19.06.2016 ఆదివారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాఅశీస్సులు సాయిబానిస గారికి ప్రసాదించిన సందేశాలు ఆఖరి భాగం
శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మికం 21 వ.భాగం
20.07.2012
201. నేటి సమాజ శ్రేయస్సుకోసం యోగీశ్వరుల జీవితం చదవడం చాలా అవసరం. అంతేగాని, సినీ తారల జీవిత చరిత్రలు కాదు.
--- సాయిబానిస
16.08.2012
202. శతృత్వము రాకూడదు. ఒకసారి వచ్చిందంటే అది జీవితాంతము ఉంటుంది. మనము మన శతృవును క్షమించినా అతను మాత్రము మనలను దెబ్బ తీయాలనే ఎదురు చూస్తూ ఉంటాడు. అందుచేత నీ శతృవునుండి దూరంగా జాగ్రత్తగా ఉండటం మంచిది.
23.08.2012
203. వృధ్ధాప్యంలో వివాహము చేసుకున్న సంతన యోగము ఉండదు. ఆ తరవాత భార్యతో తలనొప్పులు వస్తాయి. అందుచేత వృధ్ధాప్యంలో వివాహము చేసుకోరాదు.
04.09.2012
204. సమాజంలో స్నేహితుడు, స్నేహాలు అనే విషయంపై గొప్పగా చెప్పుకుంటున్నారు. నా అనుభవంలో స్నేహాలు అనేవి ఇద్దరు వ్యక్తుల అవసరాలు తీర్చుకునే కలయిక. ఆ అవసరాలు తీరిపోయిన తరువాత స్నేహితుడు స్నేహాలను మర్చిపోయి ఎవరికి వారు యమునా తీరే అంటారు.
--- సాయిబానిస
05.09.2012
205. జీవితంలో జీవించడానికి ఆశ ఉండాలి. అంతేగాని అత్యాశ పనికిరాదని గ్రహించు.
07.09.2012
206. రేపు అనే పదానికి అర్ధము ఉందిగాని, నీవు రేపు అనే రోజును చూస్తావనే నమ్మకం లేదు. అందుచేత భగవంతునిపై నమ్మకముంచి జీవితాన్ని కొనసాగించు.
12.09.2012
207. నీవాళ్ళను సంతోషపెట్టడానికి అప్పుచేయడం ఒక తప్పు. అదికాకుండా నిజానికి ఎంత అప్పు చేయాలి అని ఆలోచించకుండా అప్పు చేయడం పెద్ద తప్పు. అందు చేత అప్పు చేయకుండా ఉన్నదానితో తృప్తిగా జీవించడం ఒప్పు.
03.10.2012
208. మనము ఇష్టము లేనివారి నుండి దూరముగా జీవించాలి. అంతే గాని రోజూ వారితో గొడవలు పడరాదు అని అన్నదమ్ముల వ్యవహారంపై తీర్పు ఇచ్చాను.
14.10.2012
209. తమకూతురు భర్తతో మంచిగా కాపురం చేసుకోమని చెప్పవలసిన తల్లిదండ్రులు ఏ చిన్న సమస్య వచ్చినా కూతురిని పుట్టింటికి వచ్చివేయమని చెప్పడంలో అర్ధం లేదు. నిజానికి తల్లిదండ్రులు అల్లుడిని, కూతురిని కూర్చోబెట్టుకుని సమస్యలను పరిష్కరించి వారి జీవితంలో సుఖశాంతులను ప్రసాదించాలి.
210. జీవితాంతము
భార్యాపిల్లల కోసం కష్టపడి ధనం
సంపాదించి తన బరువుబాధ్యతలను చక్కగా
నెరవేర్చిన ఆ ఇంటి యజమానిని
(భర్త) చూడు. అతని
జీవితాఖరి దశలో అతని భార్య
అతనిని పట్టించుకోకపోవడం నాకు చాలా బాధ
కలిగించింది.
18.10.2012
211. నీ గత జీవితంలో నీ గురించి గొప్పగా మాట్లాడిన సాయిబంధువులు, ఉద్యోగపరంగా నీతో స్నేహం చేసినవారు ఈ రోజున నీ గురించి చెడుగా మాట్లాడటం వారి విజ్ఞతకే వదలిపెట్టు. వారు నిన్ను నీ జీవితంలో కరివేపాకులాగా వాడుకుని వదిలేశారు. అటువంటివారి గురించి ఆలోచించడం దండగ. వారినుండి దూరంగా జీవించడం ఉత్తమము.
21.10.2012
212. జీవితంలో కష్టాలను మనం పిలవకపోయినా అవి వస్తాయి. ఆ కష్టాలనుండి బయటపడటానికి ప్రయత్నించాలి. అంతేగాని, ఆ కష్టాలకు ఆత్మహత్య పరిష్కారం కాదని గ్రహించాను.
01.11.2012
213. జీవితం ఆఖరి దశలో నీవు స్మరించే భగవన్నామమే నీతోపాటు నీ పునర్జన్మలో తోడుగా నిలుస్తుంది.
03.11.2012
214. భగవంతుడు మనలను మన కుటుంబ సభ్యులను కాపాడుతాడని మొక్కులు మొక్కుకుంటాము. మన అవసరాలు తీరిన తరవాత ఆ మొక్కుల సంగతి మర్చిపోతాము. ఇది మంచి పధ్ధతి కాదు. మనము సదా భగవంతునికి విధేయ సేవకుడిగానే జీవించాలి.
(సమాప్తం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment