23.06.2016
గురువారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు శ్రీ షిరిడీ సాయి వైభవంలో మరికొన్ని వైభవాలు తెలుసుకుందాము.
శ్రీ
షిరిడీ సాయి వైభవమ్
బాబా
అనుమతిస్తే ధైర్యంగా ప్రయాణించవచ్చు
కర్ణిక్
బాబా దర్శనం చేసుకొన్న తరువాత పండరీపూర్ కి ప్రయాణమయ్యాడు. కోపర్ గావ్ స్టేషన్ లో పాసింజరు రైలుకి టిక్కెట్
కొన్నాడు.
దౌండ్ స్టేషలో దిగి, తరువాత కురిద్వాడి
అక్కడినుండి పండరిపూర్ వెళ్ళే రైలు కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. ఈ లోగా అతనికి బాత్ రూమ్ కి వెళ్ళే అవసరం పడింది. కాని సామానంతా వదిలి వెళ్ళడం ఎలాగా అని ఆలోచిస్తూ
ఉన్నాడు.
ఇంతలో ఒక కూలీ వచ్చి, మీసామనుకు నేను
కాపలాగా ఉంటాను, మీరు బాత్ రూమ్ కి వెళ్ళి రండి అని చెప్పి, మీరు మీ పాసింజరు టిక్కేట్
ను ఎక్స్ ప్రెస్ రైలు కి మార్చుకోండి, కొద్ది సేపటిలో ఎక్స్ ప్రెస్ రైలు వస్తుందని
కూడా చెప్పాడు. కర్ణిక్ ఆ కూలీకి తన టిక్కేట్
ను, ఇక్స్ ప్రెస్ రైలుకు అదనంగా అయ్యే డబ్బును అతని చేతిలో పెట్టి టిక్కెట్ ను తీసుకొని
రమ్మని చెప్పాడు. “కొద్ది సేపట్లో రైలు వచ్చేస్తుంది, మీరు వెళ్ళి రైలులో కూర్చోండి,
నేను టిక్కెట్ తీసుకొని వస్తాను” అని ఆ కూలీ వెళ్ళిపోయాడు. ఇంతలో రైలు రాగానే కర్ణిక్
వెళ్ళి కూర్చొన్నాడు.
తోటి ప్రయాణీకులు అతని
పరిస్థితినంతా” గమనించి, “ఆ కూలీ రాకపోతే మీ
పరిస్థితి ఏమిటి? అప్పుడు మీరేం చేస్తారు” అని అడిగారు. “ నాకు ఆ కూలీ మీద పూర్తి నమ్మకం ఉంది, అతను తప్పక
వస్తాడు” అని సమాధానమిచ్చాడు. అప్పుడే రైలు
బయలుదేరింది. ఇక స్టేషన్ వదలి వెళ్ళిపోతుండగా,
కూలీ అతను పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతిలో టిక్కెట్ పెట్టాడు.
బాబా అనుమతి తీసుకొని షిరిడీ వదలి పెట్టిన తరువాత
ఎందుకు భయపడాలి?
బాబా
వైద్యం
హరి
భావు కర్ణిక్ కోడలికి ఒకసారి మతి భ్రమించింది. ఆమె అంధేరీ, బొంబాయిలో నివసిస్తోంది.
ఆ వార్త విన్న కర్ణిక్ బాధ పడి ఆమెను చూడటాకి వెంటనే బొంబాయికి బయలుదేరాడు. రైల్వే
స్టేషనుకు చేరుకుని రైలు లో బొంబాయికి బయలుదేరాడు. రైలు పాల్ఘర్ కి చేరుకొంది. అకస్మాత్తుగా అతనికి తన వెనకాల కఫనీ ధరించిన ఒక
ఫకీరు కూర్చుని ఉండటం గమనించాడు. అపుడా ఫకీరు
“ఈ సృష్టిలో పరమేశ్వరుడు ఎన్నో రకాల వృక్ష జాతిని
మానవాళి ఉపయోగం కోసం సృష్టించాడు.
కాని ఈ మానవులకి వాటి ప్రాముఖ్యత, ఉపయోగం
చాలా కొద్దిగానే తెలుసు. కాని నాకు వాటి ఉపయోగాలు
పూర్తిగా తెలుసు. ఇలా అంటూ ప్రత్యేకంగా ఒక చెట్టుని చూపించి, ఆ చెట్టు ఆకులను బాగా
మెత్తగా నూరి వాటి రసాన్ని పిచ్చి పట్టిన వానికి త్రాగిస్తే వాని పిచ్చి నయమవుతుంది”
అన్నారు.
కర్ణిక్
తన పరిసరాలను కూడా మర్చి పోయి దీర్ఘాలోచనలో పడ్డాడు. రైలు బాంద్రా చేరుకొన్న తరువాత ఈ లోకంలోకి వచ్చాడు. చుట్టుప్రక్కల ఆ ఫకీరుకోసం చూసాడు, కాని అతనెక్కడా
కనపడలేదు. తన కుమారుడి ఇంటికి చేరుకొన్న వెంటనే
ఆ ఫకీరు చెప్పిన చెట్టు ఆకులను తెప్పించాడు.
రైలులో ఫకీరు చెప్పిన విధంగానే ఆకులను నూరి వాటి రసాన్ని తన కోడలి చేత త్రాగించాడు.
అధ్బుతం—కోడలియొక్క
మతిభ్రమణం పూర్తిగా నయమయింది. ఆమె మామూలు మనిషయింది.
రెండు
సంవత్సరాల తరువాత ఆమెకు మరల మతిభ్రమించింది.
కర్ణిక్ మరలా అదే చెట్టు ఆకుల రసాన్ని ఆమె చేత త్రాగించాడు. ఆమెకు ఇక మరలా
ఆ జబ్బురాకుండా శాశ్వతంగా నివారణయింది.
తొలిదినములలో
బాబా తెల్లని తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించేవారు. మొదట గ్రామములో రోగులను పరీక్షించి
ఔషధాలనిస్తూ ఉండేవారు. వారి చేతితో ఇచ్చిన మందులు పనిచేసేవి. మంచి హస్తవాసిగల డాక్టరని
పేరువచ్చింది. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి యెర్రబడ్డాయి. షిరిడీలో డాక్టరు దొరకలేదు.
ఇతర భక్తులు అతనిని బాబా దగ్గిరకి తీసుకొని వచ్చారు. అటువంటి రోగులకు అంజనాలు, ఆవుపాలు,
కర్పూరముతో చేసిన ఔషదాలని డాక్టర్లు ఉపయోగిస్తారు. కాని బాబా చేసిన చికిత్స విశిష్టమైనది.
నల్ల జీడిగింజలను నూరి రెండు మాత్రలు చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్కదానిని దూర్చి గుడ్డతో
కట్టుకట్టారు. మరుసటి రోజు కట్టులను విప్పి నీళ్ళను ధారగా పోసారు. కండ్లలోని పుసి తగ్గి
కంటిపాపలు తెల్లబడి శుభ్ర పడ్డాయి. నల్లజీడిపిక్కలమందు పెట్టినప్పుడు సున్నితమైన కండ్లు
మండనేలేదు. అటువంటి అధ్బుతాలు అనేకం ఉన్నాయి.
శ్యామా
విపరీతమయిన మూలశంఖ వ్యాధితో బాధ పడుతున్నపుడు బాబా అతనికి సోనాముఖి కషాయాన్ని త్రాగించారు. దానితో అతని మూల శంఖ వ్యాధి నయమయింది. రెండు సంవత్సరాల తరువాత ఆ వ్యాధి మరలా తిరగబెట్టింది. శ్యామా తానే స్వంతంగా సోనాముఖి కషాయాన్ని సేవించాడు. వ్యాధి తగ్గడానికి బదులు ఎక్కువయింది. తిరిగి బాబా ఆశీర్వాదం వల్ల నయమయింది.
దీనిని
బట్టి మనం గ్రహించవలసింది బాబా వల్లనే ఆయన ఇచ్చే మందులు అంత శక్తివంతంగా పని చేస్తాయి.
ఆయన చేసిన వైద్యమే కదా అని మనం స్వంతంగా చేసుకుంటె వాటిలో ఏవిధమయిన శక్తి ఉండదని మనం అర్ధం చేసుకోవచ్చు.
(మరికొన్ని
వైభవాలు ముందు ముందు)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment