24.07.2016 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
(4) భక్తి మార్గం – (2వ.భాగం)
ఆంగ్ల
మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
శ్రీ
సాయి సత్ చరిత్ర 9వ.అధ్యాయం, బాంద్రా నివాసియైన బాబాసాహెబ్ తార్ఖడ్, ఆయన భార్య, కుమారుల
అనుభవాలను వివరిస్తుంది. ఆయనకు
విగ్రహారాధనలోను, దేవుని పటములు, సద్గురువులలోను నమ్మకం
లేదు.
ఒకసారి
బాబాసాహెబ్ గారి భార్య, కుమారుడు
షిరిడీ వెళ్ళారు. బాబాసాహెబ్
ఇంటిలోనే ఉండటం వల్ల, వారు
లేని సమయంలో ప్రతిరోజూ బాబా పటానికి పూజ
చేసి కలకండ నైవేద్యము పెట్టాలి.
తన కుమారుడు చేసినట్లే ప్రతిరోజు బాబాసాహెబ్, బాబాకు పూజ చేసినప్పటికీ, ఒక
రోజున పని తొందరలో కలకండ
నైవేద్యము పెట్టడం మరచిపోయారు. ఇది
జరిగిన మరుసటి రోజునే
బాబాసాహెబ్ గారి భార్య, కుమారుడు,
బాబా దర్శనానికి వెళ్ళినపుడు బాబా, శ్రీమతి తార్ఖడ్
తో “అమ్మా! బాంద్రాలో ఉన్న మీయింటికి ఏదయినా
తినవలెననే ఉద్దేశ్యంతో వెళ్ళాను. తలుపు
తాళము వేసి ఉంది. ఎలాగునో లోపలకు ప్రవేశించాను. కాని అక్కడ నాకు
తినడానికి తార్ఖడ్ గారు ఏమీ ఉంచకపోవడంతో
నిరాశతో వెనుకకు తిరిగి వచ్చాను” అన్నారు. తరువాత
బాబాసాహెబ్ కు బాబా చెప్పిన
ఈవిషయం విన్న తరువాత దేవుని
పటానికి గాని, విగ్రహానికి గాని,
నైవేద్యంగా పెట్టిన ఆహారపానీయాలు వారికి చేరతాయనే నమ్మకం ఏర్పడింది. భక్తి
శ్రధ్ధలు, నమ్మకం అవసరం.
1917 వ.సంవత్సరంలో హోళీపండుగనాడు పూర్ణిమ రోజున సాయిబాబా హేమాడ్
పంత్ కు కలలో కనపడి
ఆరోజున తాను వారి ఇంటికి
భోజనమునకు వచ్చెదనని చెప్పారు. తరువాత
ఆరోజు మధ్యాహ్నము అతిధులందరూ కూర్చొని భోజనం ప్రారంభింపబోయే సమయానికి
హేమాడ్ పంతుగారి ఇంటికి ఇద్దరు ముస్లిమ్ స్నేహితులు వచ్చారు. వారు
ఆలీ మహమ్మద్, ఇస్మూ ముజావర్ లు. వారిద్దరు
చక్కటి ప్రేములో కట్టబడిన బాబా చిత్రపటాన్ని తీసుకొని
వచ్చారు. హేమాడ్
పంతుకు కలలో, తాను
భోజనానికి వస్తానన్న మాటను బాబా ఆవిధంగా నిలబెట్టుకొన్నారు.
కొన్నాళ్ళ
తరువాత ఆలీమొహమ్మద్, హేమాడ్ పంతును కలుసుకొన్నాడు. ఆరోజున
తాను బాబా చిత్రపటాన్ని ఎందుకు,
ఏవిధంగా తీసుకొనిరావలసివచ్చిందో అంతా వివరంగా
చెప్పాడు (అధ్యాయం – 41). ఆలీమహమ్మద్ , సాయిబాబా చిత్రపటాన్ని వీధులలో తిరుగుతూ అమ్మేవాని వద్ద కొన్నాడు.
దానిని బాంద్రాలోని తన ఇంటిలో మిగతా
యోగుల పటాలతో పాటుగా గోడకు వ్రేలాడదీశాడు.
కొద్దిరోజుల తరువాత ఆలీఅహమ్మద్ కాలి
మీద కురుపు లేచి బాధపడుతున్న సందర్భములో,
బొంబాయిలోని తన బావమరిది ఇంటిలో
ఉన్నాడు. బాంద్రాలోని
తన ఇంటికి తాళము వేసి ఉంచాడు. అతని
బావమరిది ఇంటిలో యోగుల చిత్రపటాలను ఉంచి
పూజించడమంటే విగ్రహారాధన చేయడమేననీ, అది ఇస్లాం మతాచారాని విరుధ్ధమని చెప్పాడు. కాలిమీద
కురుపు తొందరగా తగ్గాలంటే గోడకున్న పటాలన్నిటినీ వెంటనే తీసివేయమని చెప్పాడు. ఆయన
చెప్పినట్లుగానే ఆలీమహమ్మద్ తన గుమాస్తాను పిలిచి
బాంద్రాలోని తనింటిలోఉన్న పటములన్నిటినీ సముద్రంలో పారవేయించాడు.
రెండు
మాసముల తరువాత ఆలీమొహమ్మద్ ఆరోగ్యం కుదుటపడి బాంద్రాలోని తన ఇంటికి వచ్చాడు. బాబా
చిత్రపటం ఇంకా గోడమీదనే ఉండటం
చూసి, ఆశ్చర్యపోయాడు. తన
గుమాస్తా పటములన్నింటినీ తీసివేసి సాయిబాబా పటాన్ని ఒక్కటినే ఎందుకని మరచిపోయాడో అతనికేమీ అర్ధం కాలేదు. హేమాడ్ పంత్ సాయిభక్తుడు కాబట్టి
ఆయన వద్ద పటము భద్రముగా
ఉంటుందని ఆరోజున ఆయనకు ఇచ్చారు. ఈ సంఘటనతో బాబా
తాను పటాలలో కూడా సజీవంగా ఉన్నానని
తన భక్తులకు తెలియచెప్పడమే కాక, హిందువుల విగ్రహారాధన
తప్పు కాదని, వాటిని అనువుగాని
చోట ఉంచకూడదనే విషయాన్ని ఒక ముస్లిమ్ కి
అర్ధమయేటట్లు చేశారు.
కాకా
సాహెబ్ తన కుమారుని ఉపనయనానికి
నాగపూర్ కి, అదే సమయంలో
నానాసాహెబ్ చందోర్కర్ తన కుమారుని వివాహానికి
గ్వాలియర్ రావలసినదని, ఇద్దరూ బాబాని ఆహ్వానించినప్పుడు, బాబా తన ప్రతినిధిగా
శ్యామా అనగా మాధవరావు దేశ్
పాండేని తీసుకొనివెళ్ళమని చెప్పారు. కాని, బాబాయే స్వయంగా రావలసినదని కాకా
సాహెబ్ పట్టుపట్టినపుడు “కాశీ ప్రయాగ యాత్రలు ముగిసేసరికి నేను శ్యామా కంటే ముందుగానే
గయలో కలుసుకొంటాను” అని బాబా అన్నారు. శ్యామా
గయ చేరుకొనేసరికి, అక్కడ పూజారి ఇంటిలో పటము రూపములో దర్శనమిచ్చి తాను శ్యామా కంటే
ముందుగానే గయలో ఉంటానని తను చెప్పిన మాటలకు ఋజువు చూపించారు బాబా.
(అధ్యాయం – 46).
ఇటువంటి అనుభవాలను
తన భక్తులకు ఇవ్వడంతోపాటుగా సాయిబాబా తన చర్యలు,
ఉపదేశాల ద్వారా సగుణరూపాన్ని పూజించడం గురించి కూడా ప్రచారం చేశారు. షిరిడీలో పాడుపడిన పురాతన ఆలయాలను, ధనవంతులైన తన భక్తులచేత బాగుచేయించడమే కాక, మొట్టమొదటగా ఆలయాలలోని
విగ్రహాలను పూజించకుండా ఏభక్తుడిని తనను పూజించనిచ్చేవారు కాదు. తన భక్తులకు ఆయన వెండినాణాలను బహుకరిస్తూ ఉండేవారు. వాటిని పూజామందిరంలో ఉంచి పూజించుకోమని చెప్పేవారు.
శ్రీమతి. M. W. ప్రధాన్ లాంటి కొంతమంది భక్తులకు తన వెండిపాదుకలను పూజించుకోమని ప్రోత్సహించేవారు.
(రేపు నవవిధ
భక్తులు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment