25.04.2016
సోమవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి
అమృత ధార
బాబా స్వయంగా రావచ్చు
ఈ
రోజు మరొక అధ్బుతమైన అమృత ధార ను ప్రచురిస్తున్నాను. బాబా వారి అనుగ్రహం ఏ విధంగా ఉంటుందో మనం ఊహించలేము. ఆశలన్నీ అడుగంటిపోయి నిరాశా నిస్పృహలతో ఉన్నప్పుడు
ఆయన తన చేయిని అందించి సహాయం చేస్తారు. కాని
ఆ సమయంలో మనకు కావలసినది ప్రగాఢమయిన భక్తి.
ఆ భక్తిని మనసులో నింపుకుని మనం నిశ్చింతగా ఉండటమే. ఆ తరువాత ఆయనే చూసుకుంటారు.
నేను
కూడా 6 సంవత్సరాల క్రితం ఒక బృహత్కార్యమ్ కోసం లక్షలు అవసరమయ్యాయి. చేతిలో అంత డబ్బు కూడా లేదు. ఆ సమయంలోనే సుమారు యాభయి వేల రూపాయలకు
మరొక ఖర్చు తగిలింది. అసలే పెద్ద ఖర్చు,
దానికి తోడు మరొక ఖర్చు తగిలింది. సామాన్యంగా
అయితే ఎలాగరా భగవంతుడా అని తల పట్టుకోవలసిన పరిస్థితి. నా భార్య ఈ ఖర్చు గురించి చెప్పినపుడు, కమ్ ప్యూటర్
ముందు పని చేసుకుంటూ ఉన్నాను. హాలులో ఉన్న బాబా పెద్ద పటాన్ని చూపించి ఆయనకి చెప్పు
ఆయనే చూసుకుంటారు అన్నాను ఏ మాత్రం తొట్రు పడకుండా. ఆ ఖర్చు విషయం ఆయనే చూసుకున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే, ఆ మహత్కార్యానికి కావలసిన
డబ్బులో కొంత బాబా ని అప్పు అడిగాను. “బాబా నాకు నాలుగు లక్షలు అప్పు ఇవ్వు. నేను రిటైర్ అవగానే నాకు వచ్చే పెన్షన్ డబ్బులోనుండి,
నీ బాకీ షిరిడీలో హుండీలో వేసి నీ అప్పు తీర్చేస్తాను” అన్నాను. నా భార్య ఆయనని ఆ అడగటం ఏమిటి అని అంది. వెంటనే తప్పయిపోయిందని లెంపలు వేసుకున్నాను. ఆయన అప్పు ఇవ్వకుండా, నేను బయట ఎవరి వద్దా అప్పు
చేయకుండా, కార్యాన్ని జరిపించారు. నేను ఏవిధంగానూ
నిర్వహించలేని పరిస్థితిలో ఆయన ఆదుకున్నారు. అది ఆయన అనుగ్రహం. మహత్కార్యం ఏమిటన్నది మాత్రమ్ రహశ్యంగానే ఉంచదలచుకొన్నాను. అందుచేత పూర్తి వివరాలను ఇవ్వడంలేదు. ఈ విషయం ఎందుకని చెప్పానంటే అచంచలమైన విశ్వాసంతో
ఆయన మీదే భారం పెట్టినప్పుడు ఆయనే మోస్తారని చెప్పడానికే ఈ ఉదాహరణ చెప్పాను. (ఓమ్ సాయిరాం)
.
ఇక
ఈరోజు లీల చదవండి. ఈ లీల శ్రీసాయి లీల మాసపత్రిక
అక్టోబరు, 1986 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
ఇపుడు
నేను చెప్పబోయే సంఘటన, 1957, లేక 1958 సంవత్సరం శీతాకాలపు రోజులలో జరిగింది. శ్రీ ఎ.కె. కుంథేకర్ జబల్ పూర్ ఖమారియాలో ఉన్న ఆయుధ
కర్మాగారంలో అసిస్టెంట్ ఫోర్ మన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి వయసు 40 సంవత్సరాలు ఉంటుంది. నాకు మంచి స్నేహితుడు కూడా. అతను పూనానించి వచ్చాడు. అతను బ్రాహ్మలు. మంచి నీతి నియమాలు కలిగిన వాడు. తల్లిదండ్రులంటే ఎంతో గౌరవం. అతని జీవితంలో అతనికి ఉన్న ముఖ్యమయిన ఆలోచనంతా మంచానికే
పరిమితమయిన అతని తండ్రి గురించే. వృధ్ధుడయిన
తన తండ్రి బాగోగులను ఇతరుల మీద పెట్టడమనే ఆలోచనని దరిదాపులకు కూడా రానివ్వడు. తండ్రికి కావలసినవన్నీ తనే స్వయంగా చూసుకునే మంచి
వ్యక్తి. ఈ పరిస్థితుల్లో అతని పై అధికారి
లెఫ్టినెంట్ కల్నల్ నుండి అధికారిక ఉత్తర్వు వచ్చింది. అందులో పూనాలోని కిర్కీలో 18 వారాలపాటు జరగబోయే
సీనియర్ ఆర్నమెంట్ ఎక్జామినర్ కోర్సుకి వెళ్ళడానికి తయారుగా ఉండమని ఆదేశించారు. అతని పై అధికారి మహా మొండివాడు. ఎవరు ఏమి చెప్పిన వినే రకం కాదు.
ఆ
ఉత్తర్వు శ్రీకుమ్ ధేకర్ విషయంలో బాంబులా పేలింది. పెద్ద సంధిగ్ధంలో పడ్డాడు. ఉద్యోగంలో పై మెట్టు ఎక్కలంటె ఈ కోర్సులో ఉత్తీర్ణత
సాధించాలి. ఆ అర్హతను సాధించడం తప్ప ప్రమోషన్
కి వేరే దారి లేదు.
మరొక
సమస్య ఏమిటంటే కోర్సు చేయడానికి 18 వారాలు తండ్రిని విడిచిపెట్టి ఉండాలి అలా కాక తండ్రిని
కూడా తీసుకు వెళ్ళి మరలా వచ్చేటప్పుడు కూడా తీసుకుని రావాలి. దాని వల్ల తండ్రి ఆరోగ్యం దెబ్బ తినవచ్చు. అందువల్ల తనకు కోర్సుకు వెళ్ళకుండా మినహాయింపునిమ్మని
కోరడమా లేకపోతె కారుణ్య పధ్ధతిలో (కంపాషనేట్ గ్రౌండ్స్) కిర్కీ కి బదిలీ (ట్రాన్స్ఫర్)
చేయమని అడగడమా? ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో పడ్డాడు. ఈ పరిస్థితిలో కాస్త ఓదార్పు కోసం, నా సలహా కోసం
నా దగ్గిరకి వచ్చాడు. కళ్ళంబట నీళ్ళ పర్యంతమయి
తన సమస్యనంతా చెప్పుకొన్నాడు. నా జీవితంలో
శ్రీ సాయిబాబా చేసిన అద్భుతాలెన్నిటినో అతనికి చెప్పాను. ఆయన నా జీవితానికి ఏవిధంగా అధారభూతుడన్న విషయం కూడా
అతనికి ఇంతకు ముందు నా అనుభవాలతో వివరించాను. అతను నా దగ్గరకు
రావడం బాబా అనుగ్రహంతోనే వచ్చాడని సహజంగనే భావించాను. అతను తన పితృ ఋణం తీర్చుకోవడానికి బాబా ప్రమేయం
ఉందని కూడా అనుకున్నాను. ఇదే విషయం అతనికి
చెప్పాను. బాబా బిడ్డల యొక్క కర్తవ్య నిర్వహణ
విషయంలో ప్రపంచంలోని ఏశక్తి కూడా వారిని అడ్డుకోలేదని అతన్ని అనునయిస్తూ చెప్పాను. ఆ క్షణం నుండి అతను మరొక్క ప్రశ్న వేయకుండా బాబాని,
తన ఇంటిలో పూజించే దత్తాత్రేయునిగా భావించాడు.
బాబా మీదనే నమ్మకం నిలుపుకొన్నాడు.
నా మాటలు అతనిని ప్రభావితం చేయడంతో అతనిలోని వ్యాకులత మాయమయింది. ఇపుడు శ్రీకుమ్ ధేకర్ ఎటువంటి అడ్డంకులు లేకుండా
ముందుకు సాగుతాడనే విషయంలో నాకెటువంటి సంకోచాలు లేవు. తెలిసి గాని తెలియక గాని ఈ విధంగా నాకు ప్రేరణ కలగడం
నాకిది మొదటిసారి కాదు. ఇక ఆశ వదిలేసుకున్న
నిస్సహాయ స్థితిలో ఉన్నపుడు బాబా తన స్నేహ హస్తాన్ని అందించి, తన కృపా వీక్షణాలతో తన
భక్తులను విపత్కర పరిస్థితులనుండి బయటకు లాగుతారు. చివరికి కధ సుఖాంతమయేలా అనుగ్రహిస్తారు.
వారం
రోజుల తరువాత నా స్నేహితుడు కృంగిపోయిన వదనంతో నాదగ్గరకు వచ్చాడు.నా స్నేహితుడు చేసిన
అభ్యర్ధనని అతని పై అధికారయిన లెఫ్టినెంట్ కల్నల్ గారు తిరస్కరించి ఏమయినా సరే తన ఆజ్ఞను శిరసా వహించాల్సిందేనని ఖండితంగా చెప్పాడట.
సెలవు తీసుకోవడానికి, ప్రయాణ భత్యం తీసుకోవడానికి వారం రోజులు గడువు ఇచ్చాడు.
తను అనుకున్న విధంగా బాబా తనకు సహాయం చేయటల్లేదని బాధ పడ్డాడు. బాబా పధ్ధతులు, చర్యలు అన్నీ నిగూఢంగా ఉంటాయని నాకు
తెలుసు కాబట్టి నేనేమీ కలత చెందలేదు. నేను
నిబ్బరంగా ఉన్నాను. అధైర్య పడవద్దనీ, బాబా
తప్పకుండా సహాయం చేస్తారని నేనతనికి ధైర్యం చెప్పాను. ఇక ఏవిధమయిన ఆశ లేక, సహాయం చేయగలిగేవారు లేని పరిస్థితులలో
క్షణంలో వెయ్యోవంతులో బాబా తప్పకుండా సహాయం చేస్తారని అతని మనసుకి బాగా ధైర్యం నూరిపోశాను. నేను ధైర్యం చెప్పడంతో అతను వెళ్ళిపోయాడు.
తరువాత
రెండు వారాలు నేను బాగా పని వత్తిడిలో ఈ విషయం గురించి పూర్తిగా మర్చిపోయాను. ఆ తరువాత నా స్నేహితుని విషయం గురించి తెలుసుకోవడానికి
ఒక రోజు మధ్యాహ్నం నా స్నేహితుని ఆఫీసుకు ఫోన్ చేశాను. ఆశ్చర్యంగా నా స్నేహితుడే ఫోన్ తీశాడు. తను ఇంతకు ముందే ఫోన్ చేసి నాతో మాట్లాడనందుకు క్షమించమని
నసుగుతూ బదులిచ్చాడు. తనే నన్ను కలుసుకోవడానికి
వస్తున్నానని చెప్పాడు. చెప్పినట్లుగానే నాదగ్గరకు
వచ్చి కొన్ని ముఖ్యమయిన పనులు పూర్తి చేయవలసిరావడం వల్ల నన్ను కలవడానికి వీలు లేకపోయిందని
చెప్పాడు.
ఇక
తప్పకుండా ఎక్జామినేషన్ కోర్సుకు వెళ్ళవలసిన పరిస్థితిలో ప్రయాణానికి ఖర్చులు తీసుకుని
కుటుంబంతో సహా కిర్కీకి వెళ్ళడానికి తయారయ్యాను.
అప్పుడే నమ్మలేనంత ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. ప్రయాణమవడానికి ఒక రోజు ముందు సాయంత్రం నా పై అధికారి
(లెఫ్టినెంట్ కల్నల్) నుండి, ముందు ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేస్తున్నట్లుగా వర్తమానం
పంపించాడు. బాబా చేసిన అటువంటి అనూహ్యమయిన
సహాయానికి నిశ్చేష్టుడినయ్యాను. ఎంతో సంతోషం
కలిగింది నాకు. ఇన్ని రోజులుగా నేను పడుతున్న
వ్యధకి మంగళం పాడినట్లయిందని అన్నాడు. అధ్భుతమయిన
ముగింపు బాబాగారు ఊహించని విధంగా ఏర్పాటు చేసి తన ఉనికిని ఏ విధంగా చాటుకున్నారో వివరంగా చెప్పాడు.
మరునాడు
ఉదయం 11 గంటలకు నేను భోజనం చేయబోతుండగా, బాబా లాగ దుస్తులు ధరించిన ఒక ఫకీరు గుమ్మం ముందు వచ్చి నిలుచున్నాడు. అందరికీ ఇచ్చే
విధంగానే ఆయనకు కొంత డబ్బు ఇవ్వబోతే తనకు డబ్బు వద్దనీ, తినడానికి ఏదయినా పెట్టమని
అడిగాడు. ఆ ఫకీరు, నేను ఇచ్చిన ఆహారాన్ని స్వీకరించి,
చిన్న ఊదీ పొట్లాన్ని నాకు ఇచ్చాడు. ఆ ఊదీ
పొట్లాన్ని దత్తాత్రేయుని పటం ముందు ఉంచి, ‘ఆరతి’ ఇచ్చిన తరువాత విప్పి చూడమని చెప్పాడు. ఆఫకీరు చెప్పిన విధంగానే చేసి, పొట్లం విప్పి చూడగా
అందులో ఊదీకి బదులు 5 చిన్న శంఖాలు కనిపించాయి.
వెంటనే నేను తలుపు దగ్గరకు వచ్చి చూసేటప్పటికి అక్కడ ఆ ఫకీరు కనిపించలేదు. వచ్చిన ఆ ఫకీరు బాబా తప్ప మరెవరూ కాదని అర్ధం చేసుకున్నానని
చెప్పాడు.
బాబా
వారు ఇచ్చిన శంఖాలను దివ్యమయిన వస్తువులుగా భావించి వాటిని పూజా మందిరంలో భద్రంగా ఉంచుకున్నారు.
డా.
పి.ఎస్. రామస్వామి,
హైదరాబాద్
(మరిలొన్ని
అమృత ధారలు ముందు ముందు)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment