13.07.2016 బుధవారమ్
ఓం సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
2. ఆహారం – 1వ.భాగం
ఆంగ్లమూలం :
లెఫ్టినెన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదం:
ఆత్రేయపురపు త్యాగరాజు
ఈ రోజు సాయిబాబాగారు
ఆహారం గురించి ఏమని వివరించారో తెలుసుకుందాము. బోధనలు మరియు తత్వంలో రెండవ విషయం ఆహారం.
ఆచార వ్యవహారాలను,
నమ్మకాలను చాలా కఠినంగా ఆచరించేవారిలో సాయిబాబా చెప్పిన బోధనలు పెద్ద సంచలనం కలిగించాయి. ముఖ్యంగా ఆహారం గురించి ఆయన చేసిన బోధనలు మనలో మంచి
మార్పుని తీసుకొనివచ్చి అవి మనలని సంస్కరించే విధంగా ఉన్నాయి. ఆయన చెప్పిన చక్కని వచనాలు ఎంతో ఉపయోగకరమైనవి.
ముఖ్యంగా హిందూ,
జైన్, బౌధ్ధ మతాలవారందరూ కూడా మాంసాహారాన్ని త్యజిస్తే తప్ప ఆత్మసాక్షాత్కారం సాధ్యం
కాదని, ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం కూడా దుర్లభమని నమ్ముతారు.
సాయిబాబాకు ఎటువంటి
భవబంధాలు లేవు. ఆయన అత్యున్నతమైన పరిపూర్ణ జ్ఞానం కలిగిన సద్గురువు. ఇతరులకు కూడా అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించగల శక్తి ఆయనలో ఉంది.
ఏమయినప్పటికి మాంసాహారం మీద ఆయనకు అభ్యంతరమేమీ లేకపోవడమే కాదు, మాంసాహారులని
కూడా, దానిని త్యజించమని వారిని ఎప్పుడూ బలవంత పెట్టలేదు.
తొలి రోజులలో బాబా తానే స్వయంగా పెద్ద వంటపాత్రలో మాంసాహారమును వండి, ఫత్వా చదువుతూ మౌల్వీ చేత ఆరగింపు చేయించేవారు.ముందుగా మహల్సాపతికి, తాత్యాకోతే పాటిల్ కు ప్రసాదంగా పంపించిన తరువాత మిగిలినవారికి పంచుతూ ఉండేవారు. అధ్యాయం – 38

ఈ విధంగా చేయడానికి
రెండు కారణాలు ఉండచ్చు. హిందువులు, ముస్లింలకు
మధ్య ఐక్యత సాధించాలనే సాయిబాబా లక్ష్యం ఒకటి కావచ్చు. ఆ ఉద్దేశ్యంతోనే ఆయన ముస్లింఫకీర్ లాగ దుస్తులు
ధరించి ఫకీరులా జీవించారు. అందుచేత ఆయన మాంసాహారాన్ని
తీసుకొనే విషయానికి వస్తే అది సముచితమే. ఇక రెండవ కారణం, మన శాస్త్రాలలో చెప్పినటువంటి
బోధనలనే జాగ్రత్తగా గమనిస్తే, ఆధ్యాత్మిక జ్ఞానం, బ్రహ్మజ్ఞానమ్, సాధించాలంటే అనుసరింపతగిన
పద్ధతులలో మాంసాహారాన్ని త్యజించడమొక్కటే ఒక మార్గమనీ , కాని అదే లక్ష్యం కాదనే విషయం
మనకి స్పష్టంగా తెలుస్తుంది. వేదాలలో ప్రముఖంగా చెప్పబడిన సూక్తులన్నిటినీ విశ్వామిత్రునివంటి
క్షత్రియులైన మునులందరూ ఆమోదించారు. అలాగే
బ్రహ్మజ్ఞానిగా ప్రముఖుడయిన జనక మహారాజులాంటివారు కూడా క్షత్రియ వంశానికి చెందినవారు.
మాంసాహారం వారికి నిషిధ్ధం కాదు. మాంసాహారాన్ని విసర్జించాలంటే, తమ ఆనందం కోసంగాని, రుచికరమైన ఆహారం కోసంగాని అమాయక జంతువులని చంపడం మానుకోవాలి.
మాంసాహారం భుజించడంవల్ల ధ్యానంలో ఏకాగ్రతకు అవరోధం ఏర్పడుతుంది. మాంసాహారం రజోగుణాన్ని, తమో గుణాన్ని పెంచుతుంది. ఆ గుణాల ప్రభావం పడకుండా బ్రహ్మజ్ఞానం సిధ్ధించాలనుకునేవాడు మాంసాహారాన్ని త్యజించాలనే విషయాన్ని మనం ఒప్పుకొని తీరాలి. అయితే మాంసాహారం త్యజించకుండా ఎవరయినా ముక్తి గాని, జ్ఞానం కాని సంపాదించలేరు అన్న విషయం సరైనది కాదు. లేకపోతే మహమ్మద్ (పైగంబర్), జీసస్ క్రీస్తులాంటి ప్రవక్తలు, మహాపురుషులు జన్మించి ఉండేవారు కాదు.

అంతేకాక భారతదేశంలో శాహాహారులు అహింసా సిధ్ధాంతంమీద నమ్మకం ఉన్నవారే కాకుండా, మాంసాహారం అజ్ఞానాన్ని, కోరకలను పెంపొందిస్తుందనే కారణం చేత, భయం వల్ల మాంసాహారాన్ని ముట్టరు.
తరతరాలుగా వారి వంశస్తులందరూ కూడా శాఖాహారులవడం వల్ల వారి వంశంలో అది సాధారణమయిపోయింది.వారెప్పుడూ మాంసాహారాన్ని ముట్టనందువల్ల వారికి మాంసాహారమంటే ఏహ్యభావం అసహ్యం ఏర్పడ్డాయి. ఈరోజుల్లో శాఖాహారులలోని యువతీ యువకులంతా రెస్టారెంట్లలోను, హోటల్స్ లోను అన్ని రకాలుగాను తిని ఆనందిస్తున్నారు.
అదేవిధంగా అహింసా సిధ్ధాంతాన్ని పాటిస్తూనే శాఖాహారంలో కూడా మసాలాదినుసులతో బాగా వేయించిన పదార్ధాలు త్వరగా జీర్ణంకానివి, స్వీట్లు మొదలైనవి తీసుకోవడం వల్ల అవికూడా కోరికలని అజ్ఞానాన్ని పెంపొందిస్తాయి. ఇవికూడా ధ్యానంలో ఏకాగ్రతకు అవరోధాలు.
వాస్తవానికి ఒక వ్యక్తి తన సాధనలో పురోగతి సాధిస్తున్న కొద్దీ, మాంసాహారం పట్ల, రుచికరమైన ఆహారంపట్ల అతనికి ఉన్న వ్యామోహం తగ్గుతూ చివరికి పూర్తిగా క్షీణిస్తుంది. భజనలో పాల్గొన్నందువల్ల గాని, ముసలితనంలో దేవాలయాలను సందర్శించడం వల్ల గాని, మాంసాహారాన్ని (అనగా మాంసము, చేపలు, గ్రుడ్లు) మానివేయడంవల్ల సాధకులందరిలోను ఎవరూ ఘనత వహించలేరు. ఒకవేళ ఎవరయినా మాంసాహారాన్ని మాని వేసి, ఆ తరువాత మానసికంగా కలత చెందినా, (ఆయ్యో అనవసరంగా మానివేసామే అని భావించడం) రుచికరమైన ఆహార పదార్ధాలపై వ్యామోహం కలిగినా, వ్యాపార వ్యవహారాలలో ఇతరులను దోపిడీ చేసినా, మోసం చేసినా, గోవులు, గేదెలు, పక్షులు వీటియందు నిర్దయగా ప్రవర్తించినా, మాంసాహారాన్ని మానివేసి శాఖాహారిగా మారదామనే నిర్ణయం తీసుకోవడం శుధ్ధ దండగ, ఎందుకూ ఉపయోగం లేనిది.
బహుశ సాయిబాబాగారి
భావాలు, ఆలోచనలు ఇదే క్రమంలో ఉండి ఉండవచ్చు. అందుచేతనే ఆయన తన భక్తులను మాంసము ముట్టవద్దని
ఎప్పుడూ చెప్పలేదు. ఒక్కొక్కసారి బాబా హాస్యధోరణిలో
మాట్లాడుతూ సనాతన బ్రాహ్మణుడయిన దాదాకేల్కర్ ని (అధ్యాయం 38) బజారుకు వెళ్ళి మాంసము
కొని తెమ్మనేవారు. ఇంకా సద్బ్రాహ్మణుడయిన
(అధ్యాయం 23) కత్తితో మేకను చంపమని కాకాసాహెబ్ దీక్షిత్ ను ఆజ్ఞాపించారు.
కాని ఇదంతా వారు తమ గురువు ఏమి చెప్పినా దానిని వెంటనే ఆచరించడానికి సిధ్ధపడుతారా లేదా అని వారిని పరీక్షించడానికి మాత్రమే. ఒకవేళ వారు వెంటనే తాను చెప్పిన పనిని శిరసావహించి చేయడానికి సిధ్ధమవగానే వారిని వారించేవారు. అలాగే శాఖాహారులయిన తన భక్తులనెవరినీ కూడా ఎప్పుడూ మాంసాహారం తినమని ప్రేరేపించలేదు.

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment