12.07.2016
మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
ఈ
రోజు సాయి తత్వం గురించి మరికొంత సమాచారం తెలుసుకుందాము.
శ్రీసాయిబాబా
వారి బోధనలు మరియు తత్వము
ధనము
– ౩వ.భాగమ్
బాబా
స్వయంగా ఆచరించుట
ఆంగ్ల
మూలం లెఫ్టినెన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
బాబా
చెప్పిన సలహాలు సూచనలు కేవలం తన భక్తులకు
చెప్పడమే కాక తాను కూడా
స్వయంగా ఆచరించి చూపారు.
ఆత్మ
సాక్షాత్కారం పొందగేరేవారికి, సాంసారికి జీవితంలో ఉన్నవారికి వేరు వేరు సలహాలను
ఎవరికి తగినట్లు వారికి తగినట్లుగా చెప్పారు. ఆయన
ఇచ్చిన సలహాలు మామూలుగా చెప్పిన మాటలు కావు. ఆయన స్వయంగా ఆచరించిన
తరువాతనే మనకి ప్రబోధించారు.
ఉదాహరణకి
ఆయన ఇంద్రియ సుఖాలని పరిత్యజించారనే విషయం మనకందరికి తెలిసినదే. మొదట్లో
ఆయన ఆరుబయట ఒక వేపచెట్టుక్రింద కూర్చొని
ఉండేవారు. తరువాత
పాడుబడిన మసీదులోగాని, చావడిలోగాని, ఉంటూ ఉండేవారు.
చిరిగిన దుస్తులు, పొడవాటి కఫనీని ధరించి తలకు గుడ్డ చుట్టుకొని
సంచరించేవారు. చినిగిన
గోనెపట్టా మీద కూర్చొనేవారు.
భిక్షమెత్తి జీవించేవారు. ఇంతకన్నా
సర్వసంగ పరిత్యాగం ఇంకేమి ఉంటుంది?
తరువాత
తరువాత సాయిబాబా కీర్తి నలుదిశలకూ వ్యాపించడంతో అధిక సంఖ్యలో భక్తులు
రావడం ప్రారంభమయింది. కొంతమంది
భక్తులు ఆయన కూర్చోవడానికి మెత్తటి
దిండ్లు అమర్చిన ఆసనాన్ని తయారు చేశారు. ఆయనను వజ్రాలు, ముత్యాలదండలతో
అలంకరించి ఆయన శరీరాన్ని సిల్కు
శాలువాలతో కప్పేవారు. కాని
బాబా ఎప్పుడూ వీటిమీద వ్యామోహం చూపించలేదు. దానికి
విరుధ్ధంగా చాలాసార్లు ఆయన వాటిని లాగివేసి
కోపంతో బయటకు విసిరివేసేవారు.
చావడి ఉత్సవం సమయంలో భక్తులందరూ పల్లకీని తీసుకొనివచ్చేవారు. కాని
బాబా అందులో ఎప్పుడూ కూర్చోలేదు. భోజన
సమయంలో భక్తులు వివిధ రకాలయిన పదార్ధాలను
బాబావారికి సమర్పించడానికి తీసుకొనివచ్చేవారు. బాబావాటిని
చాలా అరుదుగా స్వీకరించేవారు. అన్నిటినీ
కూడా అక్కడ ఉన్న భక్తులందరికి
పంచిపెట్టేస్తూ ఉండేవారు.
అదేవిధంగా
బాబావారికి దక్షిణల రూపంలో వందల కొద్దీ రూపాయలు
వస్తూ ఉండేవి. కాని
ఎప్పుడూ తనకంటూ ఒక్క రూపాయని కూడా
బాబా మిగుల్చుకోలేదు. వచ్చినదంతా
భక్తులందరికీ పంచెపెట్టేసేవారు. సాయంత్రమయేటప్పటికి
ఆయన వద్ద ఏమీ మిగిలేది
కాదు. ఆయన
ప్రేమతో ధారాళంగా అందరికి దానం చేసేవారు.
కాని అవసరమయినవారికి మాత్రమే ఇచ్చేవారు. కాని
మరుసటి రోజుకి వంటకోసం బియ్యము, పప్పులు, మసాలా దినుసులు దుకాణదారులవల్ల
మోసగింపబడటానికి తావులేకుండా బేరమాడి మరీ కొని తెచ్చేవారు. కాని
ఎవరినుంచి ఉచితంగా మాత్రం తీసుకొనేవారు కాదు. పూలమొక్కలకు
నీరు పోయడానికి కుమ్మరివాడు కుండను ఇచ్చినా, పండ్లు అమ్మే స్త్రీవద్ద పండ్లు
కొన్నా, ఇంటి కప్పు మీదనించి
ఎక్కడానికి నిచ్చెన తెచ్చినవానికి డబ్బు ఇచ్చినా, బాబా
వాటికి తగిన వెల అప్పటికప్పుడే
చెల్లించేసేవారు.
ఆఖరుగా
ధనం విషయంలో బాబావారు చెప్పినవన్నిటినీ క్రోడీకరించి చూస్తే ఆయన మాటలు మనసులో
బాగా గుర్తుంచుకోదగ్గవి. పేదవారికి భగవంతుడు స్నేహితుడు అనేవారు బాబా.
అధ్యాయం 5
(ఇంతటితో
ధనం గురించిన విషయాలు సమాప్తం)
(రేపటినుండి
ఆహారం గురించి బాబా చెప్పిన విషయాలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment