21.06.2016 మంగళవారం
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
షిరిడీ సాయి వైభవం
నాకు
నా ఫొటోకి భేదం లేదు
(ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి జూన్ 9, 2016 వ.సంచికనుండి గ్రహింపబడింది)
ఈ రోజు మరొక అద్భుతమైన వైభవాన్ని తెలుసుకుందాము. బాబా ఏనాడో స్వయంగా చెప్పిన మాటలు “నాకు నా ఫొటోకి భేదం లేదు” అని. నేను ఎక్కడ ఉంటే అక్కేడే షిరిడీ అని కూడా చెప్పారు.
అందుచేత బాబా ఫోటో ఎక్కడ ఉన్నా అదే షిరిడీ, అదే పవిత్ర స్థలం. బాబా అక్కేడే సజీవంగా ఉన్నారనే భావంతో ఉండాలి మనం. ఇప్పుడు మీరు చదవబోయే ఈ వైభవం ఆయన చెప్పిన మాటలకి సజీవ సాక్ష్యం.
(సద్దు భయ్యా)
1915 వ.సంవత్సరంలో బాబా తన ఫొటోని బాలారామ్, ముక్తారామ్ ద్వారా సద్దు భయ్య నాయక్ కి పంపించారు. దీక్షిత్ వాడాలో ఉన్న ఈ ఫొటో అతనికి 08.02.1915 గురువారము (దశనవమి) నాడు అందింది.
(బాబా సద్దు భయ్యాకు పంపించిన ఫోటో)
బాబా అతనికి ఒక ఉత్తరాన్ని కూడా పంపించారు అందులో “ఈ పటం ద్వారా నేను నీ ఇంటికి వచ్చాను. నా అనుమతి లేకుండా మరలా షిరిడీకి రావద్దు” అని రాసారు. ఆ ఫొటో రాగానే సద్దు భయ్యా రుద్రాభిషేకం, పూజా కార్యక్రమాలు జరిపించి, ఫొటోని ఒక సింహాసనంలో ఉంచి అన్నదానం జరిపించాడు. ఆ తరువాత ముక్తారామ్ ఇంటి పైకప్పు మీదకి ఎక్కి జెండాని ఎగురవేశాడు. జెండా ఎగరవేయడానికి అతను అతి ప్రమాదకరంగా ఇంటి పైకప్పు మీదకి ఎక్కి మూడవవంతు ఎత్తుకి జెండాని ఎగరవేయడంతో అతని చెయ్యి విపరీతంగా నొప్పి పుట్టింది. అదే సమయంలో ద్వారకామాయిలో బాబా తన దగ్గరే కూర్చుని ఉన్న ఒక భక్తుడిని తన చేతిని మర్ధనా చేయమని చెప్పి, ఇలా అన్నారు “అల్లా మాలిక్ గరీబోన్ కా వాలి హా. అల్లా సె బడా క్యోన్ హైన్ (దీనులకు రక్షకుడు భగవంతుడే. భగవంతునికన్నా గొప్పవాడెవరు?)” ఆయన ఆవిధంగా అన్న మరుక్షణంలోనే ఇక్కడ ముక్తారామ్ చెయ్యి నొప్పి మాయమయిపోయింది. ఎటువంటి ప్రయాస లేకుండా జెండాని ఎగురవేశాడు.
ఇంటి
పైకప్పు మీదకి ఎక్కి జెండాని ఎగురవేసి క్షేమంగా దిగివచ్చిన ముక్తారామ్ ని అందరూ సంతోషంతో
అభినందించారు.
బాబా సద్దు భయ్యాని ఎల్లవేళలా కనిపిట్టుకునే ఉన్నారు. ఒకసారి
హార్దా లో ప్లేగు వ్యాధి ప్రబలింది. గ్రామస్తులందరూ
ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోసాగారు. ఆ సమయంలో
సద్దు భయ్యా గ్రామానికి 7 మైళ్ళ దూరంలో నున్న తన పూర్వీకుల గ్రామమయిన బ్రహ్మిన్ గావ్
లో ఉన్నాడు. అతని తండ్రి బాబా ఫోటో దగ్గర ఉన్నాడు. సద్దు భయ్యా పటం గురించి, గ్రామంలో ఉన్న ప్లేగు
వ్యాధి గురించి బాబాకి ఉత్తరం వ్రాసాడు. బాబా
అతనిని హార్దాకు వెళ్ళి ఫోటోకి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉండమని, అతని తండ్రిని షిరిడీకి
పంపించమని ఉత్తరం వ్రాసారు. కొద్ది రోజుల తరవాత
రెండు ఎలకలు బాబా ఫోటో ముందు చచ్చిపడి ఉండడం చూసాడు సద్దు భయ్యా. అది చూసి సద్దుభయ్యా బాబా సలహా కోసం ఉత్తరం రాసాడు. బాబా తన సహజ దోరణిలో “భగవంతుడు ఉండగా దేనికీ భయపడనవసరం
లేదు” అని జవాబు వ్రాసారు. సద్దు భయ్యా అదే
ఇంటిలో క్షేమంగా ఉన్నాడు.
సద్దు
భయ్యాకి ముగ్గురు కొడుకులు. పెద్దవాడి పేరు,
ఆనందరావు, తరువాతివాని పేరు లక్ష్మణరావు, చిన్నవాడి పేరు శంకరరావు. సద్దు భయ్యా
1937 వ.సంవత్సరంలో సమాధి చెందాడు. బాబా పంపించిన
ఫోటో బ్రహ్మింన్ గావ్ లో ఉంది. ఆ ఫోటో ఆలనా
పాలనా చూసేవాళ్ళు ఎవరూ లేక అలా పడి ఉంది. ఒక
రోజు బాబా, లక్ష్మణరావు కి కలలో కనిపించి, "ఈ పటం రూపంలో నేను మీ ఇంటికి వచ్చాను. నువ్వేమో నన్ను నిర్లక్ష్యం చేసావు. రెండు రోజులలో
కనక నువ్వు వచ్చి, నన్ను తీసుకొని వెళ్ళకపోతే నా కాలు తినివేయబడుతుంది” అన్నారు. తనకు వచ్చిన కలకి అతను చాలా విభ్రాంతి చెందాడు. ఆ కలకి అర్ధం అనికేమీ బోధపడలేదు. ఆ రోజు కూడా యధావిధిగా
కోర్టుకి వెళ్ళాడు కాని మనశ్శాంతి కరువయింది.
ఆ రోజు రవ్వంత కూడా పని చేయలేకపోయాడు.
ఆ
రోజు రాత్రి మరలా అదే కల వచ్చింది. ఆ కలలో
బాబా దర్శనమిచ్చి “నేను హెచ్చరించినా నువ్వు పట్టించుకోలేదు. నువ్వు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళకపోతే చెదపురుగులు
నా కాలుని తినేస్తాయి” అన్నారు. ఆ కలకి లక్ష్మణరావు బాగా భయపడిపోయి, మరుసటి రోజు ఉదయమే
కోర్టుకు వెళ్ళి సెలవు పెట్టాడు. వెంటనే ఆదరా బాదరాగా బ్రహ్మిన్ గావ్ లో ఉన్న ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే తలుపు తెరిచి చూసాడు. ఇంటిలో ఉన్న బాబా ఫోటోని చూడగానే చాలా దిగ్భ్రాంతి
చెందాడు. అప్పటికే చెద పురుగులు బాబా ఫోటో
చుట్టూ ఉన్న చెక్క ఫ్రేముని తినేసాయి. బాబా
కాలి వ్రేలుకి క్రిందుగా ఉన్న ప్రాంతంలో అప్పటికే చెదపురుగులు దాడి చేసి ఉన్నాయి.
వెంటనే
ఫోటోని క్రిందకు దించి శుభ్రం చేసాడు. ఫోటోని
ఇండోర్ లో ఉన్న తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు.
అక్కడ ఆ ఫోటోని మరలా శుభ్రం చేసి తిరిగి మళ్ళి ఫ్రేమ్ కట్టించి తన ఇంటిలో ఉంచాడు. ప్రతిరోజూ దానికి పూజ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు బాబా ఆ పటం రూపంలో లక్ష్మణరావు కుమార్తె
వనిత ప్రేమాభిమానాల పర్యవేక్షణలో చాలా సుఖంగా ఉన్నారు.
(మరికొన్ని
వైభవాలు ముందు ముందు)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment