02.07.2016 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీ స్వామి శరణానంద గారి గురించి మిగిలిన సమాచారం తెలుసుకుందాము
స్వామి
శరణానంద - 3వ.ఆఖరి భాగమ్
1913
వ.సంవత్సరంలో న్యాయవాదిగా బార్ కౌన్సిల్ లో చేరిన తరువాత సెలవులలో మే 13 న షిరిడీకి వచ్చాడు. తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి ఇవ్వకపోవడంతో 1914
సం.మార్చ్ వరకు పదకొండు నెలలపాటు షిరిడీలోనే
ఉండిపోయాడు.
అతని తల్లిదండ్రులు కుమారుడి యోగక్షేమాల
గురించి, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకపోవడంతో చాలా బెంగ పెట్టుకొన్నారు. వారు ఒక జ్యోతిష్కుడిని సంప్రదించారు. ఆ జ్యోతిష్కుడు “మీ కుమారుడు క్షేమంగా భగవంతుని
స్వర్గధామం (షిరిడీ) లో ఉన్నాడు” అని చెప్పాడు.
ఆఖరికి బాబా అనుమతి ప్రసాదించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చాడు. 1916 సంవత్సరంలో అతని స్నేహితుడు షిరిడీ ప్రయాణమయి
వెడుతున్నపుడు సాగనంపడానికి స్టేషన్ కు వచ్చి, అప్పటికప్పుడే తనుకూడా షిరిడీకి బయలుదేరాడు. అతని రాక గురించి తనకు తెలుసని చెప్పి బాబా అతనిని
షిరిడీలో 21 రోజులు ఉంచేశారు.
ఒక
రోజున నిర్మాణం లో ఉన్న బూటీవాడా మీదుగా వెడుతుండగా ప్రమాదవశాత్తు అతని తలమీద పెద్ద
బండరాయి పడి తలకి పెద్ద గాయమయింది. రక్తం బాగా
కారడం మొదలయింది. దాంతో తెలివితప్పి పడిపోయాడు. కాని బాబా ఇచ్చిన మందులతో, ఆయన అనుగ్రహంతో తల లోపల
ఎటువంటి గాయం, ఆఖరికి దెబ్బ తగిలిన మచ్చ కూడా లేకుండా కోలుకొన్నాడు. గాయం గురించి వామనరావుని అడిగినపుడు తనకు ఎంతో ఆధ్యాత్మికానందం,
అనుభూతి కలిగాయని చెప్పాడు. ఆ రోజునుండి బాబాకు
అంకిత భక్తుడయ్యాడు. బాబా మీద స్థిరమయిన నమ్మకం
కలిగింది.
బాబా
ధరించే దుస్తులలో కూడా ఎంతో శక్తి దాగి ఉంది.
ఒకసారి బాబా మహల్సాపతికి తన కఫినీని కానుకగా ఇచ్చారు. దాని మహత్మ్యం వల్ల మహల్సాపతి తన సంసార బాధ్యతలు, సామాజిక
బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఒక సన్యాసిలాగ జీవితం గడిపాడు. మరొక సందర్భంలో బాబా తన కఫనీని ముక్తారాం కు కూడా
కానుకగా ఇచ్చారు.
ఆ కఫనీ మురికిగా ఉండటంతొ
ముక్తారాం దానిని శుభ్రంగా ఉతికి దీక్షిత్ వాడాలో ఆరబెట్టాడు. ఆ తరువాత బాబా దర్శనానికి వెళ్ళాడు. దీక్షిత్ వాడాలో బాబాగారి కఫనీ ఆరబెట్టిన చోట వామనరావు
ఉన్నాడు. ఆ కఫనీనుంచి వామనరావుకు “చూడు, ముక్తారాం
నన్నిక్కడకు తీసుకొని వచ్చి తల్లక్రిందులుగా వేలాడదీసాడు” అన్న మాటలు వినిపించాయి. వెంటనే ముక్తారాం ఆకఫనీని తీసుకొని తను ధరించాడు. కఫనీ ధరించిన తరువాత మసీదుకు వెళ్ళాడు. వామనరావు కఫనీ ధరించడం చూసి బాబాకి ఆగ్రహం వచ్చింది. కాని సమయం వచ్చినపుడు సన్యాసం స్వీకరిద్దామనే నిర్ణయంతో
వామనరావు ఉన్నాడు. అందుచేతనే బాబా ఏమీ మాట్లాడలేదు. ఆతరువాతనుంచి వామనరావు ఆధ్యాత్మిక విషయాలలో మంచి
పురోగతిని సాధించాడు.
1917
వ.సంవత్సరం మార్చి నెలలో అహమ్మదాబాద్ లోని మోడల్ హైస్కూలుకు హెడ్ మాస్టర్ గా నియమింపబడి,
ఆ పదవిలో 1921 జనవరి వరకు ఉన్నాడు. ఆ తరువాత
అదే సంవత్సరంలో బొంబాయి వచ్చాడు. అక్కడ మెసర్స్
గంగా అండ్ సాయనీ కంపెనీలో మానేజింగ్ గుమాస్తాగా చేరాడు.
ఒక
భక్తుడు ఆయనకు బాబా ఇమ్మన్నారని చెప్పి బాబా పాదుకలను ఇచ్చాడు. మొదట్లో ఆయన తీసుకోవడానికి ఇష్టపడలేదు. తరువాత వాటిని స్వీకరించి ఆ పాదుకలని అహమ్మదాబాద్
లోని ‘విష్ణుధర్మాలయ” పేరుతో ఉన్న బాబా మందిరంలో ప్రతిష్టించారు. వేలాది మంది భక్తులు ఆపాదుకలను దర్శనం చేసుకోవడానికి
వచ్చేవారు. అందరికీ ఎన్నో అనుభవాలు కలుగుతూ
ఉండేవి. స్వస్థత కూడా పొందుతూ ఉండేవారు.
1932
లో గుజరాతీ భాషలో ‘గురుస్మృతి’ ని రచించాడు. 1946 లో ‘సాయిబాబా’ అనే పేరుతో బాబా
జీవితచరిత్రను వ్రాసాడు. దాకోర్ లో బాబా అతనికి
ఒక ఫకీరుగా కనిపించి ‘సాయి శరణానంద’ గా నామకరణం చేసారు. 1961 లో ‘సాయిబాబా ది సూపర్ మాన్’ అనే పుస్తకం వ్రాసారు.
బాబా
ఆశీర్వాద బలంతో బాలాజీ వసంత్
తాలిమ్ ఎంతో సుందరమయిన బాబా
విగ్రహం చెక్కాడు.
ఆ విగ్రహాన్ని అక్టోబరు,1954, 7వ.తారీకు విజయదశమినాడు. సమాధి
మందిరంలో స్వామి సాయి శరణానంద ప్రతిష్టించారు.
సన్యాసం
స్వీకరించిన తరువాత 1952 వ సంవత్సరంనుండి బాబా
ఎల్లప్పుడూ తనతోనే ఉంటూ తన చేత
అన్ని సేవలనూ చేయించుకుంటూ ఉండేవారని చెప్పారు.
బాబాకు,
బాబా భక్తులకు ఎన్నో సంవత్సరాలు సేవ
చేసిన తరువాత స్వామి సాయి శరణానంద ఆగస్టు
25, 1982 వ. సంవత్సరంలో తన 93వ.ఏట
బాబాలో ఐక్యమయ్యారు.
స్వామి
సాయి శరణానందవారి సమాధి మందిరం ఈ
క్రింద చిరునామాలో అహమ్మదాబాద్ పట్టణంలో ఉంది.
చిరునామాః
స్వామి శరణానంద్ సమాధి మందిరం
c/o శ్రీమతి ఉషబెన్ భాటీ & శ్రీ ప్రతీక్ ఎమ్.త్రివేది
14/15 ప్రకృతి కుంజ్ సొసైటీ
న్యూ శారద్ మందిర్ రోడ్
శ్రేయాన్ హైస్కూల్ ఎదురుగా
అహమ్మదాబాద్ - 380015
గుజరాత్
(సమాప్తం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment