01.09.2016
గురువారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
ఆంగ్లమూలం
: ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
10.
అహంకారం – 1వ.భాగం
తనకు
తాను గొప్పగా ఊహించుకుని డాంభికాన్ని ప్రదర్శిస్తూ సమాజంలో తిరగడమే అహంకారం. ఈ అహంకారమే మానవుని పతనానికి తొలిమెట్టు. ఈ అహంకారం అనేది హోదావల్లా కావచ్చు మరేదయినా కారణంవల్ల
కావచ్చు. ‘నేను’
అనే అహంకారం ఉన్నంతవరకు మానవుడు అభివృధ్ధి చెందలేడు.
సాయిబాబా ఈలక్షణానికి (అహంకారం) పూర్తి వ్యతిరేకి. ఈ ప్రపంచంలో జీవిస్తున్నంత కాలం అణకువతో మెలగి ఉండమని
సాయిబాబా తన భక్తులకు హితవు చెప్పారు.
“నా ప్రియమయిన భక్తులారా! మీకు ఐశ్వర్యం ప్రాప్తించినపుడు, ఫలాలతో నిండుగా
ఉన్న వృక్షం వంగి ఉండునట్లుగా, మీరు కూడా అణకువతో మెలగండి” (71)
“పుణ్యాత్ములు, సాధు సత్పురుషులను ఎల్లప్పుడు
గౌరవించండి. గాలి వీచునప్పుడు క్రిందకు వంగిఉండే
గడ్డి మొక్కలవలె ఒదిగి ఒదిగి ఉండండి” (72)
“ఐశ్వర్యం అన్నది మధ్యాహ్నపు ఎండవలె తాత్కాలికం
అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఐశ్వర్యం ప్రాప్తించిందనే
అహంకారంతో ఎవరినీ భాధించకూడదు.” (73)
దాసగణు అర్వాచీన భక్తలీలామృతం
– అధ్యాయం – 32
శ్రీసాయిబాబా
జీవిత చరిత్ర వ్రాయడానికి ఆయన అనుమతిని ప్రసాదించమని ధబోల్కర్ గారు శ్యామా ద్వారా అడిగించినపుడు,
సాయిబాబా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. – అతని అహంకారాన్ని విడిచి నాపాదాల వద్ద పెట్టమను. నా శరణు జొచ్చిన అతని కోరిక ఈడేర్తుంది. అతడు కేవలం నిమిత్త మాత్రుడు. నా చరిత్రను నేనే వ్రాసుకుంటాను. నా భక్తుల కోరికలను నేనే తీరుస్తాను. భక్తుల అహంభావమును పోగొట్టి వారికి నాపాదాల వద్ద
ఆశ్రయమిస్తాను. ఎవరయితే అహంకారాన్ని వదలి నా
శరణుజొచ్చుతారో వారికి నేను సహాయం చేస్తాను” అన్నారు.
అధ్యాయం – 2
సాయిబాబా
తాను భోధించినవన్నీ ఆచరణలో చేసి చూపారు. ఎంతో మంది భక్తులు సాయిబాబా జీవించి ఉన్న రోజులలో
ఉన్నవారే గాక ఈనాటి భక్తులు కూడా సాయిబాబా భగవంతుని అవతారమనే నమ్ముతారు. కాని, సాయిబాబా ఎప్పుడూ తాను భగవంతుడినని చెప్పుకోలేదు. తాను భగవంతుని సేవకుడిని మాత్రమేనని చెబుతూ ఉండేవారు. ఎప్పుడూ’అల్లామాలిక్’ (అనగా భగవంతుడే
సర్వాధికారి) అని అంటూ ఉండేవారు. తరువాత తరువాత
సాయిబాబాయొక్క గొప్పతనం నలుదిశలా వ్యాప్తి చెందడంతో దూరప్రాంతాలనుంచి ఎంతోమంది ఆయనను
దర్శించుకోవడానికి రావడం ప్రారంభించారు. అందరూ
ఆయనకు సమర్పించుకోవడానికి పూలు, పళ్ళు, దక్షిణ తీసుకొని వస్తు ఉండేవారు. వారు బాబాని పూజించుదామని ప్రయత్నించినపుడు బాబా
ప్రతిఘటించేవారు. ఒక్కొక్కసారి వారు పళ్ళెములతో
తెచ్చినవాటినన్నిటినీ కోపంతో విసిరివేస్తూ ఉండేవారు. కాని, భక్తులు పట్టినపట్టు విడవకపోవడంతో వారి ప్రేమను
అర్ధం చేసుకొని తనను పూజించుకోవడానికి అనుమతించారు.
బాబాకు
సన్నిహితులు, ధనికులయిన భక్తులలో నానాసాహెబ్ చందోర్కర్, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటివారు
మసీదులో రాళ్ళను పరచడానికి, పైకప్పు వేయడానికి ప్రయత్నించినపుడు బాబా చాలా
కోపోద్రిక్తులై భక్తులు నాటిన ఇనుపస్థంభాలని పీకిపారవేసేవారు. చావడి ఉత్సవం కోసం బాబావారికి రాధాకృష్ణమాయి పల్లకీని
ఏర్పాటు చేసింది. కాని బాబా దానినెప్పుడూ ఉపయోగించుకోలేదు. కాలినడకనే వెళ్ళడానికి మొగ్గు చూపేవారు. హిందువులు, ముస్లిమ్ లు అందరూ ఆయనని దర్శించుకోవడానికి
వస్తూ ఉండేవారు. కాని వారు తనకు నమస్కరిస్తున్నారా
లేదా అన్ని విషయాన్ని కూడా బాబా పట్టించుకునేవారు కాదు.
ఒకసారి
నానావలి బాబా వద్దకు వచ్చి, -- “లే! నేను నీసింహాసనం మీద కూర్చుంటాను” (నీ గద్దెపై)
అని అధికారికంగా బాబాని సింహాసనంమీదనుంచి లెమ్మన్నాడు. వెంటనే బాబా మారు మాట్లాడకుండా గద్దెమీదనుంచి లేచి
నానావలిని కూర్చోనిచ్చారు. ఒక్క నిమిషంలోనే
నానావలి గద్దెమీదనుండి లేచి బాబాకి వినమ్రంగా నమస్కరించి, “బాబా! ఈ గద్దెపై కూర్చుండటానికి
నీవే తగినవాడివి” అన్నాడు.
సాయిబాబావారిలో
అద్భుతమయిన యోగశక్తులు, మానవాతీత శక్తులు ఉన్నాయి. తన శక్తుల ద్వారా బాబా తన భక్తులయొక్క బాధలను, రోగాలను
నివారిస్తూ ఉండేవారు. డా.పిళ్ళేకు కాలిలో ఉన్న
గినియా పురుగులను తొలగింపచేసి ఆ బాధనుండి విముక్తుడిని చేసారు.
(అధ్యాయం – 34). భీమాజీ పాటిల్ క్షయరోగాన్ని
నివారించారు. (అధ్యాయం – 13). ఎక్కడో దూరంలో
ఉన్న జామ్ నేర్ లో ప్రసవ వేదన పడుతున్న నానాసాహెబ్ చందోర్కర్ కుమార్తె మైనతాయి ప్రసవ
వేదన పడుతుంటే టాంగా తోలేవానిగా అవతారమెత్తి ఊదీ, ఆరతి పాటను వెంటనే ఆమెకు అందేలా చేసి
సుఖప్రసవం కలిగేలా సహాయ పడ్డారు. కాని తానే
ఈపనులు చేసానని బాబా
(తానే కర్తనని) ఎప్పుడూ చెప్పుకోలేదు.
(అహంకారం
ఇంకా మిగిలి ఉంది)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
1 comments:
i am big fan of sai baba you can visit this site for Sai Baba
Post a Comment