఆమె తిరగలి విసురుతూ అలసిపోయింది. ఇక
నువ్వు విసురు తిరగలి అంటూ లక్ష్మీబాయికి ఆ పని అప్పచెప్పింది. ఆమె తనలోని భయాన్ని పారద్రోలి తన మీద, తన కుటుంబం
మీద బాబా చూపించిన ప్రేమాభిమానాలకి, ఆయనే తమ యోగక్షేమాలను చూస్తూ ఉంటారనే ధైర్యంతో
బొంబాయికి తిరిగి వెళ్ళింది.
శ్రీసాయి
సత్ చరిత్ర ప్రధమాధ్యాయంలో బాబా గోధుమలను విసురుతున్న ఘట్టం వస్తుంది. “వెళ్ళండి. వాగు దగ్గరకు వెళ్ళి గ్రామ సరిహద్దుల దగ్గర ఈ పిండిని
చల్లి రండి” అని నలుగురు స్త్రీలతోను బాబా చెప్పారు. ఆవిధంగా బాబా షిరిడీ నుంచి కలరాను పారద్రోలారు.
@@@
ఈ
బ్లాగులో ప్రచురించిన “శ్రీ షిరిడీ సాయిబాబాతో తార్ఖడ్ కుటుంబము వారి ప్రత్యక్ష అనుభవాలు”
లో, 02.08.2011 న ప్రచురించిన “మాయి ఆయి దేవత భయంకర దృశ్యం” 18.08.2011 న ప్రచురించిన “భూతంతో ఎదురు దాడి”
వీటిని కూడా చదవండి.
(మరికొన్ని
వైభవాలు ముందు ముందు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment