Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, June 14, 2016

మందిరానికి దారి చూపిన సాయి :

Posted by tyagaraju on 5:28 AM
Image result for images of tadikonda baba temple
  Image result for images of rose hd

14.06.2016 మంగళవారం 

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీకాకుళంనుండి సాయి బంధు శ్రీ సాయి సురేష్ గారు తమ అనుభవాలు పంపించారు.  వాటినన్నిటినీ క్రమానుసారంగా ప్రచురిస్తాను.  బాబా తన భక్తులను ఏ విధంగా అనుగ్రహిస్తూ ఉంటారో ఆయన అనుభవాల ద్వారా మనం గ్రహించుకోవచ్చు.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
నా పేరు సాయి సురేష్, నేను శ్రీకాకుళంలో ఉంటాను. సాయి నాకు ఇచ్చిన అనుభవాలను సాయి బంధువులందరితో పంచుకొనే అవకాశం కల్పించినందుకు సాయి కి నా కృతజ్ఞతాభివందనములు. 


హైదరాబాద్ లో వెంగళరావు నగర్ సాయి మందిరం:
మందిరానికి దారి చూపిన సాయి  :
ఒకసారి ఉదయం బాబా గుడిని వెతకటానికి బయలుదేరాను. బాబా నాకేవిధంగా  దారి చూపించారో చదవండి. ఇదివరకు వెంగళ్రావు నగర్ లో సాయి మందిరానికి దారి అని బోర్డు ఒకచోట చూసాను గాని అంతకు మించి నాకు ఏరియా కూడా సరిగా తెలియదు


నేను ఎవరిని వివరాలు ఏమి అడగకుండా బాబానె తన గుడికి దారి చూపుతారని వెళ్తున్నాను. నాకు తోచిన వైపు నడిచాను, కాదు బాబానే నడిపించారు. ఎక్కువ దూరం తిరగలేదు గాని, నిజానికి గుడి దాటి ముందుకు పోయాను. ఎక్కడ గుడి కనిపించట్లేదు. బాబా నువ్వే నీ సన్నిధికి దారి చూపు మనసులో  అనుకున్నాను.
             Image result for images of shirdi sai baba temple vengal rao nagar hyderabad

మరుక్షణమే బాబా భక్తి గీతం చిన్నగా వినిపించింది. పాట వినిపించిన వైపుగా కొంచం నడవగా బాబా గుడి కనిపించింది. పాట కూడా ఆగిపోయింది. గుడి లోపలకి వెళ్ళాను. అప్పుడు బాబాకి పాలతో అభిషేకం చేస్తున్నారు
                   Image result for images of milk abhishekam to baba

ఒక వ్యక్తి నన్ను పిలిచి, చేతికి పాలు అందించి, బాబాకి అభిషేకం చేయమన్నారు. అదే మొదటిసారి బాబాని అభిషేకించటం. చాల సంతోషించాను. ఇక్కడ అద్భుతమేమిటంటే పాట గుడి నుండి వినిపించింది  కాదు. గుడిలో చుట్టూ వినిపించేలా ఎప్పుడు పాటలు వేయరు. బాబా అని పిలవగానే పలికి, గుడికి దారి చూపి, నాచేత అభిషేకం చేయించుకున్నారు కరుణ మూర్తి.

గ్రంధాన్ని అనుగ్రహించిన సాయి :

షిర్డీ వెళ్లి వచ్చేటప్పుడు శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకం తెచ్చుకున్నాను. నేనింకా పారాయణ చేయకముందే నా స్నేహితుడు చక్రి పుట్టినరోజు వస్తే, బాబా నాకు ఇంకో పుస్తకం ఇస్తారు అనుకొని అతనికి పుస్తకం కానుకగా ఇచ్చేసాను. బాబాని సచ్చరిత్ర పుస్తకం ఇమ్మని వేడుకుంటూ ఉండేవాడినివెంగళరావు నగర్ బాబా గుడికి వెళ్ళటము మొదలుపెట్టి ఒక వారం రోజులు ఇంకా  కాలేదు. నాకు ఎవరు అంతగా పరిచయం కాలేదు. రోజూ  ఉదయం వెళ్లి  బాబా కి అభిషేకం అయ్యాక అక్కడే దూరంగా కూర్చొని ధ్యానం ఒక 15 లేదా 20 నిముషాలు చేసుకొని హాస్టల్ కి వచ్చేసేవాడిని. ఒకరోజు అలా ధ్యానంలో ఉండగా స్పష్టంగా నీకు పుస్తకం ఇస్తాను. చదువుకో అన్న మాటలు వినిపించాయి. కళ్ళు తెరిచి చూసాను. దూరంగా బాబాకి స్నానం చేస్తూ పంతులు గారు, మరో వ్యక్తి  ఉన్నారు. నా చుట్టు పక్కల ఎవరు లేరు. ఆశ్చర్య పోయాను. మాటలు ఖచ్చితముగా బాబా మాటలని, త్వరలో బాబా పుస్తకం ఇస్తారని గ్రహించాను. అదే నిజమైంది. సంఘటన జరిగిన సరిగ్గా ఒక వారం రోజులకి మందిరం లో బాబాకి అభిషేకం అయిపోయాక కూర్చొని ఒక అతనితో మాట్లాడుతున్నాను. ప్రక్కగా ఒక పెద్ద అతను బాబా స్నానానికి టవల్స్ తీసుకువెళ్తు అకస్మాత్ గా ఆగి, మీరు బాబా బుక్ చదివారా అని అడిగారు. నేను లేదని చెప్పానుసరే ఉండండి అని వెంటనే వెళ్లి ఎక్కిరాల భరద్వాజ గారు రచించిన శ్రీ సాయి లీలామృతం అనే బుక్ తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టి, చదువుకోమని చెప్పారు
                              Image result for images of sai leelamrutham book in telugu

నేను ధర యెంత అని అడిగాను. డబ్బులు ఏమి అవసరం లేదు. పుస్తకం మీ దగ్గర ఉంచుకొని చదువుకోండి అని చెప్పారు. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. అప్పటికిఅప్పుడే పుస్తకం నిత్య పారయణ చేయాలని నిశ్చయించుకున్నాను. అనుకున్నట్లు గానే సద్గురు సాయినాధుని కృప వలన ఇప్పటికి 9 సంవత్సరాలుగా పుస్తకం  పారాయణ  చేయగలుగుతున్నాను. 3 లేక 4 రోజులు అంతరాయం కలిగినా అది కూడా ఆయన ఇష్టం మేరకే అయి ఉండవచ్చు. లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నాను అనే గర్వం నాలో ఏర్పడుతుంది, అది కూడా అధ్యాత్మిక మార్గంలో దోషమే కదా! ఆవిధంగా నాకా దోషం కలగకుండా సాయి కాపాడారు.

అయితే నేను సచ్చరిత్ర  కోరితే సాయి శ్రీ సాయి లీలామృతం ఎందుకిచ్చారంటే, ఎవరి సంస్కారానికి తగిన ఉపదేశం వారికి ఇవ్వగలగటమే సద్గురువు యొక్క ప్రత్యేకత. అందుకే నా పూర్వజన్మ సంస్కారానికి తగినట్లు నాకు పుస్తకం సాయి అనుగ్రహించి నిత్యపారాయణ చేసేలా చేసారు.

నాకు వెంగళ్రావు నగర్ సాయి మందిరానికి తీసుకువెళ్ళి బాబా నన్ను ఎంతగానో అనుగ్రహించారు. ముందు చెప్పినట్లు సాయి లీలామృతం పుస్తకాన్ని అనుగ్రహించారు. నాకు ముందు నుంచి కాస్త సంకోచం ఎక్కువ. కారణంగా నాకు నేనుగా ఏదీ కావాలని ఎవరిని అడగను, చొరవ కూడా తీసుకోను. నా హృదయ వాసి అగు సాయి కి అన్ని తెలుసు కదా! అందుకే ఆయన బలవంతంగా మరి గుడి లో ఆయనకు సంబంధించిన అన్ని రకాల సేవలలో నాకు అవకాశం కల్పించారు. రోజు ఉదయం 4 గంటలకే లేచి స్నానం చేసి కాకడ హరతికి వెళ్ళటము, తర్వాత పాలాభిషేకం, బాబా స్నానానికి నీళ్ళు తెచ్చి పెట్టడం, బాబాకి స్నానం , వస్త్రాలు కట్టడం, గర్భ  గుడి శుభ్ర పరచటం, వీలైనంతవరకు అన్ని హరతులకు వెళ్ళటము, శేజ హరతికి ముందు ఒకసారి గర్భ  గుడి శుభ్రపరచటం, బాబాకి డ్రెస్ మార్చడము,గురువారం పల్లకి ఉత్సవంలో పాల్గొనడం, 
                  Image result for images of baba pallaki utsav

ఇలా అన్ని రకాల సేవ కార్యక్రమాలలో నాకు సాయి అవకాశం ఇచ్చి నా కోరికను తీర్చారు. చలికాలం చలిలో, వానాకాలంలో కూడా 4 గంటలకు లేచి కాకడ హరతికి వెళ్ళేవాడిని. వర్షం లో కూడా తడిసి మరీ వెళ్ళే వాడిని. అంతలా నా మనస్సు సాయి పాదాల చెంత నిలిచిపోయింది. అంతలా సాయి నన్ను తన సొంతం చేసుకున్నారు. గుడిలో క్రింది బాగంలో ద్వారకామాయి ఉంటుంది. అందులో అడుగుపెడితే సాక్షాత్ షిర్డీ లోని ద్వారకామాయిలోకి వెళ్ళినట్లు అనిపిస్తుంది.

•             ఒకసారి దత్తజయంతికి మారుతి నగర్ సాయి మందిరంలో కార్యక్రమాలకు సంబంధించిన పామ్ ప్లెట్ ఒకటి నా గది అలమర లో సాయి చరిత్ర బుక్స్ ఉండేచోట కన్పించింది. అది అక్కడికెలా వచ్చిందో తెలియలేదు. నా రూమ్ మేట్ ను అడిగాను తానేమైన తెచ్చాడేమో అని. కానీ అతను తేలేదన్నాడు. సాయి నన్ను అక్కడి మందిరాన్ని దర్శించుకోమని చెప్తున్నారని తలచి, దత్తజయంతి నాడు మందిరాన్ని దర్శించుకొన్నాను.

•             ఒకసారి నాకు బాబాకి ఐస్ క్రీమ్ పెట్టాలని కోరిక కలిగింది. కానీ షాప్ లో తీసుకోని గుడికి వెళ్లేసరికి కరిగిపోతుంది మరి ఏమి చేయాలి అనుకున్నానుఐస్ క్రీమ్ తీసుకోకుండానే గుడికి వెళ్తున్నానునా కోరిక తెలిసిన సర్వ హృదయవాసియగు సాయి చేసిన అద్బుతం, ఐస్ క్రీమ్ బండి గుడి దగ్గరనే ఉంది
                 Image result for images of ice cream

వెంటనే సంతోషంతో రెండు ఐస్ క్రీమ్స్ తీసుకొని బాబాకు అర్పించి, వాటిని ఇద్దరు వ్యక్తులకు ఇచ్చేసాను. వారి రూపంలో ఉన్నది నా సాయే కదా!

(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు) 



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List