Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, June 22, 2016

కర్టిస్

Posted by tyagaraju on 8:45 AM

Image result for images of kartis sai devotee
    Image result for images of yellow roses

22.06.2016 బుధవారం 
ఓం సాయి శ్రీసాయి  శ్రీ సాయి జయజయ సాయి 
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 
 ఈ రోజు ప్రచురిస్తున్న కర్టిస్ గురించిన వృత్తాంతం www.saileelas.com    నుండి గ్రహింపబడింది. వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 
           Image result for images of baba going to bhiksha
బాబా వద్ద అహంకారం, డాంభికం, మన గొప్పతనాన్ని ప్రదర్శించడం మూర్ఖత్వమే అవుతుందని తెలియచేస్తుంది.   
అహంకారం, అహంభావం పనికిరాదు 
కర్టిస్                                                        
బాబా షిరిడీలో ఉన్న కాలంలో మనదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తూ ఉండేవారు కదా ! సర్ జాన్ కర్టిస్ అనే ఆయన ప్రభుత్వ కేంద్ర విభాగానికి కమిషనర్ గా పనిచేస్తూ ఉండేవాడు . ఆయనకు పిల్లలు లేరు, కనుక బాబాను దర్శించి తమకు సంతానం ప్రసాదించమని కోరడానికి కర్టిస్ దంపతులు షిరిడీ బయలుదేరారు



కానీ వారికి ఎంతో గర్వము ,బాబా పట్ల చులకన భావమూ ఉన్నాయి . బాబా పట్ల నిజమైన భక్తి, విశ్వాసమూ లేవు . అయినా పిల్లలకోసం వారు బాబాను దర్శించాలను కున్నారు . విషయం బాబాకు తెలియకపోతే కదా !

రోజు మార్చి ,10,1911 ,ఉదయం 7 గం లు . బాబా మసీదులో ఉన్నారు . అకస్మాత్తుగా ఆయనెంతో కోపంగా తమ కఫ్నీని పైకెత్తి ," దుర్మార్గులు నా దర్శనానికి రావడమెందుకు ? నేను సరైన గుడ్డలు గూడా లేని పేద ఫకీరునేగా !" అన్నారు . బాబా ఎవరిని గురించి కోపగించు కుంటున్నారో అక్కడున్న ఎవ్వరికీ అర్ధంకాలేదు. కొద్దిసేపట్లో కర్టిస్ తన భార్యను తీసుకుని షిరిడీ చేరాడు . వారితో కొద్దిమంది ప్రభుత్వోద్యోగులు కూడా వచ్చారు .
వారంతా ఎంతో డాంభికంగా చావడి చేరారు . ఊరిలోంచి కుర్చీలు తెప్పించుకున్నారు . పవిత్రమైన చావడిలోనే కుర్చీలలో కూర్చున్నారు
               Image result for images of british officers

అక్కడ ఉన్న ఒక సాయి భక్తుని పిలిచి "పెద్ద పెద్ద బ్రిటిష్ ఆఫీసర్లు బాబా దర్శనానికి వచ్చారు . ఆయనను తొందరగా తయారవ్వమని చెప్పుఅన్నారు . అప్పుడా భక్తుడు ,"బాబా అంతటి గొప్ప మహాత్ముడు మన కోసం సిద్ధమై ఎదురుచూడాలా ?మనమే ఆయన కృప కోసం ఎదురు చూడాలి . ఆయనతో అలా చెప్పకూడదు "అన్నాడు . భక్తునికి ,వీరికి ఎంత తేడా !అతడికెంత వివేకం ! మనం కూడా ఎల్లప్పుడు మహాత్ముల కృప కోసం, దర్శనం కోసం ఎదురు చూడాలి గాని మన సౌకర్యం కోసం వారు మనకిష్టమైనప్పుడు దర్శనమివ్వాలని కోరుకోకూడదు .

దురహంకారంతో ,దుష్టత్వంతోనూ ప్రవర్తించే కర్టిస్ లాంటి వారంటే బాబాకు చాలా కోపం . వారు దర్శనానికి వెళ్లేసరికి బాబా అప్పుడే భిక్షకు వెళ్ళి తిరిగి వచ్చారు
         Image result for images of baba going to bhiksha

అప్పుడు శ్రీమతి కర్టిస్ బాబా దగ్గరకు వెళ్లి ,"బాబా ,మీతో కొద్దిసేపు మాట్లాడాలి "అన్నది . బాబా ముక్తసరిగా "ఒక అరగంట ఆగు" అని మళ్ళీ వెళ్ళిపోయారు . కొద్దిసేపటికి ఆయన తిరిగీ మసీదుకు వచ్చారు . ఈసారి మరలా బాబాతో మాట్లాడడానికి ఆమె బాబా దగ్గరకు వెళ్ళింది . ఆయన ఆమెకేసి కోపంగా చూసి ,"ఒక గంట ఆగు !" అన్నారు .

బాబా తమలాంటి  గొప్పవారితో అలా ప్రవర్తించడం వారికి నచ్చలేదు . అహం దెబ్బతిన్న దొరలు మరొక గంట కూడా ఆగకుండా ఆయన ఆశీస్సులు తీసుకోకుండానే వెళ్ళిపోయారు . వెళ్లేముందు కర్టిస్ సహస్రబుద్దేకు రూ. 5/-  ఇచ్చి పేదలకు దానం చేయమని చెప్పారు. నేను చేయాలంటే వీలుకాదు. నేనైతే బాబాకి ఇస్తానుదానం చేయాలంటే మునుసబుకోకరణానికో ఇవ్వండి అన్నారు సహస్రాబుద్దే. కర్టిస్ నీకు తోచినట్లు చేయి అని  చెప్పి వెళ్ళిపోయారు. మేక్లిన్ దొర రూ. 5/- జోగ్లేకర్  రూ. 2/- అతనికి ఇచ్చి వెళ్ళిపోయారు. అంతా  కలిపి రూ. 12/- లు బాబాకు సమర్పించారు సహస్రబుద్దే. బాబా ఒక పేద భక్తునికి ఇచ్చేసారు. రెండు గంటల తర్వాత మధ్యాహ్నం సహస్రబుద్దే  మసీద్ కు వెళ్ళినప్పుడు బాబా అతనితో గవర్నర్ ఇవ్వవలిసిన రూ. 30/- నాకివ్వు అన్నారు. అతడు నివ్వెరపోయివారిచ్చిన రూ. 12/- తమకే సమర్పించాను. మిగిలిన రూ. 18/-  నన్నివ్వమంటే ఇస్తానుఅన్నారు. “ తెల్ల వెధవలే నాకు రూ. 30/- ఇవ్వాలి. నీ డబ్బు నాకెందుకు?” అన్నారు బాబా.

సహస్రబుద్దేకేమీ అర్ధం కాలేదు. కానీ బాబా మాట్లాడిన ఒక్క మాట కూడా వ్యర్ధం కాదని అతడికి తెలుసు కనుక అతడు వెంటనే శ్రీమతి కర్టిస్ తో మాట్లాడి వివరాలు తెల్పమని జోగ్లేకర్ కు జాబు వ్రాసారు. జోగ్లేకర్ తిరుగు టపాలో జవాబు వ్రాసారు. షిర్డీ లో కర్టిస్ సహస్రాబుద్దేకు పైకమిచ్చే ముందు కర్టిస్ దంపతులు వాదించుకున్నారట. మొదట శ్రీమతి కర్టిస్ ఏదైనా ధర్మం చేయడానికి  పైకం ఇవ్వమన్నప్పుడు కర్టిస్ ఒక్క రూపాయి మాత్రమే ఇస్తానన్నారట. ‘అది మీ హోదాకు అంతస్తుకు సిగ్గుచేటు. నీవు కనీసం రూ. 25/- అయినా ఇవ్వాలిఅన్నదట ఆమె. మేక్లిన్ ఇచ్చిన రూ. 5/- లు కలిపితే మొత్తం 30 రూపాయలే! అదే బాబా కోరినది.

శ్రీమతి కర్టిస్ కు తమపట్ల దృడమైన భక్తి లేకపోవడం వలన బాబా ఆమె భక్తికి,  ఓరిమికి పరీక్ష పెట్టారు. ఆమె ఓడిపోయింది. అందువలన వారికి సంతానం కలుగలేదు . అలా గాకుండా వారు బాబా కృప లభించే దాకా ఓర్పుగా ప్రయత్నించి ఉంటే బాబా వారికి సంతానం ప్రసాదించేవారు . వారిలోని చెడ్డ గుణాలను తొలగించి మంచి మార్గంలో నడిపించేవారు . కనుక మనము మహాత్ముల కృప లభించేవరకు వారిని ప్రార్ధిస్తూ వారి కృపకై ఎదురుచూడాలి. అయితేనేమి బాబాను దర్శించినందుకు కర్టిస్ కు అంతకంటే పై పదవి బొంబాయిలో త్వరలోనే లభించింది.


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List