10.05.2016 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబానిస
గారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక జీవితంపై మరికొన్ని సందేశాలు
శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం -10 వ.భాగమ్
91. నీలోని
పగకు కారణం నీకు జరిగిన
అన్యాయం. ఆ అన్యాయానికి మూలం
నీలోని అజ్ఞానం. నీలోని
అజ్ఞానాన్ని తొలగించు. అపుడు
నీవాడు పైవాడు అనే భేదాలు నీలో
ఉండవు. అపుడు
నీలో పగ వైషమ్యాలకు చోటుండదు.
92. కుష్టువ్యాధితో
బాధపడుతున్నవాడు తన శరీరావయవాల రూపును
పోగొట్టుకుంటున్నాడు. అదే అసూయ అనే
వ్యాధితో బాధ పడుతున్నవాడు తన మనశ్శాంతిని పోగుట్టుకుని
తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
93. స్త్రీలోని అందచందాలు పురుషునిలో వికారాలు లేపడం సహజం. ఆ పురుషులలోని వికారాలే ఆ స్త్రీ నాశనానికి మొదటిమెట్టు. అందుచేత స్త్రీలు తమ అందచందాలను బహిర్గతం చేయకుండా ప్రశాంతంగా జీవించాలి.
28.08.2007
94. వృధ్ధాప్యములో మమతలు మమకారాలని చంపుకో. భగవంతుడు నీకు ఏకాంతవాసాన్ని ప్రసాదించినపుడు దానిని సద్వినియోగం చేసుకుని భగవంతుడికి ప్రీతిపాత్రుడవు అగు.
95. అన్నా తమ్ముడు, అక్క చెల్లి, ఈ బంధాలు లోకంలోకి వచ్చేటపుడు నీ వెంట రాలేదు. నీవు ఈలోకం వదలి వెళ్ళేటపుడు ఈబంధాలు నీవెంట రావు. అందుచేత నీవెంట రానివాటి గురించి ఆలోచించకు. నీకు సదా తోడునీడగా ఉండే ఆభగవంతుని దయ సంపాదించటానికి కృషి చెయ్యి.
02.09.2007
96. రోడ్డుప్రక్కన
పడిఉన్నవాడిని ఒక యోగి అని
ఎవరయినా చెబితే వాడిని తీసుకుని వచ్చి నీ పరుపుమీద కూర్చుడబెట్టుకుని
సకల మర్యాదలు చేస్తావే. వాడు
యోగి కాదు సాధారణమానవుడే అని
తెలిసిన వెంటనే తన్ని తరిమి వేస్తావే. ఇదెక్కడి
న్యాయం అని ఆలోచించు.
97. మానవుడికి సుఖంగా నిద్ర పట్టకపోవడానికి కారణం ఎదుటివాడికి పట్టుపరుపు, పందిరిపట్టి మంచము ఉంది తనకు లేదు అనే భావన మాత్రమే. నిజానికి సుఖ నిద్రకు మూలము తృప్తి. అంతేగాని ఎదుటివాడికి ఉన్న విషయాలపై ఆలోచన కాదు. తనకు ఉన్నదానితో తృప్తి చెందితే రాత్రివేళ ప్రశాంతంగా నిద్రించవచ్చు.
09.09.2007
98. మరణించిన
తరువాత ఆ శరీరానికి దహనసంస్కారాలు ఎలాజరుగుతాయి అని ఆలోచించటం అవివేకము. ఎంత
రక్త సంబంధీకులయినా ప్రాణం లేని శరీరాన్ని దగ్గిర
ఉంచుకోరు. ఏదో
విధంగా దహన సంస్కారాలు జరిపించి
తమ బాధ్యతలను పూర్తిచేసి వివేకంతో జీవిస్తారు. అందుచేత
నీవు నీమరణం తరవాత నీశరీరానికి దహన
సంస్కారాల గురించి ఆలోచించవద్దు.
99. ఇతరుల
బాధ్యతలను నీవు భుజాన వేసుకుని
మరీ పిచ్చివాడిలాగ తిరగవద్దు. ఇతరుల
వ్యవహారాలలో తలదూర్చవద్దు. సద్గురుని
మాటలను విని కష్టాలకు దూరంగా
జీవించు. ---
--- సాయిబానిస.
100. తల్లిదండ్రులు,
అన్నదమ్ములు కలిసి జీవించడంలో ప్రశాంతత
లేనినాడు విడిపోయి ప్రశాంతంగా జీవించడం మంచిది. ఎంతమంచి
స్నేహితుడయినా అతని మనసులో అపార్ధము
కలిగిననాడు అతడు స్నేహాన్ని కొనసాగించడు. అటువంటివాని
వెనక తిరిగుతూ స్నేహం కోసం వానిని ప్రాదేయపడటము మన మూర్ఖత్వము. అందుచేత అటువంటివానినుండి దూరంగా జీవించాలి.
(మరికొన్ని
సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment