Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, July 1, 2016

స్వామి శరణానంద - 2వ.భాగం

Posted by tyagaraju on 7:06 AM
   Image result for images of shirdi saibaba
       Image result for images of yellow and white roses

01.07.2016 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు


ఈ రోజు శ్రీస్వామిశరణానందగారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము.
   Image result for images of vaman rao patel

స్వామి శరణానంద - 2వ.భాగం 
ఆ సమయంలో నానా సాహెబ్ చందోర్కర్ బొంబాయిలో ఉన్నడు.  షిరిడీలో చిన్న హోటల్ వ్యాపారం చేసుకుంటున్న శ్రీబాలాభావూకి పరిచయ పత్రం రాసాడు.  వామనరావు తండ్రి ప్రాణ్ గోవిందదాస్ కి తన కొడుకు స్వభావం పూర్తిగా తెలుసు.  


కొడుకు న్యాయశాస్త్రం చదివినందువల్ల అతని మనసులో ఎప్పుడూ సందేహాలే. ప్రత్యక్షంగా చూస్తే గాని ఏవిషయాన్ని నమ్మడు.  అంతేకాదు “భగవంతుడిని ప్రత్యక్షంగా ముఖాముఖీ చూస్తే తప్ప భగవంతుడు ఉన్నాడనే నిజాన్ని నేను నమ్మను” అని ఎప్పుడూ అంటూ ఉండేవాడు వామనరావు.  ప్రాణ్ గోవింద దాస్ వామన రావుతో “పైన ఆకాశంలో నక్షత్రాలను చూడు, సూర్యచంద్రులు ఉదయించడం గమనించు. 
          Image result for images of sky at night

 వారు ప్రసాదించే కాంతి వల్లనే మానవజాతి, సమస్త జీవులు అన్నీ మనుగడ సాగిస్తున్నాయి.  ఇదంతా జరుగుతుండటానికి కారణం ఆ భగవంతుడే.  ఏదీ మన చేతిలో లేదు” అన్నాడు.  కాని ఈ మాటలేమీ వామనరావులో నమ్మకాన్ని కలిగించలేకపోయాయి.  “సరే, అవన్నీ వాటి వాటి విధుల ప్రకారం జరుగుతున్నాయి.  కాని వీటన్నిటిలో భగవంతుడు ఎక్కడ కనపడుతున్నాడు?” అని తండ్రితో వాదించాడు వామనరావు.  వామనరావులో అటువంటి స్థిరమయిన అభిప్రాయాలు ఉండటంవల్లనే దేవుడు ఉన్నాడనే విషయంలో ఎటువంటి నమ్మకాన్ని ఏర్పరచుకోలేకపోయాడు.  
          Image result for images of shirdi sai

వామనరావు షిరిడీ వెళ్ళేముందు తండ్రి అతనిని బాబావారి స్వభావాన్ని, ఆయన తన భక్తులను ఏవిధంగా అనుగ్రహిస్తూ ఉంటారో అన్నీ వివరంగా చెప్పాడు.  ఇంకా ఇలా చెప్పాడు  “బాబా ఒక అసాధారణమయిన వ్యక్తి.  ఆయనతో వాదన పెట్టుకోకు.  ఆయన చెప్పే మాటలన్నీ శ్రధ్ధగా ఆలకించి, వాటిలోని అంతరార్ధాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించు.  ఆయన చెప్పే మాటలు మంచయినా, చెడ్డయినా, ప్రేమతో చెప్పినా లేక ఆగ్రహంతో చెప్పినా వాటిని కృతజ్ఞతా భావంతో స్వీకరించు.  అటువంటి సత్పురుషులనుండి మనం కానుకగా ఏది స్వీకరించినా అది మన క్షేమం కోసమే”, అని హితవు చెప్పారు.  తండ్రి చెప్పిన మాటలను సావధానంగా ఆలకించి, బాలభావూకు వ్రాయబడిన  పరిచయ పత్రం తీసుకుని డిసెంబరు, 10, 1911 వ.సంవత్సరంలో షిరిడీకి బయలుదేరాడు.  అతను షిరిడీలోకి ప్రవేశించగానే ఎదురుగా చిన్న గుంపులోనుండి “సాయి బాబాకి జై’ అనే కేకలు వినిపించాయి.  మార్వాడీ టాంగావాలా టాంగాని ఆపి “ఆ గుంపు మధ్యలో నడచుకుంటూ వస్తున్న ఆయనే సాయిబాబా.  కాలినడకన లెండీ బాగ్ కు వెడుతున్నారు” అన్నాడు.  అలా చెబుతూ టాంగా నుండి దిగి సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేసాడు.  వామనరావు కూడా టాంగా దిగి నమస్కారం చేసాడు.  వామనరావుని చూడగానే బాబా “ఈశ్వర్ ఆహేకే మెహనున్, నహీమ్హ్వన్ తో నిఘ్, అర్ధం "మానవుడవయి ఉండి భగవంతుని ఉనికినే సందేహిస్తున్నావు. ఇక్కడినుంచి వెళ్ళిపో” అన్నారు.

“నేను అన్వేషిస్తున్న భగవంతుడు ఈయనే” అనుకున్నాడు వామనరావు.  తన తండ్రి షిరిడీ వచ్చినపుడు భోజనం చేసేవేళకి బాబా షీరా తెప్పించి తన తండ్రి కష్టాన్ని తొలగించిన లీల, తన తండ్రి అనుభవం గుర్తుకు వచ్చింది.  వామనరావు నానాసాహెబ్ చందోర్కర్ నుంచి ఉత్తరం తీసుకొని రావడం వల్ల బాలాభావు అతనికి దీక్షిత్ వాడాలో బస ఏర్పాటు చేసి, బాబా దర్శనానికి తీసుకొని వెళ్ళాడు.  బాబాను దర్శించుకుందామనే తహతహ అతని హృదయంలో రవ్వంతయినా తగ్గలేదు.  అందుచేత మరలా మార్వాడీ యాత్రికునితో కలిసి ద్వారకామాయికి వెళ్ళాడు.  కాని బాబా కోపంగా కూర్చొని ఉన్నారు.  వీరిద్దరినీ ద్వారకామాయిలోకి అడుగు పెట్టనివ్వలేదు.  దానితో ఇద్దరికీ భయంవేసి మధ్యాహ్న ఆరతికి వెళ్ళే సాహసం చేయలేదు.  వారు రాధాకృష్ణమాయి ఇంటిలో కూర్చొని, ఆరతి సమయంలో అక్కడినుండే బాబా దర్శనం చేసుకొన్నారు.  మధ్యాహ్నం భోజనమయిన తరువాత హైకోర్టు జడ్జీ శ్రీషింగానేతో కలిసి ద్వారకామాయికి వెళ్ళాడు.  రాధాకృష్ణమాయి పంపించిన ద్రాక్షపళ్లని వామనరావుకు ప్రసాదంగా ఇచ్చారు బాబా.  బాబా తన చేతిని దిండుమీద ఆన్చుకొని ఆసనంమీద కూర్చొని ఉన్నారు.  
            Image result for images of shirdi sai
ఆ దిండుకు ప్రక్కనే ఉన్న రాతిమీద వామనరావు కూర్చొన్నాడు.  కొద్ది నిమిషాల తరువాత భక్తుల బృందం ద్వారకామాయి వైపు రాసాగింది.  భక్తులంతా తమని ప్లేగువ్యాధినుండి కాపాడి రక్షించమని వేడుకొన్నారు.
(రేపు ఆఖరి భాగం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment