Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, August 29, 2016

సాయిబాబావారి బోధనలు మరియు తత్వము - 9. మాయ – 3వ.భాగమ్

Posted by tyagaraju on 10:52 PM
Image result for images of shirdi sainath
Image result for images of rose flowers

30.08.2016 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబావారి బోధనలు మరియు తత్వము
Image result for images of m b nimbalkar
ఆంగ్లమూలం : ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
9.  మాయ – 3వ.భాగమ్
మేధాఋషి, వారు చెప్పినదంతా ఆలకించి “ప్రేమాభిమానాలు మానవులకే కాదు, జంతువులు, పశుపక్ష్యాదులు అందరికీ సమానమే.  మీరిద్దరూ అజ్ఞానమనే మహామోహపాశ బధ్ధులై ఉన్నారు. 


అజ్ఞానం గురించి మీకు కొంత వివరించాలి.  విషయ పరిజ్ఞానం అన్ని జీవులకు ఉంది.  కాని, వివేచన అనే జ్ఞానం మానవులకు అదనంగా ఉంది.  సృష్టిలో సహజములైన ఆహార, నిద్రా, భయ, మైధునాలు జీవరాశికంతటికీ ఒకే రీతిలో ఉన్నాయి.  అక్కడ ఉన్న పక్షిని దాని పిల్లల్ని చూడండి.  ఆ తల్లి పక్షి తను ఆకలితో ఉన్నా కూడా తన పిల్లలపై మమకారంతో, మోహంతో ఏవిధంగా నోటికి తిండి అందిస్తున్నదో.  ఆవిధంగానే మానవులు కూడా ఎంతో వివేకం ఉన్నా, తాము ఇంతకాలం పెంచి పెద్ద చేసిన పిల్లలు తమను శక్తి ఉడిగిపోయాక ఆదుకుంటారనే ఆశతో జీవిస్తుంటారు.  మానవులకు ఈ మమతానుబంధాలు అన్నీ నిష్ప్రయోజనమని తెలిసినా గాని, మహామాయ యొక్క శక్తి వల్ల దాని ఉచ్చులో పడిపోతారు. 

మహామాయా హరేశ్వేషా తయా సంమోహయతే జగత్
జ్ఞాని నామణి చేతాంసి దేవీ భగవతీ సా   II55II
సా విద్యా పరమా ముక్తేహ్రేత్భూతా సనాతనీ II57II
సంసారబన్ధేహేతుశ్వ సైవ సర్వేశ్వరేశ్వరీ   II58II
                                          శ్రీ దుర్గాసప్తశతి అధ్యాయం – 1
(ఈప్రపంచమంతా మహామాయతో నిండి ఉంది.  (విష్ణుమాయ) ఈ చరాచర ప్రపంచానికి ఆమే సృష్టికర్తి.  ఎంత జ్ఞానవంతులయినా సరే ఆమె కల్పించే మోహంలో చిక్కుకుపోవలసిందే.  ఆమె మోహంలో పడి మునీశ్వరులే గిలగిలలాడిన సందర్భాలెన్నో.  ఆమెకి ప్రీతి కలిగితే జననమరణ చక్రాలనుండి తప్పిస్తుంది.  ఆమె ఆది శక్తి.  అత్యుత్తమమైన జ్ఞాన సంపన్నురాలు.  ఈప్రాపంచిక జీవితంలో మానవుడు చిక్కుకున్నా, లేక తప్పించుకున్నా దానికి కారకురాలు ఈమాయే (ఆదిపరాశక్తి).  ఆమె దేవతలకే అధిదేవత)
                Image result for images of adhiparasakthi
అయినాగాని, మానవుడు ఈసాంసారిక జీవితంలో ఉన్న వ్యామోహంనుండి బయట పడటానికి ప్రయత్నం చేయాలి.  శ్రీసాయి సత్ చరిత్ర 17, 23 అధ్యాయాలలో శరీరం ఆత్మ వీటిని పోలుస్తూ చాలా చక్కగా వర్ణించబడింది. 
“శరీరము రధము, ఆత్మ దాని యజమాని.  బుధ్ధి ఆ రధమును నడుపు యజమాని.  జీవుడు, చిలుక ఒకటే రకం.  శరీరంలో బంధింపబడి ఒకరుంటే, పంజరంలో మరొకటి బందీగా ఉంటుంది.  పంజరంలోనుండి బయటపడితేనే చిలుకకు స్వాతంత్ర్యం.  కాని కూపస్థ మండుకంలా ఉన్న ఆచిలుక పంజరంలోనే అన్ని సుఖాలు ఉన్నాయనుకుంటుంది.  స్వాతంత్ర్యంలోని ఆనందం అది ఎఱుగదు.  కాళ్ళు పైనుంచి తలక్రిందులుగా వ్రేలాడుతున్నా స్వేచ్చగా తిరుగలేక ఎగరలేక ఇరుకుగా ఉన్నా
                  Image result for images of parrot in cage
 “ఆహా! ఈ పంజరం ఎంత అందంగా ఉంది.  ఈ ఎఱ్ఱటి మిరపకాయలు, దానిమ్మగింజలు బయట ఎక్కడ దొరుకుతాయి.  బయట ఈసుఖముంటుందా అని అనుకుంటుంది.  దానిని పంజరంనుంచి బయటకు వదలగానే ఆకాశంలో స్వేచ్చగా విహరిస్తూ జామపండ్లు, దానిమ్మ తోటలలో దానికిష్టమయినన్ని పండ్లను ఆరగిస్తూ ఎంతో సంతోషాన్ని అనుభవిస్తుంది.

ఆఖరులో బాబా మనకు సమయం వచ్చినపుడెల్లా మరలా మరలా ఈవిధంగా హితోపదేశం చేశారు.
“ఈనరజన్మయొక్క గొప్పతనమేమిటంటే ఈజన్మలోనే భగవద్భక్తిని సాధించవచ్చు.  నాలుగు విధాల ముక్తి, ఆత్మప్రాప్తి ఈజన్మలోనే కలుగుతుంది.  మేఘమండలంలోని విధుల్లతవలె ప్రపంచం చంచలమైనది.  తల్లి, తండ్రి, సోదరి, భర్త, భార్య, పుత్రులు, పుత్రికలు, వీరందరూ కూడా నదీ ప్రవాహంలో ప్రవహించే కట్టెలవలె ఒకచోట కలిసి ఒక్క క్షణం ఉన్నా, అలల తాకిడికి విడిపోతారు.  వారు మళ్ళీ కలుసుకోరు".                                                                 అధ్యాయం – 14 ఓ.వి. 21-23

“మానవుడు జన్మించిన వెంటనే మృత్యుమార్గంలో పడతాడు.  అందుచేత మానవుడు ఒక పనిని చేద్దమని నిర్ణయించుకున్నపుడు రేపు చేద్దాములే లేకపోతే ఆతరువాతి రోజు చేద్దాములే అని వాయిదాలు వేసుకుంటూపోతే లభించిన అవకాశాన్ని కాలదన్నుకున్నట్లే.  అందుచేత మరణాన్నెప్పుడు స్మరణయంధుంచుకోవాలి.  శరీరం కాలుని శత్రువు.  ఇటువంటి లక్షణాలతో ఉన్న శరీరంతో ప్రపంచంలో అప్రమత్తంగా ఉండాలి.  ఈప్రపంచంలో సోమరితనం పనికిరాదు.  అట్లే పురుషార్ధంలో ఉదాసీనత ఉండకూడదు.”
                                                అధ్యాయం – 14
ఈమానవశరీరం చర్మం, మాంసము, రక్తం, ఎముకలుతో తయారయినది.  మోక్షానికి, ఆత్మసాక్షాత్కారానికి ప్రతిబంధకం.  అందుచేత ఈదేహాన్ని ముద్దుగా పెంచి విషయసుఖములకు అలవాటు చేసినచో నరకమున పడెదము.  దేహమును అశ్రధ్ధ చేయకూడదు, దానిని లోలత్వముతో పోషింపనూ కూడదు.  తగిన జాగ్రత్త మాత్రమే తీసుకోవాలి.  శరీరానికి ఆహారాన్నిచ్చి, దుస్తులను ఇచ్చి దానిని ఎంతవరకు పోషించాలో అంతవరకే కాని మితిమీరకూడదు.  గుఱ్ఱపు రౌతు తన గమ్యస్థానము చేరువరకు గుఱ్ఱమును ఎంత జాగ్రత్తగా చూచుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను.  ఆవిధంగా ఈమానవ శరీరాన్ని ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగించుకుని జననమరణ చక్రాలనుండి తప్పించుకునే ప్రయత్నం చేయాలి.
                                                 అధ్యాయం – 8
“ఎంతో పుణ్యం చేసుకోవడం వల్ల, గొప్ప అదృష్టం కొద్దీ ఈమానవ జన్మ లభించింది.  అందుచేత మనకు లభించిన ఈమానవ జన్మను సార్ధకం చేసుకోవాలి.  ప్రతిక్షణం మంచి పనులకే వినియోగించాలి.  ఈశరీరం రాలిపోకముందే ముక్తికోసం శ్రమించాలి.  ఈమానవ జన్మను ఒక్కక్షణం కూడా వ్యర్ధం చేయకూడదు.
                                       అధ్యాయం – 8 ఓ.వి. 41, 48
ఇక ముఖ్యంగా మనం గుర్తుంచుకోవలసిన విషయం –
Image result for images of shirdisaibaba lotus feet

“ఈమాయనుండి బయట పడాలంటే సద్గురు చరణాలను గట్టిగా  పట్టుకోవాలి.  ఆయనను సర్వశ్యశరణాగతి చేయాలి.  ఆయనను ఆశ్రయిస్తే జననమరణ చక్రాలనుండి తప్పిస్తారు.  మరణం అవశ్యంగా వచ్చి తీరుతుంది.  హరిని మాత్రం విస్మరించకూడదు.  ఇంద్రియాలతో ఆశ్రమ ధర్మాచారాలను ఆచరిస్తున్నా (సాంసారికి జీవితంలో నిమగ్నమయి ఉన్నా) చిత్తంలో హరి చరణాలను చింతిస్తూ ఉండాలి.”
                                        అధ్యాయం – 39 ఓ.వి. 82-83
(రేపు అహంకారం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List