05.10.2016
బుధవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
ఆంగ్ల
మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్ - సెల్: 9440375411
18.
గురుభక్తి – 1వ.భాగమ్
బ్రహ్మం
గురించి తెలుసుకోవాలన్నా, ఆత్మ సాక్షాత్కారం పొందాలన్నా ఒక సద్గురువు యొక్క మార్గదర్శకత్వం
వల్లనే సాధ్య పడుతుందన్న విషయం మన భారతదేశంలో
వేదాలు, పురాణాల కాలంనుంచి ఉంది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చినదేమీ కాదు.
తద్విజ్ఞార్ధ్
స గురుమేవామిగచ్చేత్
సమిత్యాణి
శ్రోత్రియం బ్రహ్మనిష్ఠమ్
ముండోకోపనిషత్
(ఈ
సృష్టికి మూలకారణమయిన బ్రహ్మం గురించి తెలుసుకోవాలంటే గురువును ఆశ్రయించాలి. ఆగురువు వేదశాస్త్ర పారంగతుడయి ఆపరబ్రహ్మను గూర్చే
చింతిస్తూ ఆయనలోనే లీనమయి ఉండాలి. నిత్యాగ్నిహోత్రుడయి
హోమం చేయడానికి చేతిలో సమిధలను పట్టుకెడుతున్నవాడయి ఉండాలి.)
పౌరాణిక
కాలంలో కూడా శ్రీకృష్ణపరమాత్మ అర్జునునకు (శ్రీసాయి సత్ చరిత్ర 33వ.అధ్యాయంలో భగవద్గీతలో
ఈవిషయం ప్రస్తావింపబడింది) చేసిన ఉపదేశం సాయి భక్తులందరికీ తెలుసు.
తద్విధ్ధి
ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా I
ఉపదేశ్యంతే
జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః II
శ్రీమద్ భగవద్గీత – అధ్యాయం
-4 – శ్లో.34
(నీవు తత్త్వమును దర్శించిన జ్ఞానులకడకేగి, ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికి దండప్రణామములాచరించుటవలనను, సేవలొనర్చుటవలనను,
కపటము లేకుండ భక్తిశ్రధ్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను, పరమాత్మ తత్త్వమును
చక్కగానెఱింగిన జ్ఞానులు సంప్రీతులై, నీకు ఆపరమాత్మ తత్త్వజ్ఞానమునుపదేశించెదరు)
సరస్వతీ
గంగాధర్ వ్రాసిన గురుచరిత్ర 39వ.అధ్యాయంలో గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరునిగా గురువే
పరబ్రహ్మగా అభివర్ణించారు.
గురుర్
బ్రహ్మ గురుర్ విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురు
సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః
(గురువే
బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు
వాస్తవానికి
గురువే పరబ్రహ్మ, అటువంటి గురువునకు ప్రణామములు)
గురుచరిత్ర
మనకింకా తెలియచేసేదేమిటంటే, దేవతలు, గంధర్వులు, పితృదేవతలు, ఋషులు, సిధ్ధులు ఎవరయినా
సరే తమయొక్క గురువుకు సేవచేయనిదే జననమరణ చక్రాలనుండి తప్పించుకోలేరు.
న
ముక్తా దేవగంధర్వః పితరో యక్షకిన్నరాః
త్రుషయం
సర్వసిధ్ధాశ్వగురుసేవా పరాడ్ ముఖాః II 47
II
400
నుంచి 700 సంవత్సారాల క్రితమే జ్ఞానేశ్వర్ తను రచించిన జ్ఞానేశ్వరిలోను, ఏకనాధ్ మహరాజ్
తను రచించిన ఏకనాధ భాగవతంలోను, గురువుయొక్క ఆవశ్యకత గురించి మరీ మరీ చెప్పారు.
“ఆద్యంతములు
లేనివానిని ఎట్లు కౌగలించుకోగలము? అత్యంత ప్రకాశవంతమయిన
వెలుతురును మరింత తెల్లని వెలుతురుగా ఏవిధంగా చేయగలము? దోమ తన పిడికిటలో ఆకాశమును ఇమడ్చగలదా? (74)
“కాని,
అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసే శక్తి మనమాశ్రయించిన గురువుకే ఉంది. ఆనమ్మకంతోనే నాగురువు
నాయందు ఉన్నాడనే గట్టి విశ్వాసంతోనే నేను ఈ మాటలు అనగలుగుతున్నాను” (75)
జ్ఞానేశ్వరి -
అధ్యాయం – 1
(జ్ఞానేశ్వరి,
అర్జున విషాదయోగం లో జ్ఞానేశ్వర్ వ్రాసిన ముందుమాటలలోనివి.)
సద్గురువుయొక్క
కృపా కటాక్షణాలు లేకుండా, ఆయన సహాయం లేకుండా బ్రహ్మం గురించిగాని, ఈ విశాల విశ్వంయొక్క
స్వబావాన్ని తెలుసుకోవడంగాని సాధ్యం కాదు.
(7)
“కళ్ళు
ఎటువంటి లోపం లేకుండా సుందరంగా ఉండి అన్నీ స్పష్టంగా చూడగలిగిన శక్తి ఉన్నప్పటికీ,
సూర్యుడు లేనిదే అంతా చీకటె “. (8)
ఏకనాధ భాగవతం
– అధ్యాయం – 10
సాయిబాబా
కూడా నిరంతరం గురువుయొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తూ వర్ణించి చెబుతూ ఉండేవారు.
ఆయన చాలా సరళమయిన భాషలో గురువును ఏవిధంగా ఆరాధించాలో, సేవచేయాలో తన స్వంత అనుభవాన్నే
ఉదాహరణగా మనకు చాలా వివరంగా చెప్పారు. అసలయిన
గురుభక్తి ఏవిధంగా ఉంటుందో ఉదాహరణలుగా చూపిస్తూ అప్పుడప్పుడు కధలుగా చెబుతూ ఉండేవారు. శ్రీసాయి సత్ చరిత్రలో గురుసేవ, గురుభక్తి గురించే ప్రత్యేకంగా ఆరు అధ్యాయాలు ఉన్నాయి. అంతేకాదు,
శ్రీసాయి సత్ చరిత్రలో ఆరెండింటి విషయాలకు సంబంధించినవన్నీ ఒకేచోట క్రోడీకరించినట్లయితే
ఆ ఓవీలన్నీ కలిపి మొత్తం 257 ఓవీలతో, మరాఠీ గురుగీత అవుతుంది. సంస్కృతభాషలోని శ్రీగురుచరిత్రలో
ఈ ఓవీలన్నీ మనకు లభ్యమవుతాయి.
18,19
అధ్యాయాలను ఒకసారి గమనిద్దాము. సంగమనేర్ నుండి
రాధాబాయి అనే ఆమె కొంతమందితో కలిసి షిరిడీ వచ్చింది. సాయిబాబా తనకు మంత్రోపదేశం చేస్తే తప్ప భోజనం, నీళ్ళు
తీసుకోకుండా ఉపవాస దీక్ష చేస్తానని భీష్మించుకుని కూర్చుంది. సాయిబాబా ఎవరికీ ఎటువంటి మంత్రోపదేశం చేయలేదు. రాధాబాయి తను అన్నట్లుగానే తన బసలోనే ఉపవాసం ప్రారంభించింది. మూడురోజులయినా తన దీక్షను విరమించలేదు. ఆమె స్థితిని చూసి మాధవరావు చాలా కంగారుపడి, ఆమెను
పిలిచి మాట్లాడమని బాబాను వేడుకొన్నాడు.
అప్పుడు
బాబా ఆమెను పిలిపించి, “అమ్మా! నా గురువు గొప్ప యోగీశ్వరుడు, మిక్కిలి దయార్ద్రహృదయులు. ఆయనకు నేనెంతో కాలం శుశ్రూష చేశాను. కాని, ఆయన నాకెటువంటి మంత్రాన్ని ఉపదేశించలేదు.
( ఓ.వి. 47)
“మొదట్లో
ఆయన నాగుండు గొరిగించి నానుండి రెండు పైసలు దక్షిణ అడిగారు. నేను వెంటనే దక్షిణ సమర్పించాను. నాకు మత్రోపదేశం
చేయమని ఎంతో ఆశగా మరలా అడిగాను.”
(ఓ.వి.
49)
(ఇంకా
ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment